Updated : 29 Jun 2022 13:13 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Maharashtra: ‘మహా’ సంక్షోభం.. ఠాక్రే సర్కారుకు రేపే బలపరీక్ష

 మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం కీలక దశకు చేరుకుంది. ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీ కూటమికి బలపరీక్ష ఎదురైంది. అసెంబ్లీలో ఠాక్రే సర్కారు తమ మెజార్టీని నిరూపించుకోవాలని రాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ ఆదేశించారు. ఇందుకోసం రేపు(జూన్‌ 30) ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని శాసనసభ కార్యదర్శిని ఆదేశించారు. ఈ మేరకు నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత గవర్నర్‌ ఈ ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Maharashtra: గవర్నర్‌.. రఫేల్ జెట్‌ కంటే వేగంగా ఉన్నారే..!

2. కొంత మంది వ్యక్తులు.. కొన్ని శక్తులు నన్ను టార్గెట్‌ చేస్తున్నాయి: ఏబీవీ

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. నిఘా విభాగం చీఫ్‌గా పని చేసిన సమయంలో భద్రతా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆ కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఆయన సాక్షుల్ని ప్రభావితం చేసేందుకు యత్నించారన్న అభియోగాలపై తాజాగా మరోసారి సస్పెండ్‌ చేసింది. దీనిపై ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఈఎంఐ భారం కావొద్దంటే కారు లోన్‌కు ఏ వడ్డీరేటు బెటర్‌?

ఆర్‌బీఐ ఇటీవల రెండు దఫాల్లో రెపోరేటును 90 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీంతో రుణ వడ్డీరేట్లు ఎగబాకుతున్నాయి. ఈ తరుణంలో కారు లోన్‌ (Car Loan) తీసుకోవాలనుకునేవారు ఎలాంటి వ్యూహం అనుసరించాలి? పెరగనున్న ఈఎంఐ (EMI) భారాన్ని ఎలా ఎదుర్కోవాలో చూద్దాం..! కారు లోన్ (Car Loan) తీసుకోవాలనుకునేవారికి ఫిక్స్‌డ్‌ (Fixed Rate), ఫ్లోటింగ్‌ వడ్డీ రేట్లు (Floating Rate).. రెండూ అందుబాటులో ఉన్నాయి. ఫ్లోటింగ్‌ అంటే రెపోరేటు (Repo Rate)కు అనుగుణంగా వడ్డీరేట్లు మారుతుంటాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Actress Meena: మీనా భర్త మృతి.. పావురాల వ్యర్థాలే కారణమా..?

ప్రముఖ నటి మీనా (Meena) భర్త విద్యాసాగర్‌ (48)(Vidya Sagar) మంగళవారం రాత్రి  హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. శ్వాసకోశ సమస్యతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా, విద్యాసాగర్‌ మృతికి సంబంధించి తమిళనాడు స్థానిక పత్రికల్లో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పావురాల వ్యర్థాల నుంచి వచ్చే గాలిని ఎక్కువగా పీల్చడం వల్లే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ₹1000తో డైలీ 3జీబీ డేటా..180 రోజుల వ్యాలిడిటీ.. దేంట్లో తెలుసా?

ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) ప్రీపెయిడ్‌ యూజర్ల కోసం అనేక  ప్లాన్ల (Prepaid plans)ను అందుబాటులో ఉంచింది. వాటిలో నుంచి అత్యంత ప్రయోజనకరంగా ఉండే ప్యాక్‌ను ఎంపిక చేసుకోవడానికి కొంత సమయం వెచ్చించాల్సిందే. మరి దీర్ఘకాల వ్యాలిడిటీ, ఎక్కువ మొత్తంలో డేటా కావాలనుకునేవారికి బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) మంచి ప్లాన్‌ను అందిస్తోంది. అదీ రూ.1000 లోపే. మరి ఆ ప్రీపెయిడ్‌ ప్యాక్ (Prepaid plans) వివరాలేంటో చూద్దాం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. IND vs IRE : అందుకే ఆఖరి ఓవర్‌ను ఉమ్రాన్‌కు ఇచ్చా : హార్దిక్‌ పాండ్య

ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో కేవలం నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించి హార్దిక్‌ పాండ్య నేతృత్వంలోని భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 225/7 భారీ స్కోరు సాధించింది. అయితే ఛేదనలో ఐర్లాండ్ లక్ష్యానికి చేరువగా వచ్చి ఆగింది. ఆరంభంలో భారీగా పరుగులు ఇచ్చిన టీమ్‌ఇండియా బౌలర్లు కీలక సమయంలో రాణించడంతో ఐర్లాండ్‌ 221/5 స్కోరుకు పరిమితమైంది. దీంతో భారత్‌ 2-0 తేడాతో సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Cricket Records : RRR.. సరసన చేరేదెవరు?

7. ఆదరించిన కుటుంబం మరణించిందని తెలియక..!

శిథిలాలుగా మారిన ఓ ఇంటి వద్ద తనను చేరదీసిన కుటుంబం కోసం వెతుకుతోంది ఓ శునకం. ఇన్నాళ్లు తన బాగోగులు పట్టించుకున్నవారు ఇప్పుడు కనిపించడం లేదని మూగగా రోదిస్తోంది. పదే పదే ఆ ఇంటివద్దకు వస్తూ.. అక్కడే తచ్చాడుతోంది. ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారిన చిత్రాన్ని చూస్తుంటే ఇదే భావన కలుగుతోంది. గతవారం కల్లోలిత అఫ్గానిస్థాన్‌(Afghanistan)లో భూకంపం(Earthquake) పెను విధ్వంసం సృష్టించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. India Corona: లక్షకు చేరువగా క్రియాశీల కేసులు..!

దేశంలో కరోనావైరస్(Coronavirus) వ్యాప్తి కొనసాగుతోంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 14 వేల మందికి కరోనా సోకగా.. దేశంలో బాధితుల సంఖ్య(Active Cases) లక్షకు చేరువైంది.  ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.  మంగళవారం 4.33 లక్షల మందికి కొవిడ్(Covid-19)నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 14,506 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజు ఆ సంఖ్య 11,793గా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Vikram: విక్రమ్‌ వచ్చేస్తున్నాడు.. ఓటీటీ రిలీజ్‌ ఎప్పుడంటే..!

విశ్వనటుడు కమల్‌హాసన్‌(Kamal Haasan) రీసెంట్‌ బ్లాక్‌బస్టర్‌ ‘విక్రమ్‌’ (Vikram) ఓటీటీ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ డిస్నీ+హాట్‌స్టార్‌ (Disney plus Hotstar) వేదికగా జులై 8 నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ఓ స్పెషల్‌ వీడియోని షేర్‌ చేసింది. ఇందులో కమల్‌.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Telangana News: హైదరాబాద్‌లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో ప్రధాని మోదికి వ్యతిరేకంగా భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ ప్రజలకు చేసిందేమీ లేదని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. పరేడ్ గ్రౌండ్స్ పక్కనే ఉన్న టివోలీ థియేటర్ సిగ్నల్ వద్ద ఈ భారీ ఫ్లెక్సీ వెలిసింది. జులై 3వ తేదీన పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని నరేంద్రమోదీ భారీ బహిరంగ సభ నేపథ్యంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని