Updated : 25 May 2022 13:17 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. కలెక్టరేట్‌కు వెళ్లే క్రమంలో విధ్వంసం సృష్టించారు: డీఐజీ పాలరాజు

కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన హింసాత్మక ఆందోళన వ్యవహారంలో ఇప్పటి వరకు 46 మందిని అదుపులోకి తీసుకున్నామని ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు తెలిపారు. మరికొంతమందిని అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆందోళనకారులను చెదరగొట్టామని.. కానీ 3 గంటల సమయంలో ఒక్కసారిగా వేలమంది రోడ్లపైకి వచ్చారన్నారు. కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తామని చెప్తే వాళ్లను అక్కడికి పంపే క్రమంలో రాళ్లదాడి జరిగిందని.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

వైకాపాకు ప్రేమ ఉంటే నవరత్నాలకు అంబేడ్కర్‌ పేరు పెట్టొచ్చుగా?: జీవీఎల్‌

2. జీవో 80ఏ రద్దుకు వరంగల్‌ రైతుల నిరసన.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

భూసేకరణ జీవో 80ఏ రద్దు చేయాలంటూ వరంగల్‌ జిల్లా రైతులు కదం తొక్కారు. హనుమకొండ- హైదరాబాద్‌ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. జీవోను వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు. రైతుల నిరసనలో భాజపా, కాంగ్రెస్‌, వామపక్ష నేతలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. రైతుల నిరసనతో హనుమకొండ- హైదరాబాద్‌ హైవేపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘మూడో ప్రపంచ యుద్ధానికి ఇదే నాంది కావొచ్చు’

ఉక్రెయిన్‌పై రష్యా దాడి మూడో ప్రపంచ యుద్ధానికి నాంది కావొచ్చని బిలియనీర్‌ జార్జ్‌ సోరోస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం వల్ల మానవాళి మనుగడకే ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ బంధానికి అవధులు లేవని వ్యాఖ్యానించారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక  వార్షిక సదస్సులో మాట్లాడుతూ మంగళవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పోలీసు వలయంలో అమలాపురం.. డీఐజీ, నలుగురు ఎస్పీలు అక్కడే..

కోనసీమ జిల్లా అమలాపురంలో ప్రశాంత వాతావరణం దిశగా పోలీసులు చర్యలు చేపట్టారు. కోనసీమ జిల్లా పేరునే కొనసాగించాలంటూ మంగళవారం జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇతర జిల్లాల నుంచి అదనపు బలగాలను కూడా రప్పించి అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. అమలాపురం వైపు వచ్చే అన్ని బస్సు సర్వీసులను రద్దుచేశారు. దీంతో బస్టాండ్‌ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Hardik Pandya : గుజరాత్‌ సక్సెస్‌ వెనుక స్టోరీ అదే: హార్దిక్‌

తొలి క్వాలిఫయిర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై అద్భుత విజయంతో గుజరాత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. నిన్న రాత్రి (మే 24న) జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 188/6 స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో గుజరాత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 19.3 ఓవర్లలో 191 పరుగులు చేసి విజయం సాధించింది. మ్యాచ్‌ అనంతరం గుజరాత్ సారథి హార్దిక్ పాండ్య మాట్లాడుతూ.. ‘‘మైదానం లోపల, వెలుపల సమతూకంగా ఉండేలా చూసుకుంటున్నాను. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Rashmika: విజయ్ అంటే నాకెప్పటి నుంచో ఇష్టం: రష్మిక

‘పుష్ప’తో నేషనల్‌ క్రష్‌గా మారారు నటి రష్మిక. ఆ సినిమా సక్సెస్‌ తర్వాత ఆమె బాలీవుడ్‌, దక్షిణాదిలో వరుస ప్రాజెక్ట్‌లు ఓకే చేశారు. దీంతో అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌, రణ్‌బీర్‌ కపూర్‌ లాంటి స్టార్‌ హీరో సినిమాల్లో నటించే అవకాశాన్ని ఆమె సొంతం చేసుకున్నారు. కాగా, తాజాగా రష్మిక ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తదుపరి చిత్రాలపై ముచ్చటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ర్యాన్‌సమ్‌వేర్‌ దాడి.. స్పైస్‌జెట్‌ సేవలకు అంతరాయం

ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ విమాన సేవలు బుధవారం ఉదయం ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. గుర్తు తెలియని దుండగులు చేసిన సైబర్ దాడి వల్లే ఇది జరిగిందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ర్యాన్‌సమ్‌వేర్‌ మాల్వేర్‌ దాడి వల్ల తమ వెబ్‌సైట్లలో అంతరాయం ఏర్పడిందని వివరించింది. దీని వల్లే విమానాలు ఆలస్యంగా బయలుదేరాయని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Kapil Sibal: కాంగ్రెస్‌కు భారీ షాక్‌..! పార్టీ వీడిన కపిల్‌ సిబల్‌

కాంగ్రెస్‌ పార్టీకి మరో పెద్ద షాక్‌..!. ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్‌ సిబల్‌ పార్టీని వీడారు. తాను కాంగ్రెస్‌ను వీడినట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. సమాజ్‌వాదీ పార్టీ తరఫున రాజ్యసభ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను మే 16నే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. India Corona : కొత్తగా 2,124 కేసులు.. 1,977 రికవరీలు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అంతకుముందు రోజుతో పోల్చితే కొత్త కేసుల్లో 400కుపైగా పెరుగుదల కనిపించింది. మరోవైపు మరణాలు 20లోపు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. నిన్న 4,58,924 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 2,124 కేసులు వెలుగులోకి వచ్చాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 0.46 శాతానికి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇక్కడ విఘ్నేశ్‌-నయన్‌.. అక్కడ విజయ్‌-అనన్య

షూటింగ్స్‌ నుంచి ఏ కాస్త విరామం దొరికినా పర్సనల్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తుంటారు మన తారలు. ఇష్టమైన వారితో కలిసి డిన్నర్‌ డేట్స్‌.. షాపింగ్స్‌తో సమయాన్ని గడుపుతుంటారు. ప్రస్తుతం మన స్టార్‌ కపుల్స్‌ నయనతార-విఘ్నేశ్‌ శివన్‌, విజయ్‌ దేవరకొండ-అనన్యపాండే.. ఫ్రీ టైమ్‌ని సరదాగా గడుపుతున్నారు. డిన్నర్‌ డేట్స్‌కు వెళ్లి తమకిష్టమైన ఫుడ్‌ని రుచి చూశారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని