Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 15 Aug 2022 12:59 IST

1. ‘అవినీతి.. వారసత్వం’.. దేశాన్ని పట్టిపీడిస్తోన్న చెదపురుగులు 

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా.. అవినీతి, వారసత్వం అనే రెండు చెదపురుగులు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఈ పీడను తొలగించుకుంటేనే ప్రజాస్వామ్యానికి మనుగడ ఉంటుందన్నారు. ఈ చెదపురుగులను జనజీవనం నుంచి తరిమేద్దామని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జాతినుద్దేశించి ఆయన కీలక ప్రసంగం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆ పోరాటం ప్రపంచ మానవాళికి మహోన్నత చరిత్ర..: సీఎం జగన్‌

 జాతీయ జెండా మనందరి స్వాతంత్ర్యానికి, ఆత్మగౌరవానికి, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక అని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. అతివాదం, మితవాదం, విప్లవ వాదం.. ఇలా మార్గాలు వేరైనా గమ్యం మాత్రం ఒక్కటేనని.. అదే స్వాతంత్ర్యమని చెప్పారు. అహింసే ఆయుధంగా.. సత్యమే సాధనంగా సాగిన ఆ శాంతియుత పోరాటం భారత దేశానికే కాకుండా ప్రపంచ మానవాళకి మహోన్నత చరిత్రగా.. తిరుగులేని స్ఫూర్తిగా కలకాలం నిలిచే ఉంటుందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

దేశ నిర్మాణంలో తెలంగాణ బలమైన భాగస్వామి: సీఎం కేసీఆర్‌

3. ఆరు ఖండాల్లో ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌..! 

భారత నౌకాదళం ఆరు ఖండాలు, మూడు సముద్రాల్లోని ఆరు టైమ్‌జోన్లలో ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని భారత యుద్ధనౌకలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. విదేశాల్లో ఉంటున్న పలువురు భారత వాసులు ఈ కార్యక్రమాలు చూసేందుకు ఆయా ఓడరేవుల వద్దకు ఉత్సాహంగా వచ్చారు. చాలా మంది యుద్ధ నౌకలు ఎక్కి ఫొటోలు తీసుకొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారత యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ సూర్య సింగపూర్‌లోని ఛాంగై నౌకాదళ స్థావరానికి చేరుకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. భాజపా-తెరాస కార్యకర్తల ఘర్షణ.. బండి సంజయ్‌ పాదయాత్రలో ఉద్రిక్తత

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ‘ప్రజాసంగ్రామ పాదయాత్ర’లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలోకి పాదయాత్ర ప్రవేశించడంతో స్థానిక భాజపా శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఆ పార్టీకి చెందిన యువకులు బాణసంచా కాలుస్తూ సంజయ్‌ను మండలంలోకి ఆహ్వానించారు. అనంతరం దేవరుప్పలలో నిర్వహించిన బహిరంగ సభలో బండి సంజయ్‌ మాట్లాడుతుండగా భాజపా, తెరాస కార్యకర్తల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. విజయ్‌ దేవరకొండ రూ.2 కోట్లు వెనక్కి పంపించేశాడు: పూరీ జగన్నాథ్‌

 కష్టాల్లో అండగా నిలిచి.. తనను ఓ తండ్రిలా విజయ్‌ దేవరకొండ చూసుకున్నాడని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ అన్నారు. వరంగల్‌లో నిర్వహించిన ‘లైగర్‌’ ఫ్యాన్‌డమ్‌ మీట్‌లో పాల్గొన్న పూరీ.. విజయ్‌ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన భార్య లావణ్య  చెప్పడం వల్లే ‘అర్జున్‌రెడ్డి’ వీక్షించానని.. ఆ సినిమా చూస్తున్నప్పుడే విజయ్‌తో సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయానని చెప్పుకొచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* మనవడితో కలిసి ముకేశ్‌ అంబానీ స్వాతంత్ర్య వేడుకలు

6. ఒక్క స్వైప్‌తో వాట్సాప్‌లో కెమెరా యాక్సెస్! 

ప్రపంచవ్యాప్తంగా మెసేజింగ్‌ కోసం ఎక్కువ మంది వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. చాలామందికి వాట్సాప్‌లో ఉన్న అన్ని ఫీచర్ల గురించి పూర్తి అవగాహన ఉండదు. వాట్సాప్‌ కొత్తగా తీసుకొచ్చే ఫీచర్లలో కొన్నింటికి ప్రచారం చేస్తే, మరికొన్నింటిని సైలెంట్‌గా పరిచయం చేస్తుంది. తాజాగా వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను చడీచప్పుడు లేకుండా తీసుకొచ్చింది. ఇంతకీ ఏంటా ఫీచర్‌ అనేగా మీ సందేహం?అదేనండీ.. చాట్‌ పేజీలో కెమెరా ఆప్షన్‌. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. 75 ఏళ్లు 75 ఘట్టాలు: ఏం రోజు ఏం జరిగింది?

1947 ఆగస్టు 15న బ్రిటీష్ పాలకుల నుంచి భారత్‌ స్వాతంత్ర్యం పొందింది. ఒక్కరోజు ముందు పాక్‌ వేరుపడింది.1947-48 మధ్య కాలంలో కశ్మీర్‌ ప్రాంతం కోసం భారత్‌- పాక్‌ మధ్య తొలి యుద్ధం జరిగింది. స్వతంత్ర రాజ్యంగా ఉన్న జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసేందుకు మహరాజా హరిసింగ్‌ భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడంతో వివాదం ముగిసింది. 1951లో రైల్వే లైన్లను జాతీయీకరించారు. అప్పట్లో మూడు జోన్లు మాత్రమే ఉండేవి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అంతరిక్ష కేంద్రంలో మురిసిన మువ్వన్నెల జెండా..!

8. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రామోజీ ఫిల్మ్‌సిటీలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి, రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది పాల్గొన్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. శాంతి దూతలు.. శాస్త్ర స్రష్టలు

స్వాతంత్య్రానికి పూర్వమే రవీంద్రుడు, రామన్‌ నోబెల్‌ పురస్కారాలకు బాటలు వేస్తే.. స్వాతంత్య్రానంతరం మరికొందరు  ఆ దారిలో నడిచారు. శాస్త్ర సాంకేతిక, సాహిత్యాది రంగాల్లో అసమాన ప్రతిభ చూపి ప్రపంచ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. మొత్తంగా పదిమంది భారతీయులు నోబెల్‌ సొంతం చేసుకున్నారు.  వీరిలో కొందరు భారత మూలాలున్న వేరే దేశాల పౌరులూ ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. తిరంగను గౌరవంగా పరిహరించండి

మువ్వన్నెల జెండా దేశ గౌరవానికి ప్రతీక. ఎందరో అమరువీరుల త్యాగాలతో మనం అనుభవిస్తున్న స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు సూచిక. అందుకే త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించేటప్పుడు, అవనతం చేసేటప్పుడే కాదు.. పునర్వినియోగించలేని పక్షంలో దాన్ని పరిహరించేటప్పుడు కూడా నియమ నిబంధనలను పాటించాలి. జెండా గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరించాలి. ప్రధాని మోదీ ఇచ్చిన ‘హర్‌ ఘర్‌ తిరంగా’ పిలుపునకు స్పందించి దేశవ్యాప్తంగా ప్రజలు జాతీయ జెండాలను ఇళ్లపై ఏర్పాటు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

జైలు భయం, మరణ భీతి... వీటిని దాటితే విముక్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని