Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 07 Aug 2022 13:05 IST

1. SSLV తుది దశ సమాచార సేకరణలో స్వల్ప జాప్యం

ఇస్రో కొత్తగా అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహ వాహకనౌక ప్రయోగంలో చిన్నపాటి సాంకేతిక సమస్య తలెత్తింది. ఆదివారం ఉదయం 9.18 గంటలకు తిరుపతి జిల్ల్లా సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ మూడు దశలు అనుకున్నట్లుగానే పూర్తయినట్లు ఇస్రో వెల్లడించింది. టెర్మినల్‌ దశకు సంబంధించిన సమాచారం రావడంలో కొంత జాప్యం జరిగినట్లు తెలిపింది. ప్రస్తుతం రాకెట్‌ గమనాన్ని విశ్లేషిస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రామ్‌ భాయ్‌.. మీ ఛాలెంజ్‌ స్వీకరించా: పవన్‌కల్యాణ్‌

చేనేత దినోత్సవం సందర్భగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ విసిరిన ఛాలెంజ్‌ను జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ స్వీకరించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌తో పాటు పవన్‌కు కేటీఆర్‌ ఛాలెంజ్‌ విసిరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్‌ స్పందిస్తూ కేటీఆర్‌ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ‘రామ్‌ భాయ్‌ (కేటీఆర్‌).. మీ ఛాలెంజ్‌ను స్వీకరించా’ అంటూ చేనేత వస్త్రాలు ధరించిన ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. భాజపాలో చేరిన దాసోజు శ్రవణ్‌

ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్‌ భాజపాలో చేరారు. దిల్లీలో ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌చుగ్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌, మాజీ ఎంపీ వివేక్‌, సీనియర్‌ నేత మురళీధర్‌రావు తదితర నేతలు పాల్గొన్నారు. పార్టీలో చేరిన అనంతరం శ్రవణ్‌కు భాజపా నేతలు అభినందనలు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. చైనాది బాధ్యతారాహిత్యం: అమెరికా

 తైవాన్‌ సమీపంలో చైనా చేపట్టిన యుద్ధ విన్యాసాలను అమెరికా తప్పుబట్టింది. అవి పూర్తిగా బాధ్యతా రాహిత్యమైన కవ్వింపు చర్యలుగా పేర్కొంది. తమపై దాడికి చైనా సిద్ధమవుతోందంటూ తైవాన్‌ ఆరోపించిన నేపథ్యంలో అమెరికా ఈ వ్యాఖ్యలు చేసింది. ఇటీవల అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటించడాన్ని చైనా తీవ్రంగా పరిగణించి ఈ  యుద్ధ విన్యాసాలు చేపట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. బాసర ట్రిపుల్‌ ఐటీలోని సమస్యలు పరిష్కరించదగ్గవే: గవర్నర్‌ తమిళిసై

నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో చాలా సమస్యలున్నాయని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. బాసర ట్రిపుల్‌ ఐటీలో గత కొంతకాలంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో గవర్నర్‌ అక్కడికి వెళ్లారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్న తర్వాత వారితో మాట్లాడి ట్రిపుల్‌ ఐటీలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తమిళిసై మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఈ ఆలయంలో... బంగారమే ప్రసాదం!

7. ఈ థెరపీలు చేయించుకునే ధైర్యముందా?

పాముల్ని తాకడం కాదు కదా చూడటానికే ఎంతో భయపడతాం. భారీగా ఉండే ఏనుగుల్ని దేవాలయాల వద్ద పూజిస్తే- పర్యటక ప్రాంతాల వద్ద పిల్లల్ని ఎక్కించి సంబర పడతాం. సముద్రాల్లో ఉండే డాల్ఫిన్లు రాగాలు తీస్తాయనీ, స్లైగల భాషలో తోటివాటితో మాట్లాడతాయనీ విని ఉన్నాం. అయితే వీటితోనూ నిపుణులు పలు థెరపీలు చేస్తూ రకరకాల సమస్యల్ని దూరం చేస్తున్నారని మీకు తెలుసా! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పీఐజే రెండో టాప్‌ కమాండర్‌ను మట్టుబెట్టిన ఇజ్రాయెల్‌..!

గాజాపట్టీపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నాయి. పాలస్తీనా ఇస్లామిక్‌ జిహాద్‌ (పీఐజే)గ్రూప్‌నకు చెందిన మిలిటెంట్‌ నాయకులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్నాయి. దీంతో ఇక్కడ మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 28 మంది మరణించినట్లు సమాచారం. వీటిల్లో పీఐజే నాయకులు ఖలీద్‌ మన్సూర్‌, తైసీర్‌ జబారీ ఉన్నారు. మరో ఆరుగురు చిన్నారులు కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సైబరాబాద్‌ను చూసినప్పుడు నాకెంతో సంతృప్తి

 ప్రభుత్వాలు మంచి విధానాలు రూపొందిస్తే చాలు.. డబ్బు ఖర్చు పెట్టకుండానే ప్రజలకు మేలు చేయొచ్చని చంద్రబాబు అన్నారు. దిల్లీలో ఆయన శనివారం జాతీయ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మంచి విధానాలతో ప్రజలకు ఎలా మేలు జరుగుతుందో చెప్పడానికి వాజ్‌పేయీ హయాంలో నిర్మించిన స్వర్ణ చతుర్భుజి జాతీయ రహదారులు, తాను తీసుకొచ్చిన ఐటీ విధానాలే నిదర్శనమన్నారు. ‘అప్పట్లో నేను మలేషియాకు వెళ్లినప్పుడు అక్కడి రోడ్లను చూశాక భారతీయ రోడ్లు ఎంత నాసిరకంగా ఉన్నాయో వాజ్‌పేయీ దృష్టికి తీసుకెళ్లాను. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పాడేద్దాం ఓ స్నేహగీతం..!

స్నేహం.. ఓ అపురూపమైన అనుబంధం. కులం, మతం, ప్రాంతం, భాష, ఆడామగ, చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య చిగురించే అమూల్యమైన భావమిది. స్నేహం అనే మధుర భావాన్ని ఆధారంగా చేసుకుని వెండితెరపై ఎన్నో చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాయి. ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘‘ఫ్రెండ్‌షిప్‌’’పై ఇప్పటివరకూ వచ్చిన కొన్ని మధుర పాటలేంటో చూసేద్దాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని