Updated : 11 Aug 2022 12:59 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. ఆర్మీ క్యాంప్‌పై ఆత్మాహుతి దాడికి యత్నం..

స్వాతంత్ర్య దినోత్సవాల వేళ జమ్మూకశ్మీర్‌లో భీకర ఆత్మాహుతి దాడికి ఉగ్రవాదులు పన్నిన కుట్రను సైన్యం భగ్నం చేసింది. ఆర్మీ క్యాంప్‌పై దాడికి యత్నించిన ఇద్దరు ముష్కరులను జవాన్లు మట్టుబెట్టారు. అయితే ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు సైనికులు అమరులయ్యారు. జమ్ము అదనపు డీజీపీ ముకేశ్‌ సింగ్‌ తెలిపిన వివరాల ప్రకారం..

2. బన్నీ.. మీరు కెమెరా ముందుకొస్తే చాలు.. రూ.10 కోట్లు ఇస్తాం..!

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌కు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ వేరే లెవల్‌. ‘పుష్ప’ తర్వాత బన్నీ పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. ఆ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని పలు వాణిజ్య సంస్థలు అల్లు అర్జున్‌ను తమ ప్రకటనకర్తగా పెట్టుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్స్‌కు కాస్త దూరంగా ఉన్న ఆయన భారీ పారితోషికం తీసుకుంటూ ఆయా ఉత్పత్తులను ప్రమోట్‌ను చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు. అయితే..

3. తప్పుడు వాగ్దానాలతో గెలవడం కంటే ఓడిపోవడమే మేలు..!

బ్రిటన్‌ ప్రధాని పీఠం కోసం కన్జర్వేటివ్ నేతలు రిషి సునాక్‌, లిజ్‌ట్రస్ మధ్య పోరు తీవ్రంగా సాగుతోంది. దేశ ప్రజలను ఆకట్టుకునే ఎత్తుగడలతో విజయ తీరాలకు చేరేందుకు వీళ్లిద్దరూ కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషి సునాక్‌ మాట్లాడారు. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తప్పుడు వాగ్దానాలతో విజయం సాధించడం కంటే ఓడిపోవడం మేలని రిషి అభిప్రాయపడ్డారు.

4. ఈ గిఫ్ట్‌లతో అక్కాచెల్లెళ్లకు ‘రక్ష’గా నిలుద్దాం..

అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకొనే పండుగ రక్షా బంధన్‌. తమ సోదరులు జీవితాంతం తమకు రక్షగా ఉండాలని ఈ రోజున వారి చేతికి అక్కాచెల్లెళ్లు రాఖీ కడతారు. మరి మారుతున్న కాలానికి అనుగుణంగా ‘రక్షగా నిలవడం’ అనే పదానికి విస్తృతి పెరిగిందనే చెప్పాలి. రోజురోజుకీ పెరుగుతున్న ధరలు, ఉద్యోగ భద్రతపై అనుమానాలు నెలకొన్న ఈ తరుణంలో కేవలం భౌతిక రక్షణే కాకుండా ఆర్థికంగానూ వారికి రక్షణగా నిలవాలి. అదే అక్కాచెల్లెళ్లకిచ్చే నిజమైన బహుమతి.

5. భవిష్యత్తులో అతడిని టీమ్‌ఇండియా కెప్టెన్‌గా చూసినా..

భారత క్రికెట్‌లో కెప్టెన్సీ చర్చ ఇటీవల జోరుగా సాగుతోంది. దీనికి గల కారణాలు లేకపోలేదు. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఏడుగురు కెప్టెన్లు భారత జట్టును నడిపించారు. దీంతో రోహిత్‌ వారసుడిగా పూర్తిస్థాయి సారథిని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రేసులో కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్, హార్దిక్‌ పాండ్య ముందున్నట్లు స్పష్టమవుతోంది. అయితే, వీరిలో పాండ్యకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు ఈ మధ్యకాలంలో వార్తలొచ్చాయి.

6. దిల్లీలో 17.83 శాతానికి పాజిటివిటీ రేటు..!

దేశంలో స్వల్ప హెచ్చుతగ్గులతో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 3.56 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 16,299 మంది కరోనా బారినపడ్డారు. పాజిటివిటీ రేటు 4.58 శాతంగా ఉంది. ముందురోజు కూడా ఇదే స్థాయిలో కేసులు నమోదయ్యాయి. అయితే గత కొద్దిరోజులుగా దిల్లీలో రెండువేలకు పైగానే కేసులు వస్తున్నాయి. నిన్న పాజిటివిటీ రేటు 17.83 శాతానికి చేరడం ఆందోళన కలిగిస్తోంది.

7. మసూద్‌ అజార్‌ సోదరుడికి చైనా అండ..!

ఉగ్రవాద నిర్మూలనకు ఐరాస వేదికగా భారత్‌, అమెరికా చేస్తోన్న ప్రయత్నాలకు చైనా మరోసారి మోకాలడ్డింది. జైషే మహ్మద్‌ ఉగ్ర ముఠా చీఫ్‌ మసూద్‌ అజార్‌ సోదరుడు అబ్దుల్ రౌఫ్‌ అజార్‌పై ఆంక్షలు విధిస్తూ అమెరికా, భారత్‌ చేసిన ప్రతిపాదనను డ్రాగన్‌ అడ్డుకుని ఉగ్రవాదంపై తన ద్వంద్వ వైఖరిని మరోసారి ప్రదర్శించింది.

8. షూటింగ్‌లో ప్రమాదం.. నటుడు విశాల్‌కు తీవ్ర గాయాలు

కోలీవుడ్‌ నటుడు విశాల్‌కు గురువారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. తన తదుపరి సినిమా ‘మార్క్‌ ఆంటోనీ’ చిత్రీకరణలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. సినిమాలోని కీలక ఫైట్‌ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తున్నప్పుడు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రథమ చికిత్స అనంతరం విశాల్‌ షూట్‌ నుంచి బ్రేక్‌ తీసుకున్నారు.

9. Gift Ideas: రాఖీ పండగకి గిఫ్ట్‌ కొనాలా..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాఖీ పండగ వచ్చేస్తోంది. శుక్రవారమే ఈ సోదరసోదరీమణుల పండగ. సోదరి రాఖీ కట్టాక గిఫ్ట్‌గా ఏదైనా గ్యాడ్జెట్‌ని ఇద్దామనుకొంటున్నారా? రోజూ ఉపయోగపడే ఈ గ్యాడ్జెట్‌లు రూ.5 వేల లోపు ధరలోనే అందుబాటులో ఉంటాయి. అయితే ఈ గ్యాడ్జెట్‌లపై ఓ లుక్కేయండి.

10. భారత్‌లో 7శాతం మంది దగ్గర క్రిప్టోకరెన్సీ

భారత్‌లో 2021 నాటికి దాదాపు ఏడు శాతం మంది దగ్గర డిజిటల్‌ కరెన్సీ ఉందని ఐక్యరాజ్య సమితి ఓ నివేదికలో వెల్లడించింది. కొవిడ్‌-19 సమయంలో క్రిప్టోకరెన్సీ వినియోగం గణనీయంగా పెరిగినట్లు తెలిపింది. జనాభాపరంగా అత్యధిక మంది క్రిప్టోకరెన్సీ లు కలిగిన తొలి 20 దేశాల జాబితాలో 15 అభివృద్ధి చెందుతున్న దేశాలేనని ‘యూఎన్‌ ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌’ పేర్కొంది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని