Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 29 May 2022 13:26 IST

1. Aadhaar: ఆధార్‌ జిరాక్స్‌ ఇస్తున్నారా? తస్మాత్‌ జాగ్రత్త!

ఆధార్‌ కార్డు అవసరం గురించి చెప్పాల్సిన పని లేదు. ఎక్కడపడితే అక్కడ దీని ఫొటోకాపీ (జిరాక్స్‌)ని ప్రూఫ్‌గా ఇచ్చేస్తున్నాం. వాటిని వారు ఎలా ఉపయోగిస్తారో కూడా ఆరా తీయడం లేదు. పని అయిపోయాక తిరిగి తీసుకుందామన్న అవగాహనా చాలా మందిలో ఉండడం లేదు. దీంతో ఆధార్‌ కార్డులు దుర్వినియోగం అవుతున్నాయి. సంక్షేమ పథకాలు, బ్యాంకు ఖాతాలు, పాన్‌, సిమ్‌.. ఇలా ప్రతిదానికీ మనం ఇప్పటికే ఆధార్‌ను అనుసంధానించి ఉన్నాం. ఈ నేపథ్యంలో ఆధార్‌ వివరాలను ఎవరైనా దుర్వినియోగం చేస్తే ముప్పు తప్పదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. 22 మంది ఉన్న విమానం అదృశ్యం.. ప్రయాణికుల్లో నలుగురు భారతీయులు

నేపాల్‌లో ఓ విమానం ఆచూకీ గల్లంతైంది. తారా ఎయిర్​లైన్స్​ 9 ఎన్ఏఈటీ ట్విన్​ఇంజిన్ విమానం ఈ ఉదయం పొఖారా నుంచి జామ్‌సోమ్‌కు బయలుదేరింది. 9:55 గంటల సమయంలో ఏటీసీతో విమానానికి సంబంధాలు తెగిపోయినట్లు అధికారులు తెలిపారు. విమానంలో సిబ్బంది సహా మొత్తం 22 మంది ఉన్నట్లు నేపాల్‌ అధికారిక మీడియా వెల్లడించింది. వీరిలో నలుగురు భారతీయులు, ముగ్గురు జపాన్‌వాసులు కాగా.. మిగిలిన వారు నేపాల్‌ పౌరులు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పుతిన్‌జీ.. నేరుగా జెలెన్‌స్కీతో మాట్లాడండి..!

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో నేరుగా చర్చలు జరపాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను జర్మనీ, ఫ్రాన్స్‌ అధినేతలు అభ్యర్థించారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానియేల్‌ మాక్రాన్‌, జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ దాదాపు 80 నిమిషాలపాటు రష్యా అధ్యక్షుడితో ఫోన్‌లో చర్చలు జరిపారు. అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగారంలో బంధించిన దాదాపు 2,500 మంది ఉక్రెయిన్‌ ఫైటర్లను విడుదల చేయాలని కూడా కోరారు. తక్షణమే కాల్పుల విమరణ ప్రకటించి.. రష్యా దళాలను వెనక్కి పిలిపించాలని పేర్కొన్నట్లు జర్మనీ ఛాన్స్‌లర్‌ కార్యాలయం వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Del Vecchio: ఈ ‘రే బన్‌’ రారాజు జీవితం ఓ ‘కన్ను’లపండుగ

1930ల్లో ఇటలీలోని ఓ నిరుపేద కుటుంబంలో ఓ తల్లి మగబిడ్డకు జన్మనిచ్చింది. తండ్రి కూరగాయలమ్మి కుటుంబాన్ని పోషించేవాడు. కానీ, నాన్నను చూసే భాగ్యం ఆ పిల్లోడికి కలగలేదు. ఐదు నెలల క్రితమే ఆయన మరణించాడు. కుటుంబంలో ఆ బాలుడు ఐదో సంతానం. తల్లికి భయమేసింది. అందరినీ ఎలా పోషించాలో అర్థం కాలేదు. చిన్న చితకా పనులు చేసుకుంటూ ఏదోలా నెట్టుకొచ్చింది. కానీ, ఓ రోజు కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆ విషయంలో రాజమౌళిని తలదన్నేవారు లేరు: భాను చందర్‌

 దర్శకధీరుడు రాజమౌళిపై నటుడు భానుచందర్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ‘నిరీక్షణ’, ‘ముక్కుపుడక’, ‘కొంటె కోడలు’ వంటి చిత్రాలతో గతంలో హీరోగా ప్రేక్షకుల్ని అలరించిన ఆయన ప్రస్తుతం సహాయనటుడిగా పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఆయన ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ముంబయిలో ఉన్న రోజుల్లో నైట్‌ క్లబ్స్‌లో మ్యూజిషియన్‌గా పనిచేశానని, ఆ సమయంలోనే తనకి డ్రగ్స్‌ అలవాటయ్యాయని.. మార్షల్ ఆర్ట్స్‌ వల్లే తాను మాదకద్రవ్యాలకు దూరమయ్యానని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఎవరైనా కెరీర్‌ మొత్తం ఒకేలా ఆడలేరు.. కోహ్లీ విశ్రాంతి తీసుకోవాలి

టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని, కుటుంబంతో హాయిగా గడపాలని ఇంగ్లాండ్‌ మాజీ సారథి మైఖేల్‌ వాన్‌ సూచించాడు. రెండున్నర సంవత్సరాలుగా విరాట్‌ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు జరుగుతోన్న భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లోనూ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలోనే వాన్‌ ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడుతూ విరాట్‌ కోహ్లీపై స్పందించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Southwest Monsoon: కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. సాధారణం కంటే మూడు రోజులు ముందుగానే ఆ రాష్ట్రాన్ని పలకరించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇటీవల అసని తుపాను ప్రభావంతో రుతుపవనాలు వేగంగా కదిలాయి. మరోవైపు ఈ రుతుపవనాలు మరో వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం ఉంటుందని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Health: ఐవీఎఫ్‌ అయితే శస్త్ర చికిత్స తప్పదా..?

 ఐవీఎఫ్‌ పద్ధతిలో పిల్లలను కనాలంటే శస్త్రచికిత్స తప్పదా..? ఐవీఎఫ్‌తో కవల పిల్లలు పుడుతారా..? వయస్సు ఎక్కువైతే కష్టమవుతుందా..? ఇలాంటి చాలా ప్రశ్నలు పిల్లలు కావాలనుకునే వారిలోనూ, వారి బంధువుల్లోనూ వస్తాయి. చాలా మంది శస్త్ర చికిత్సకు వెళ్లడంతో అదే నిజమనుకుంటున్నారు. ఐవీఎఫ్‌ పద్ధతిపై వస్తున్న అనుమానాలు, సమస్యలపై ఫెర్టిలిటీ సర్జన్‌ చంద్రారెడ్డి పలు వివరాలు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Smoking: కేజీఎఫ్‌2 చూసి సిగరెట్లు కాల్చి.. తీవ్ర అనారోగ్యం పాలైన బాలుడు

అభిమాన హీరోను అనుకరిస్తూ ఓ బాలుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటన నగరంలో శనివారం వెలుగులోకి వచ్చింది. రాజేంద్రనగర్‌ ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి (15) ఇటీవల కేజీఎఫ్‌2 చిత్రాన్ని పలుమార్లు తిలకించాడు.  అందులో హీరో ధూమపానం చేసే సన్నివేశాలకు ఆకర్షితుడైన బాలుడు ఏకధాటిగా ఒక ప్యాకెట్‌ సిగరెట్లను తాగేశాడు. దీంతో దగ్గు తదితర శ్వాస సంబంధిత  సమస్యలతో అనారోగ్యం పాలైన బాలుడిని తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం బంజారాహిల్స్‌లోని సెంచురీ ఆస్పత్రికి తీసుకువచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Tirumala: తిరుమలలో భారీగా రద్దీ.. భక్తులు ఓపికతో ఉండాలి: వైవీ సుబ్బారెడ్డి

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని అన్ని క్యూలైన్లు నిండిపోయాయి. ప్రస్తుతం క్యూలైన్లలో భక్తులు తితిదే ఆస్థాన మండపం వరకు వేచియున్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటలకు పైనే సమయం పడుతోంది. భక్తుల రద్దీ నేపథ్యంలో తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. వేసవి సెలవులు కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉందని.. శ్రీవారి దర్శనం అయ్యే వరకు ఓపికగా వేచి ఉండేలా ఏర్పాట్లు చేసుకుని రావాలని ఆయన సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని