Updated : 23 May 2022 13:50 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. చైనా ఎడారిలో ఆపరేషన్‌ తైవాన్‌కు పదును..!

ప్రపంచం మొత్తం ఉక్రెయిన్‌ యుద్ధం వైపు చూస్తుండగా.. చైనా మాత్రం మెల్లిగా తైవాన్‌ ఆక్రమణకు అవసరమైన వ్యూహాలకు పదను పెడుతోంది. తైవాన్‌కు అండగా నిలిచే ప్రధాన దేశాలైన అమెరికా, జపాన్‌లను దెబ్బతీయడంపై దృష్టిపెట్టింది. ఈ విషయం ఇటీవల ప్లానెట్‌ ల్యాబ్‌ అనే ఓ సంస్థ చిత్రీకరించిన ఉపగ్రహ చిత్రాల్లో బయటపడింది. ఓ వైపు ఉక్రెయిన్‌ యుద్ధంలో పశ్చిమ దేశాలు, అమెరికా తలమునకలై ఉన్నప్పుడు డ్రాగన్‌ ఈ రకమైన యుద్ధ విన్యాసాలు చేయడం ఆందోళనకరంగా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ!

ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారిన మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతి కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కేసులో ఎమ్మెల్సీని ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్న నేపథ్యంలో ఆయన్ను ఎప్పుడు అరెస్ట్‌ చేస్తారని దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అనంతబాబును అరెస్ట్‌ చేస్తామని శనివారం రాత్రే జిల్లా ఎస్పీ ప్రకటించినప్పటికీ దానికి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని పోలీసులు ఇవ్వలేదు. పోస్టుమార్టం ఆలస్యం కావడం వల్లే కేసులో తాము ముందుకు వెళ్లలేకపోయామని పోలీసులు చెబుతూ వస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సంపాదించడానికి సంక్షోభం ఓ సదావకాశం!

ఇప్పటి వరకు ప్రపంచం అనేక సంక్షోభాలను చవిచూసింది. తాజా కరోనా, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం అందులో కొన్ని. ముఖ్యంగా ఈక్విటీ మార్కెట్లలో మదుపు చేసేవారికి వీటి ప్రభావం ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇలాంటి సంక్షోభ సమయాల్లో పెట్టుబడులు కచ్చితంగా ఉపసంహరించుకోవాలా? సుదీర్ఘంగా కొనసాగే ఇలాంటి ఘటనలకు భయపడి ఎంతకాలం మార్కెట్లకు దూరంగా ఉంటాం? కఠిన సవాళ్లను సైతం ఎదుర్కొని నిలదొక్కుకునే మార్గాలు లేవా? ఉన్నాయనే అంటున్నారు ఆర్థిక నిపుణులు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. భారత్‌లో రైల్వే ట్రాక్‌లు పేల్చేందుకు పాక్‌ ఐఎస్‌ఐ కుట్ర..!

భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ కుట్రలు పన్నుతోందని నిఘా సంస్థలు తాజాగా హెచ్చరికలు జారీ చేయడం కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా రైల్వే ట్రాక్‌లను లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుళ్లకు పాల్పడేందుకు పథకం రచించినట్లు హెచ్చరించాయి. పంజాబ్‌ సహా దాని పొరుగు రాష్ట్రాల్లో రైల్వే ట్రాక్‌లను పేల్చేందుకు ఐఎస్‌ఐ ముఠా సభ్యులు ప్లాన్‌ చేసినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Gujarat vs Rajasthan: నువ్వా.. నేనా..? ఫైనల్‌కు ఎవరు ..?

భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌ 70 లీగ్‌ మ్యచ్‌లు పూర్తిచేసుకొని ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్‌, రాజస్థాన్‌ మంగళవారం తొలి క్వాలిఫయర్‌ ఆడనుండగా.. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన లఖ్‌నవూ, బెంగళూరు బుధవారం ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో పోటీపడనున్నాయి. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే ఫస్ట్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ఎవరు ముందడుగు వేస్తారనేది ఆసక్తిగా మారింది. తొలి రెండు జట్ల బలాబలాలు.. లీగ్‌ దశలో ఎవరు పైచేయి సాధించారో తెలుసుకుందాం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Major: ‘మేజర్‌’ టికెట్‌ రేట్లపై అడివి శేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

 ముంబయి ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాను మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని, అడివి శేష్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా సిద్ధమైన చిత్రం ‘మేజర్‌’. ఈ చిత్రానికి శశి కిరణ్‌ తిక్క దర్శకత్వం వహించారు. మహేశ్‌బాబు నిర్మాత. కరోనా కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా జూన్‌ 03న పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా శేష్‌ ట్విటర్‌ చాట్‌ ద్వారా నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

జాకీతో ప్రేమ.. అలా జరగడం నాకిష్టం లేదు: రకుల్‌

7. విశాఖలో వధువు సృజన మృతి కేసు.. వీడిన చిక్కుముడి!

విశాఖపట్నంలోని మధురవాడలో వధువు సృజన మృతి కేసులో చిక్కుముడి వీడింది. పెళ్లి ఆపాలనుకునే ప్రయత్నంలో ఆమె ప్రాణాలు పొగొట్టుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసుల నిర్ధారించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన విశాఖ పోలీసులు.. వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు. సృజన ఫోన్‌లో కాల్‌ డయల్‌ రికార్డర్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లను విశ్లేషించగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. India Corona: 2 వేలకు దిగొచ్చిన కొత్త కేసులు..!

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. ఆదివారం 2.94 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 2,022 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. నిన్న 2,099 మంది కోలుకున్నారు. ఇప్పటివరకూ 4.31 కోట్ల మందికిపైగా కరోనా బారినపడగా.. రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. వైరస్‌ వ్యాప్తి అదుపులో ఉండటంతో క్రియాశీల కేసులు 14,832 (0.03 శాతం)కు దిగొచ్చాయి. ఇక నిన్న 46 మంది మరణించగా.. ఇప్పటివరకూ 5,24,459 మంది మహమ్మారికి బలయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సౌదీ ప్రయాణ ఆంక్షలు..భారత్‌ సహా 16 దేశాలు వెళ్లకుండా నిషేధం

కరోనా మహమ్మారి ఎప్పటికప్పుడు తగ్గినట్టే తగ్గి.. ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఒమిక్రాన్ ఉప వేరియంట్లు ప్రపంచ దేశాలను కలవరానికి గురిచేస్తున్నాయి. భారత్‌లో కూడా బీఏ.4. బీఏ.5 ఉత్పరివర్తనలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో తమ పౌరులు భారత్‌తో సహా పదహారు దేశాలకు వెళ్లకుండా సౌదీ అరేబియా ప్రయాణ ఆంక్షలు విధించింది. ఆ దేశాల జాబితాలో లెబనాన్, సిరియా, టర్కీ, ఇరాన్‌, అఫ్గానిస్థాన్‌, యెమెన్‌, సోమాలియా, ఇథియోపియా, ది డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, లిబియా, ఇండోనేషియా, వియత్నాం, అర్మేనియా, బెలారస్, వెనిజువెలా ఉన్నట్లు స్థానిక వార్తా సంస్థ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Delhi: దిల్లీలో భారీ వర్షం.. పలుచోట్ల కూలిన ఇళ్లు..!

దేశ రాజధాని దిల్లీలో సోమవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక చోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయి. వర్షం కారణంగా పలు విమానాలు రద్దయ్యాయి. గత కొన్ని రోజులుగా మండుటెండలతో అల్లాడిపోతున్న దిల్లీ వాసులకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. ఈ తెల్లవారుజాము నుంచి దిల్లీలో వర్షం కురుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని