Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు

Updated : 30 Jun 2022 13:13 IST

1. తెలంగాణ ‘పది’ ఫలితాలు వచ్చేశాయ్‌..
దరాబాద్‌: తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రం (ఎంసీహెచ్‌ఆర్‌డీ)లో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు విడుదల చేశారు.  మే 23 నుంచి ఈనెల 1 వరకు రాష్ట్రంలో టెన్త్‌ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 11,401 పాఠశాలలకు చెందిన 5,03,579 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

2. అవన్నీ జగన్ నాటక రెడ్డి పాలనలోనే జరుగుతాయి
అమరావతి: శ్రీ సత్యసాయి జిల్లాలోని తాడిమర్రిలో ఆటో ప్రమాద ఘటనకు ఉడుత కారణమంటూ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరినాథరావు ప్రకటించడంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి తీవ్రంగా తప్పుబట్టారు. తేనెటీగల వల్ల రథం తగలబడటం, ఎలుకలు మందు తాగడం, కుక్కలు తరిమితే భయపడి కోర్టులో కాకాని కేసు ఆధారాలు ఎత్తుకుపోవడం, ఉడుత వల్ల హై టెన్షన్ వైరు తెగడం వంటివన్నీ జగన్ నాటక రెడ్డి పాలనలోనే జరుగుతాయని విమర్శించారు.

3. మళ్లీ పెరిగిన కొత్త కేసులు.. లక్షకు పైగా కరోనా బాధితులు..!
దిల్లీ: దేశంలో కరోనా వైరస్(Coronavirus) వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసులు తగ్గినట్టే తగ్గి.. ఒక్కసారిగా పెరుగుతున్నాయి. క్రితం రోజు 14 వేలుగా ఉన్న కేసులు.. తాజాగా 18 వేలు దాటాయి. దాంతో క్రియాశీల కేసులు(Active Cases) లక్ష పైకి చేరాయి. నేడు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. బుధవారం 4.52 లక్షల మందికి కొవిడ్(Covid-19) నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 

4. తెలంగాణ ‘పది’ ఫలితాలు.. జిల్లాల వారీగా వివరాలివే..
హైదరాబాద్‌: తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్లో సిద్దిపేట 97.85 శాతంతో మొదటి స్థానంలో, హైదరాబాద్‌ 90 శాతంతో చివరి స్థానంలో నిలిచాయి. ఈ ఫలితాల్లో సిద్దిపేట, నిర్మల్‌, సంగారెడ్డి, కామారెడ్డి, ములుగు, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, ఆదిలాబాద్‌, జనగామ జిల్లాలు టాప్ టెన్‌లో ఉన్నాయి. జిల్లాల వారీగా వివరాలను కింద చూడొచ్చు.

5. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా!
హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్‌) శ్రీనివాస్‌ తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని చెప్పారు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

6. సీఎంగా ఫడణవీస్‌.. శిందేకు డిప్యూటీ సీఎం పదవి?
ఇంటర్నెట్‌డెస్క్‌: మహారాష్ట్ర (Maharahstra) ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే రాజీనామాతో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడినట్లయింది. అయితే ఇప్పుడు తదుపరి సీఎం ఎవరు? ఠాక్రేపై తిరుగుబావుటా ఎగురవేసిన ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) ప్రభుత్వంలో ఉంటారా? ఆయనకు ఏ పదవికి దక్కనుంది? అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై మరికొద్ది గంటల్లో స్పష్టత రానుంది.

7. ఇంగ్లాండ్‌తో పోరు...ఆశలన్నీ బౌలర్లపైనే..
ఇంగ్లాండ్‌తో కఠిన సవాలును ఎదుర్కోవడానికి టీమ్‌ఇండియా సీనియర్‌ జట్టు సిద్ధమవుతోంది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా శుక్రవారం నుంచి జరిగే కీలక పోరులోనూ విజయం సాధించి.. గతేడాది 2-1తో నిలిచిన ఆధిక్యాన్ని 3-1గా మార్చి సిరీస్‌ కైవసం చేసుకోవాలని చూస్తోంది. దీంతో ఇంగ్లిష్‌ గడ్డపైనా చారిత్రక విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే, అదంత తేలికేం కాదు.. 

8. కోమాలో అభిమాని.. ఫోన్‌ చేసి మాట్లాడిన తారక్‌
హైదరాబాద్‌: తన అభిమానులు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే వారికి సాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటారు నటుడు తారక్‌. ఆ మధ్య రోడ్డు ప్రమాదానికి గురైన ఓ అభిమానితో వీడియో కాల్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. తాజాగా అలాంటి ఘటనే మరోసారి జరిగింది. తన అభిమాని ఒకరు రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లాడని తెలుసుకుని..

9. టీమ్‌ఇండియాకు షాకేనా..?
ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్పే లక్ష్యంగా టీమ్‌ఇండియా సన్నద్ధమవుతోంది. అందుకోసం ప్రతి ఆటగాడి ప్రదర్శనపై సెలెక్టర్లు దృష్టిసారించారు. ఈ క్రమంలోనే పొట్టి ఫార్మాట్‌లో ఎక్కువ మంది ఆటగాళ్లకు అవకాశం ఇస్తున్నారు. ఇటీవల జరిగిన దక్షిణాఫ్రికా, ఐర్లాండ్‌ సిరీస్‌లకు యువ ఆటగాళ్లను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే, కొంతమంది సీనియర్లను రాబోయే ప్రపంచకప్‌ టోర్నీకి పక్కనబెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి.

10. ఠాక్రేకు వెన్నుపోటు.. ఇదిగో ఇలాగే..!
ముంబయి: మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితి ముగింపు దశకు చేరుకుంది. బలపరీక్షకు గవర్నర్‌ ఆదేశించడం, అందులో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించడంతో.. ఇక సభలో మెజారిటీ నిరూపణ కష్టమని నిర్ధారించుకున్న ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దాంతో తదుపరి కార్యాచరణపై భాజపా, అసమ్మతి ఎమ్మెల్యేలు చకచకా పావులు కదుపుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని