Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 22 May 2022 13:24 IST

1. అద్దంకి వైకాపా ఇన్‌ఛార్జ్‌కు నిరసన సెగ.. మెల్లగా జారుకున్న నేత

‘గడప గడపకు మన ప్రభుత్వం’ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న అధికార పార్టీ నేతలకు నిరసన సెగ ఎదురవుతూనే ఉంది. కొన్ని చోట్ల వైకాపా నేతలపై ప్రశ్నల వర్షం కురిపిస్తుండగా.. మరికొన్ని చోట్ల తమ సమస్యలను ప్రజలు ఎకరువు పెడుతున్నారు. తాజాగా బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం కుందుర్రులో అధికార పార్టీ నేతలను తమ సమస్యలపై పలువురు ప్రశ్నించారు. అద్దంకి వైకాపా ఇన్‌ఛార్జ్‌ బాచిన కృష్ణ చైతన్యను ఓ మహిళ నిలదీశారు. వీవోఏగా ఎప్పట్నుంచో తాను పని చేస్తున్నా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తెలంగాణలో లీటర్‌ పెట్రోల్‌ రూ.80కే ఇవ్వొచ్చు: బండి సంజయ్‌

రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావమున్నా కేంద్ర ప్రభుత్వం చమురు ధరలను తగ్గించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. పెట్రో ధరలు తగ్గించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్‌ తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌లో బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘లీటర్‌ పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం రూ.30 పన్ను విధిస్తోంది. రాష్ట్రం వ్యాట్‌ తగ్గిస్తే లీటర్‌ పెట్రోల్‌ రూ.80కే ఇవ్వొచ్చు. దొచుకున్న సొమ్ము దాచుకునేందుకే కేటీఆర్‌ విదేశీ పర్యటనకు వెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మంత్రుల బస్సుయాత్రలో ప్రజలు రాళ్లు విసురుతారేమో?: జేసీ ప్రభాకర్‌రెడ్డి

వైకాపా ప్రభుత్వ అరాచకాలతో ప్రజలు విసిగిపోయారని తెదేపా సీనియర్‌ నేత, తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఏం జరుగుతుందో చూస్తున్నామన్నారు. మంత్రులు బస్సు యాత్రకు పోలీసు రక్షణ పెంచుకోవాలని.. ప్రజలు రాళ్లు విసురుతారేమో అని ఎద్దేవా చేశారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ నేత కాలవ శ్రీనివాసులును రాయదుర్గంలో ఆలయానికి కూడా వెళ్లనీయరా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కొత్తగా 2,226 కేసులు.. 2,202 రికవరీలు..

దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు 2500లోపే నమోదవుతుండటం ఊరట కలిగిస్తోంది. మరోవైపు క్రియాశీల కేసులు కూడా 15 వేల దిగువనే కొనసాగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. నిన్న 4,42,681 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,226 కేసులు వెలుగులోకి వచ్చాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 65 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. డయాఫ్రమ్‌ వాల్‌ కొత్తది నిర్మించాలా?: పోలవరంపై సమీక్ష

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్‌ నేతృత్వంలో క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహిస్తున్నారు. దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణంపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్దే జరుగుతున్న ఈ సమీక్ష సమావేశంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సహా మరికొందరు అధికారులు హాజరయ్యారు. డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర జల శక్తి శాఖ పలు దఫాలుగా సమీక్ష నిర్వహించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Praggnanandhaa: అదో గ్రాండ్‌ మాస్టర్ల ఇల్లు..!

మాగ్నస్‌ కార్ల్‌సన్‌.. చెస్‌లో అరవీర భయంకరుడు. ప్రత్యర్థులు కోలుకోలేని విధంగా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడంలో దిట్ట. తన దూకుడైన ఆటతీరునే ఆయుధంగా చేసుకొంటాడు. అలాంటి కార్లసన్‌ను చెన్నైకి చెందిన 16ఏళ్ల కుర్రాడు మూడు నెలల్లో రెండు సార్లు ఓడించాడు. అతడి పేరే రమేశ్‌బాబు ప్రజ్ఞానంద. బాల్యంలో ఎవరైనా కొత్త విషయాలు అత్యంత వేగంగా నేర్చుకొంటారు. ఆ సమయంలో వారిని తల్లదండ్రులు తీర్చిదిద్దితే.. భారత్‌లో ఛాంపియన్లు పుట్టుకురావడం తేలికే అని నిరూపించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. తెలుగు రాష్ట్రాల్లో.. ఆరు వేర్వేరు ప్రమాదాల్లో 13 మంది దుర్మరణం

తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉదయం రహదారులు నెత్తురోడాయి. ఆరు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆయా ప్రాంతాల్లో ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వరంగల్‌లోని ఖమ్మం బైపాస్‌ హంటర్‌ రోడ్డు ఫ్లైఓవర్‌ నుంచి కారు కిందపడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. ఎంజీఎంలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. భారత్‌లో పెట్రో ధరల తగ్గింపుపై స్పందించిన ఇమ్రాన్‌ఖాన్‌

అధికారంలో ఉండగా భారత్‌పై అర్థరహిత ఆరోపణలు చేసిన పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌.. పదవీచ్యుతుడయ్యాక ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై సుంకాన్ని తగ్గించడంపై ఆయన స్పందించారు. అమెరికా ఒత్తిడిని సైతం సమర్థంగా ఎదుర్కొని భారత్‌ రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేసిందన్నారు. క్వాడ్‌ కూటమిలో ఉన్నప్పటికీ.. భారత్‌ తమ ప్రజలకు ఉపశమనం కల్పించడం కోసమే అలా చేసిందని వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కొత్త ఉద్యోగాలకు కొదవ లేదు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-23) ఉద్యోగ నియామకాలపై ఆశావాదంతో ఉన్నట్లు భారతీయ కంపెనీలు వెల్లడించాయని జీనియస్‌ కన్సల్టెంట్స్‌ నివేదిక పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథాన సాగుతుండటంతో కొత్త ఉద్యోగుల్ని నియమించుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సర్వేలో పాల్గొన్న కార్పొరేట్లు తెలిపారని వివరించింది. నియామకాలు, వలసల ధోరణిపై జీనియస్‌ కన్సల్టెంట్స్‌ రూపొందించిన నివేదిక ప్రకారం.. 72 శాతం మంది కార్పొరేట్లు కొత్త నియమాకాలు చేపడతామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. క్షమాపణలు చెప్పకపోతే రూ.10 కోట్లు కట్టాల్సి ఉంటుంది: ధనుష్‌

ఇంతకాలం తమ పరువుకు భంగం కలిగించింది చాలని, ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ ఓ దంపతులకు నటుడు ధనుష్, ఆయన తండ్రి కస్తూరి రాజా లీగల్‌ నోటీసులు పంపించారు. ధనుష్‌ తమ మూడో కుమారుడని, సినిమాల్లో నటించాలనే ఉద్దేశంతో చిన్నతనంలోనే ఇంటి నుంచి పారిపోయాడంటూ మధురైకి చెందిన కతిరేసన్, మీనాక్షి దంపతులు నాలుగేళ్ల నుంచి ఆరోపణలు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని