Updated : 13 Aug 2022 13:27 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. కన్ను కోల్పోవచ్చు.. చేతుల్లో నరాలు తెగిపోయాయి..!

 ప్రముఖ రచయిత, ప్రతిష్ఠాత్మక బుకర్‌ ప్రైజ్‌ విజేత సల్మాన్‌ రష్దీపై జరిగిన దాడి షాక్‌కు గురిచేసింది. తీవ్రంగా గాయాలపాలైన రష్దీ ఒక కన్ను కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన బుక్ ఏజెంట్ ఒకరు రాయిటర్స్‌కు వెల్లడించారు. ఈ దాడిలో చేతుల్లోని నరాలు తెగిపోయాయని.. ఆయన కాలేయం తీవ్రంగా దెబ్బతిందని వెల్లడించారు. శుక్రవారం అమెరికాలోని న్యూయార్క్‌లో వేదికపై ప్రసంగానికి సిద్ధమవుతోన్న రష్దీ వద్దకు ఓ వ్యక్తి దూసుకెళ్లి దాడికి పాల్పడ్డాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘ఎఫ్‌-3’.. వెంకీ ఎలా ఒప్పుకొన్నాడో ఏంటో: పరుచూరి గోపాలకృష్ణ

వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌, తమన్నా, మెహ్రీన్‌ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ‘ఎఫ్‌-3’పైతన అభిప్రాయాన్ని బయటపెట్టారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. ‘ఎఫ్‌-2’తో పోలిస్తే ‘ఎఫ్‌-3’ అంత బాలేదని ఆయన తెలిపారు. గతంలో తాము చేసిన తప్పే ఇప్పుడు దర్శకుడు అనిల్‌ రావిపూడి చేశారా? అన్న అనుమానం తనకు కలిగిందని అన్నారు. ఈ మేరకు ‘ఎఫ్‌-3’పై తన మనసులోని మాట బయటపెడుతూ ‘పరుచూరి పలుకులు’ వేదికగా తాజాగా ఆయన వీడియో షేర్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రేవంత్‌ సారీపై అప్పుడే ఆలోచిస్తా: వెంకటరెడ్డి

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి క్షమాపణలపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ‘‘ఉద్యమకారుడినైన నన్ను అవమానించారు. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అద్దంకి దయాకర్‌ను శాశ్వతంగా బహిష్కరించాకే రేవంత్‌ క్షమాపణపై ఆలోచిస్తాను’’ అని వెంకటరెడ్డి తెలిపారు. కాగా చండూరు సభలో తనను పార్టీ నాయకుడు దయాకర్‌ తిట్టినందుకు ఆ సభకు అధ్యక్షత వహించిన రేవంత్‌ క్షమాపణ చెప్పాలని వెంకటరెడ్డి డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్షమాపణలు చెప్పిన రేవంత్‌రెడ్డి

4. భారత్‌ vs పాక్‌ మ్యాచ్‌పై రికీ పాంటింగ్‌ జోస్యం

ప్రపంచ క్రికెట్‌లో భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌కున్న క్రేజే వేరు. ఈ చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్‌ ఎప్పుడు జరుగుతుందా.. అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు పోటీపడ్డాయి. మళ్లీ ఇప్పుడు యూఏఈ వేదికగా ఆసియాకప్‌లో ఈ నెల 28న ఇండో-పాక్‌ సమరం జరగనుంది. ఇరు జట్లు సూపర్‌ ఫామ్‌లో ఉండటంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు సహజం. దీంతో ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో అనే చర్చ మొదలైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వడ్డీ రేట్ల మోత.. విస్తీర్ణంలో కోత

గృహ రుణ వడ్డీ రేట్లు నెలల వ్యవధిలోనే మూడుసార్లు పెరిగాయి.. ఈ ప్రభావం ఇళ్ల కొనుగోళ్లపై స్పష్టంగా కనిపిస్తోంది.. హైదరాబాద్‌ రాజధాని ప్రాంతంలో వరసగా రెండు నెలలు ఇళ్ల రిజిస్ట్రేషన్లు తగ్గినట్లు రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ నివేదికలు చెబుతున్నాయి. వడ్డీరేట్ల పెంపుతో కొనుగోలు సామర్థ్యం తగ్గడమే ఇళ్ల విక్రయాలపై ప్రతికూల ప్రభావానికి కారణమనే అంచనాతో ఉన్న నిర్మాణ సంస్థలు.. కొత్త ప్రాజెక్టుల్లో వ్యూహాలను మారుస్తున్నాయి. కొవిడ్‌ అనంతరం విశాలమైన ఇళ్లకు డిమాండ్‌ పెరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఇంటింటా హర్‌ ఘర్‌ తిరంగా.. సతీమణితో కలిసి జెండా ఎగరవేసిన అమిత్‌ షా

 స్వాతంత్య్రం పొంది 75 సంవత్సరాలు గడుస్తోన్న వేళ.. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమం కింద హర్‌ఘర్ తిరంగా ఉత్సవంలో దేశప్రజలు పాల్గొంటున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా  ఆగస్టు 13 నుంచి 15 వరకు తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాలు ఎగరేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ పిలుపునందుకొని  కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఇతర మంత్రులు, ప్రజలు తమ ఇళ్లపై జెండా ఎగరేశారు. అమిత్‌ షా తన సతీమణితో కలిసి ఈ వేడుకలో పాల్గొన్న దృశ్యాలను భాజపా ట్విటర్‌లో షేర్ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* హర్‌ ఘర్‌ తిరంగా.. ఓ పవిత్రమైన కార్యక్రమం: చంద్రబాబు

7. NPS చందాదారుల‌కు అల‌ర్ట్‌.. ఇక‌పై UPI ద్వారా పేమెంట్స్

మీరు ఎన్‌పీఎస్ (NPS) చందాదారులా? అయితే, ఇక‌పై మీ పెట్టుబ‌డుల‌ను యూనిఫైడ్ పేమెంట్స్ ఇంట‌ర్‌ఫేజ్‌ (UPI) ద్వారా కూడా చేయొచ్చు. చందాదారులకు ప్ర‌యోజ‌నం చేకూర్చేందుకు ఈ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు పెన్ష‌న్ ఫండ్ నియంత్ర‌ణ‌, అభివృద్ధి సంస్థ (PFRDA) తెలిపింది. ప్ర‌స్తుతం చందాదారులు ఇంట‌ర్నెట్‌ బ్యాంకింగ్‌ మాధ్యమాలైన‌ IMPS, NEFT, RTGS ద్వారా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పుడు దేశీయ ఇన్‌స్టంట్‌ రియ‌ల్-టైమ్ పేమెంట్స్ సిస్ట‌మ్‌ UPI ద్వారా కూడా చందాదారులు మ‌రింత సుల‌భంగా, వేగంగా, స‌ర‌ళంగా పెట్టుబ‌డులు పెట్టొచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మార్చేద్దాం..‘మైక్రో చీటింగ్‌’

అబ్బాయి, అమ్మాయి ప్రేమలో పడటం సహజం. ప్రేమలో పడ్డవాళ్లతోనే జీవితం కొనసాగించడం న్యాయం. కానీ కొందరుంటారు.. పాత ‘జ్ఞాపకాలు’ వదలరు. మాజీలను పలకరించకుండా ఉండరు. ఇదే ‘మైక్రో చీటింగ్‌’.. అంటే భావోద్వేగపు అవిశ్వాసం. ఈ లక్షణాలు గుర్తించి ప్రేమికులు తమ భాగస్వాములను మార్చుకోవాల్సిందే. వీళ్లు రోజంతా ఫోన్‌కే అతుక్కుపోతుంటారు. పడక గది, చివరికి రెస్ట్‌రూమ్‌కి వెళ్లినా మొబైల్‌ వెంట ఉండాల్సిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అవమానిస్తే... వ్యాపారవేత్తగా ఎదిగింది

గర్భం దాల్చాను అని శుభవార్త చెప్పడం ఆమె ఉద్యోగానికి ముప్పు తెచ్చింది. అందుకామె నిరాశ పడలేదు. ఆ అవమానానికి దీటైన సమాధానం చెప్పాలని అనుకుంది. అందులోనూ సమాజ హితం ఉండాలనుకుంది. ఆ దిశగా తను వేసిన అడుగులు ఆమెనో వ్యాపారవేత్తగా నిలిపాయి. విదేశాలకూ విస్తరించే లక్ష్యంతో సాగుతోన్న వైశాలి మెహతా తోటి మహిళలకూ సాధికారత కల్పిస్తోంది... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నిజంగా నేనే వచ్చా.. డూపు కాదు: విక్రమ్‌

కోలీవుడ్‌ ప్రముఖ నటుడు చియాన్‌ విక్రమ్‌ (Vikram) ఇకపై అభిమానులకు మరింత చేరువగా ఉండనున్నారు. తన సినిమా అప్‌డేట్‌లు, ఇతర ముఖ్యమైన విషయాలను వీలైనంత ఎక్కువమంది అభిమానులకు చేర్చనున్నారు. దీనికి సంబంధించిన ఓ ఆసక్తికర వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉంది? వరుస సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉండే విక్రమ్‌ సోషల్‌ మీడియాను చాలా అరుదుగా ఉపయోగిస్తుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సినిమా మధ్యలోనే ప్రేక్షకులు బయటకు వచ్చేశారు.. బాధేసింది: నాగచైతన్య

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts