Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 09 Aug 2022 16:47 IST

1. గవర్నర్‌ను కలవనున్న నీతీశ్.. భాజపాకు షాక్‌ తప్పదా?

బిహార్‌ రాజకీయాలు క్షణక్షణానికి ఉత్కంఠగా మారుతున్నాయి. బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీ(యు)నేత నీతీశ్‌ కుమార్‌... ఎన్‌డీఏ కూటమి నుంచి వైదొలగే యోచనలో ఉన్నారన్న వార్తల నేపథ్యంలో నేడు అధికార, ప్రతిపక్ష పార్టీలు కీలక సమావేశాలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలోనే సీఎం నీతీశ్ కుమార్‌ మరికొద్దిసేపట్లో గవర్నర్‌ను కలిసే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్ర గవర్నర్‌ ఫాగు చౌహన్‌ను కలిసేందుకు నీతీశ్ అపాయింట్‌మెంట్‌ తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* భాజపాతో నీతీశ్‌ బ్రేకప్‌ వార్తలు: బిహార్‌లో నేతలు బిజీబిజీ..!

2. మాధవ్‌పై చర్యలు మొదలు పెడితే వైకాపా సగం ఖాళీ: రామ్మోహన్‌నాయుడు

వైకాపాకు చెందిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ను కాపాడేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. మాధవ్‌ వ్యవహారంలో వైకాపా ఇంతవరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని.. భయపడుతున్నారా? అని నిలదీశారు. ఆయనపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు తెదేపా తరఫున ఫిర్యాదు చేశామని.. చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రామ్మోహన్‌నాయుడు మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. 8వ వేతన కమిషన్‌పై.. కేంద్రం క్లారిటీ..!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకొచ్చే అవకాశాలున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఊహాగానాలను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. 8వ వేతన కమిషన్‌ను తీసుకురావాలన్న ప్రతిపాదనేదీ లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరీ సోమవారం లోక్‌సభకు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం వేతన కమిషన్‌ను సకాలంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రిషి సునాక్‌ గెలవాలని.. ప్రవాస భారతీయుల హోమాలు

బ్రిటన్‌లో ప్రధానమంత్రి పదవి కోసం భారత సంతతికి చెందిన రిషి సునాక్‌, లిజ్‌ ట్రస్‌ మధ్య పోటీ రోజురోజుకు మరింత తీవ్రమవుతోంది. ఈ రేసులో సునాక్‌ కంటే ట్రస్‌ కాస్త ముందంజలో ఉన్నట్లు సర్వేలు, మీడియా కథనాలు పేర్కొంటున్నారు. దీంతో యూకేలోని ప్రవాస భారతీయులు సునాక్‌కు మద్దతుగా ముందుకొచ్చారు. ఆయన గెలవాలని హోమాలు చేస్తున్నారు.‘‘సునాక్ భారతీయుడని మేం ఈ హోమాలు, పూజలు చేయట్లేదు. ఆయన ప్రధాని పదవికి అత్యంత సమర్థులు’’ అని బ్రిటిష్‌ ఇండియన్‌ ఒకరు అంతర్జాతీయ మీడియాతో అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. 35 ఏళ్ల క్రితం స్వీపర్‌.. ఇప్పుడు అదే బ్యాంకుకు ఏజీఎం

ఒకప్పుడు స్వీపర్‌గా పనిచేసిన బ్యాంకులోనే అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ స్థాయికి ఎదిగి.. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు ప్రతీక్షా టోండ్‌వల్కర్‌ (57). పుణెలోని ఓ పేద కుటుంబంలో ఆమె జన్మించారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఏడో తరగతితోనే చదువు ఆపేశారు. 17 ఏళ్లకే..1981లో పెద్దలు పెళ్లి చేసేశారు. ప్రతీక్ష భర్త.. సదాశివ్‌ కడు ముంబయి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో బుక్‌ బైండర్‌గా పనిచేసేవారు. కొంతకాలానికి వారికి కుమారుడు పుట్టాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ట్రంప్‌ ఇంట్లో ఎఫ్‌బీఐ తనిఖీలు

ఫ్లోరిడాలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు చెందిన మార్‌-ఎ-లాగో ఎస్టేట్‌లో ఎఫ్‌బీఐ (ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌) సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దేశ రహస్య పత్రాలను ఇక్కడికి తరలించారేమో అనే అనుమానంతో సోదాలు చేశారు. అయితే.. వీటిని అధికారులు ధ్రువీకరించలేదు కానీ.. ట్రంప్‌ , ఆయన కుటుంబ సభ్యులు అంగీకరించారు. అమెరికా మాజీ అధ్యక్షుడి ఇల్లు సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బంది రక్షణలో ఉంటుంది. తనిఖీలకు కొద్ది సేపటి ముందు సోమవారం ఎఫ్‌బీఐ సిబ్బంది.. సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులకు వారెంట్‌ విషయం వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

*  ఆక్రమణ కోసమే చైనా సన్నాహాలు

7. 90.18 మీటర్ల రికార్డు త్రో.. అభినందించిన నీరాజ్‌ చోప్రా

కామన్వెల్త్‌ క్రీడల్లో భాగంగా జావెలిన్‌ త్రోలో పాకిస్థాన్‌ అథ్లెట్‌ అర్షద్ నదీమ్ రికార్డు సృష్టించాడు. ఫైనల్లో ఏకంగా జావెలిన్‌ను 90.18 మీటర్ల దూరం విసిరి స్వర్ణం కొల్లగొట్టాడు. ఈ క్రమంలో జావెలిన్‌ను 90 మీటర్లకు పైగా విసిరిన రెండో ఆసియా అథ్లెట్‌గా గుర్తింపు పొందాడు. 2017లో చైనా అథ్లెట్‌ తైపీ 91.36 మీటర్ల త్రో ఇప్పటివరకు అత్యధికం. నదీమ్‌ ప్రదర్శనతో పాక్‌ 56 ఏళ్ల తర్వాత కామన్వెల్త్‌ గేమ్స్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో పతకం గెలవగా.. జావెలిన్ త్రోలో పాక్‌కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పైతాన్‌తో... పరుగులే!

ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌లో జావాదే హవా అన్నది నిన్నటిమాట. ఇప్పుడు పైతాన్‌కు మార్కెట్లో డిమాండ్‌ పెరిగిపోయింది. ప్రస్తుతం ఐటీలో దీటైన కెరియర్‌ను నిర్మించుకోవాలి అనుకునేవారికి పైతాన్‌ నేర్చుకోవడం ఒక అదనపు అర్హతగా మారింది. మరి దీని పూర్తి వివరాలేంటో మనమూ చూసేద్దాం. పైతాన్‌ను 1991లో గైడోవాన్‌ రోసమ్‌ అభివృద్ధి చేశారు. సీ, జావాలతో పోలిస్తే దీనిలో ప్రోగ్రామ్స్‌ చిన్నవిగా ఉంటాయి. సింటాక్స్‌ కూడా సులువుగా అర్థమయ్యేలా ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!

చిలీలో జులై 30వ తేదీన ఒక్కసారిగా పుట్టుకొచ్చిన భారీ గొయ్యి (సింక్‌ హోల్‌) నానాటికీ విస్తరిస్తోంది. తాజాగా 160 అడుగుల వెడల్పు, 656 అడుగుల లోతుకు పెరిగిపోయింది. ఇది ఎంత పెద్దగా ఉందంటే..  ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’ ఇందులో సులభంగా ఇమిడిపోతుంది.. ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత ఆర్క్‌ డి ట్రయాంఫ్‌ పూర్తిగా ఈ గొయ్యిలో పట్టగలదు. ఈ మిస్టరీ గొయ్యిపై చిలీకి చెందిన నేషనల్‌ సర్వీస్‌ ఆఫ్‌ జియాలజీ అండ్‌ మైనింగ్‌ విభాగం అధికారులు శనివారం స్పందిస్తూ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మహేశ్‌ ‘బాబు బంగారం’.. తెరపైనా, తెర వెనకా.. ఆ ప్రయాణమిదీ!

నలుగురికి నచ్చింది ఆయనకు నచ్చదు. నరులెవరూ నడవని రూట్లోనే ఆయన నడుస్తాడు. రాముడు, కృష్ణుడిని కీర్తిస్తూ కూర్చోవడం కాదు వారేం సాధించారో గుర్తిద్దామంటాడు. ఒక్కమాట.. ఒక్క బాణం.. ఒక్కటేలే గురి అంటూ స్ఫూర్తినింపుతుంటుంటాడు. అదరక బదులే చెప్పేటి, తెగువకు తోడతడు. తరతరాల నిశీధి దాటే, చిరువేకువ జాడతడు. పెను తుపాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడు. ఆ అతడు ఎవరో కాదు మహేశ్‌ బాబు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ‘రీల్‌’ లైఫ్‌ సంగతులు గుర్తు చేసుకుందాం.. ‘రియల్‌’ లైఫ్‌ విశేషాలు తెలుసుకుందాం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

‘బిగ్‌బాస్‌’ మళ్లీ వస్తున్నాడు.. ప్రోమోతో సందడి చేస్తున్నాడు!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని