Published : 07 Jul 2022 12:54 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. ధోనీ ఎప్పటికీ గ్రేట్‌.. అందుకే దిగ్గజాలే సలామ్‌ కొట్టారు!

ప్రపంచ క్రికెట్‌లో పరిచయం అక్కర్లేని పేరు మహేంద్ర సింగ్‌ ధోనీ. జార్ఖండ్‌ డైనమైట్‌.. కెప్టెన్‌ కూల్‌.. ద ఫినిషర్‌.. ఇలా ప్రతి అభిమాని మదిలో నిలిచిపోయాడు. అయితే ఆరంభంలో బ్యాట్‌ ఝుళిపించి సిక్సర్ల మోత మోగిస్తుంటే అతడొక విధ్వంసక బ్యాట్స్‌మన్‌ అనుకున్నారంతా..  కానీ ధోనీ సారథిగా మూడు ఐసీసీ ట్రోఫీలు సాధిస్తేగానీ తెలియలేదు.. మేటి ఆటగాళ్లనే మాయ చేసిన మాహి మహిమలేంటో.. ఓ లుక్కేద్దాం.

2. భారత్‌లో బీఏ.2.75 వేరియంట్..

అధిక సాంక్రమిక శక్తి ఉన్న ఒమిక్రాన్(Omicron) వేరియంట్‌ బీఏ.2కి ఉపరకమైన బీఏ.2.75ని భారత్‌ వంటి దేశాల్లో గుర్తించామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. దాని లక్షణాలను విశ్లేషిస్తున్నామని పేర్కొంది. ‘గత రెండు వారాలుగా ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు 30 శాతం మేర పెరిగాయి. డబ్ల్యూహెచ్‌ఓకు చెందిన ఆరు సబ్‌ రీజియన్లలో నాలుగుచోట్ల గత వారం కేసుల పెరుగుదల నమోదైంది.

3. చిరంజీవి తప్ప మిగిలిన వారి నటన అద్భుతం

 ‘మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ భీమవరంలో అద్భుతంగా జరిగింది. ఆ మహానుభావుడికి నా నివాళి. ఆ సభలో మా అన్నయ్య చిరంజీవి తప్ప అందరూ అద్భుతంగా నటించారు. ఆ మహా నటులందరికీ నా అభినందనలు’ అంటూ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, సినీనటుడు కొణిదెల నాగబాబు బుధవారం రాత్రి ట్వీట్‌ చేశారు.

4. కోడిపందేల్లో లేని వ్యక్తిని చూపించడం కొందరి జెండా.. అజెండా

రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలని తెదేపా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. హైదరాబాద్‌ శివారు పటాన్‌చెరులో నిర్వహించిన కోడి పందేల వ్యవహారంలో ఆయన ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చింతమనేని సోషల్‌ మీడియాలో స్పందించారు.

5. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. సెప్టెంబరు నెల కోటాకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను గురువారం ఉదయం తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. సెప్టెంబర్‌ మాసానికి సంబంధించి రోజుకు 25వేల చొప్పున టికెట్లను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తితిదే తెలిపింది.

6. నువ్వే నాకు ప్రేమించడం నేర్పించావ్‌..

కథానాయిక సమంత(Samantha) పెంపుడు శునకం హాష్‌(HASH) ఎలా ప్రేమించాలో తనకు నేర్పిందని నటుడు నాగచైతన్య (Naga Chaitanya) అన్నారు. ఆయన హీరోగా నటించిన ‘థ్యాంక్యూ’ (Thank You) ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా తన జీవితంలో కీలకపాత్ర పోషించిన వారికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ‘‘థ్యాంక్యూ.. అవసరమైన సందర్భంలో నేను ఎక్కువగా వాడే పదం ఇది.

7. వరంగల్‌లో కాకతీయ వైభవ సప్తాహం..

తెలంగాణలో కాకతీయ వైభవ సప్తాహం ప్రారంభమైంది. రాష్ట్రంతో శతాబ్దాల అనుబంధమున్న కాకతీయుల చరిత్ర, పాలనా వైభవం, కళావిశిష్టతలను భావితరాలకు తెలిపే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి 7 రోజుల పాటు వరంగల్‌, హైదరాబాద్‌లలో కాకతీయ వైభవ సప్తాహాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. వరంగల్‌లో ఈ ఉత్సవాలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించారు.

8. ఉద్యోగితో మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన మస్క్‌?

టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ మరో ఇద్దరు పిల్లలకు తండ్రయినట్లు సమాచారం. తను స్థాపించిన న్యూరాలింక్‌ కంపెనీలో పనిచేస్తున్న శివోన్‌ జిలిస్‌తో కలిసి గత ఏడాది ఆయన కవలలకు జన్మనిచ్చినట్లు బిజినెస్‌ ఇన్‌సైడర్‌ పత్రిక పేర్కొంది. మస్క్‌ ఇప్పటికే తన మాజీ భార్య జస్టిన్‌ విల్సన్‌తో ఐదుగురు పిల్లలకు, కెనడా సింగర్‌ గ్రైమ్స్‌తోనూ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. గత ఏడాది డిసెంబరులోనే మస్క్‌, గ్రైమ్స్‌ కలిసి సరోగసీ ద్వారా తమ రెండో బిడ్డకు ఆహ్వానం పలికారు.

9. పాఠాలు చెప్పలేదని.. రూ.24లక్షల జీతం తిరిగిచ్చేసిన ప్రొఫెసర్‌

‘‘కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతబడ్డాయి. ఆన్‌లైన్‌ క్లాసులు జరిగినప్పటికీ హాజరైంది అరకొరా విద్యార్థులే. పాఠాలేమీ చెప్పలేకపోయాను’’ అంటూ తన 33 నెలల వేతనాన్ని తిరిగిచ్చేశారు ఓ కాలేజీ ప్రొఫెసర్‌. విద్యార్థులకు పాఠాలు బోధించకుండా జీతం తీసుకొనేందుకు తన మనస్సాక్షి అంగీకరించలేదంటూ దాదాపు రూ.24లక్షలను వెనక్కి ఇచ్చేశారు. నిజాయతీకి నిలువుటద్దంగా నిలిచిన ఆయన పేరు లలన్‌ కుమార్‌. పనిచేసేది బిహార్‌ ముజఫర్‌పూర్‌లోని ఓ ప్రభుత్వ కళాళాలలో.

10. పొట్టి ప్రపంచకప్‌ ముందే.. భారత్Xపాక్‌ మరోసారి పోరు

పొట్టి ప్రపంచకప్‌ పోటీలకు ముందే టీమ్‌ఇండియాకు మరో సవాలు ఎదురుకానుంది. టీ20 ఫార్మాట్‌లో ఆసియాకప్‌ను నిర్వహించాలని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్ (ఏసీసీ) నిర్ణయించింది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్‌ 11 వరకు ఆసియా కప్‌ పోటీలు జరుగుతాయి. శ్రీలంక వేదికగా ఆసియాకప్‌ మ్యాచ్‌లు ఏసీసీ నిర్వహించనుంది. దీనికి సంబంధించి వేదికలు, పూర్తిస్థాయి షెడ్యూల్‌ను శనివారం జరిగే వార్షిక సమావేశంలో ఏసీసీ ఖరారు చేయనుంది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని