Updated : 16 Aug 2022 13:16 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. నదిలో పడిన జవాన్ల బస్సు.. ఆరుగురు  మృతి

జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 39 మంది భద్రతా సిబ్బంది ప్రయాణిస్తోన్న ఓ బస్సు నదిలో బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురు సైనికులు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. అమర్‌నాథ్ యాత్ర విధుల్లో ఉన్న ఈ భద్రతా సిబ్బంది చందన్‌వారీ నుంచి పహల్‌గామ్‌ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌పై ఫిఫా సస్పెన్షన్‌ వేటు

ఆల్‌ఇండియా ఫుట్‌బాట్‌ ఫెడరేషన్‌(ఏఐఎఫ్‌ఎఫ్‌) పై ఆ క్రీడ అత్యున్నత సంస్థ ఫిఫా చర్యలు చేపట్టింది. ఏఐఎఫ్‌ఎఫ్‌ను తక్షణమే సస్పెండ్‌ చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ఫిఫా కౌన్సిల్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది. తృతీయ పక్షం జోక్యం పెరగడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వెల్లడించింది. ఆ పక్షాలు ఫిఫా నిబంధనలు తరచూ ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించింది. ఫిఫా భారత్‌లో నిర్వహించతలపెట్టిన యు-17 (అండర్‌-17) మహిళల ప్రపంచ కప్‌ నిర్వహణలో కూడా ఇబ్బందులు తలెత్తనున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఆసియా కప్‌లో మునుపటి కోహ్లీని చూస్తాం: గంగూలీ

3. భారత్‌ విజ్ఞప్తులు శ్రీలంక బేఖాతరు.. హంబన్‌టొట చేరిన నిఘా నౌక..!

భారత్‌ ఎంత వారించినప్పటికీ చివరి నిమిషంలో శ్రీలంక అనుమతులు ఇవ్వడంతో చైనా నిఘా ‘యువాన్‌ వాంగ్‌-5’ నేటి ఉదయం 8.30 సమయంలో హంబన్‌టొట రేవుకు చేరుకొంది. ఈ విషయాన్ని రేవులోని హార్బర్‌ మాస్టర్‌ కెప్టెన్‌ నిర్మల్‌ డిసెల్వ ధ్రువీకరించారు. ఈ నౌక రాకను కొన్ని వారాల ముందే పసిగట్టిన భారత్‌ తక్షణమే స్పందించి శ్రీలంకకు అభ్యంతరాలను తెలియజేసింది. దీనిపై స్పందించిన లంక అధికారులు యువాన్‌ వాంగ్‌-5 ప్రయాణాన్ని వాయిదా వేయాలని చైనా అధికారులను కోరారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘వాళ్ల కాళ్లు విరగొట్టండి.. నేను బెయిల్‌ ఇప్పిస్తా’

శివసేన పార్టీ హక్కులపై మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఠాక్రే వర్గాన్ని హెచ్చరిస్తూ శిందే వర్గం ఎమ్మెల్యే ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘మీకు అడ్డుపడితే వాళ్ల(ఠాక్రే వర్గాన్ని ఉద్దేశిస్తూ) కాళ్లు విరగ్గొటండి.. అవసరమైతే నేను  బెయిల్‌ ఇప్పిస్తా’’ అంటూ ఆ ఆమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే.. ఆ క్వాలిటీ ఉండాల్సిందే: కిరణ్‌ అబ్బవరం

5. సామూహిక ‘జనగణమన’తో మారుమోగిన తెలంగాణ

స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుమేరకు యావత్‌ తెలంగాణ జాతీయ గీతం ‘జనగణమన’తో మారుమోగింది. మంగళవారం ఉదయం సరిగ్గా 11.30గంటలకు నిమిషం పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీలు, అంగన్‌వాడీ కేంద్రాలు, విద్యాసంస్థలతో పాటు ప్రైవేటు సంస్థల వద్ద సామూహికంగా జాతీయగీతాన్ని ఆలపించారు. మెట్రో రైళ్లు సహా ఇతర వాహనాలను ఎక్కడికక్కడే నిలిపేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా 4 బిలియన్‌ డాలర్ల స్టాక్స్‌పై మదుపర్ల దృష్టి

స్టాక్‌ మార్కెట్‌ బిగ్‌బుల్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూయడంతో.. ఇప్పుడు ఆయన పోర్టుఫోలియో నిర్వహణ ఎలా ఉంటుందనే అంశంపై మదుపర్లు ఆసక్తిగా ఉన్నారు.  ఆయనకు వివిధ కంపెనీల్లో బిలియన్‌ డాలర్ల విలువైన స్టాక్స్‌ ఉన్నాయి. సాధారణంగా భారతీయ మార్కెట్లలో మదుపు చేసే రిటైల్‌ ఇన్వెస్టర్లు రాకేశ్‌ పెట్టుబడులను జాగ్రత్తగా గమనిస్తారు. కొన్ని సందర్భాల్లో అనుసరిస్తారు కూడా. మార్కెట్‌ను అత్యధికంగా ప్రభావితం చేసే వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఈ నేపథ్యంలో ఆయన చాలా వ్యాపారాలు, స్టార్టప్‌ల్లో కూడా డబ్బును మదుపు చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఆర్టీసీ తొలితరం బస్సు విశేషాలు తెలుసా..?

7. కొత్తగా ఆరుగురు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం

తెలంగాణ హైకోర్టులో కొత్తగా ఆరుగురు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు. కొత్త జడ్జీలతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. న్యాయమూర్తులుగా జస్టిస్‌ ఏనుగుల వెంకట వేణుగోపాల్‌, జస్టిస్‌ నగేష్‌ భీమపాక, జస్టిస్‌ పుల్లా కార్తీక్‌, జస్టిస్‌ కాజ శరత్‌, జస్టిస్‌ జగ్గన్నగారి శ్రీనివాసరావు, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. నూతన న్యాయమూర్తులకు సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ అభినందనలు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కంప్యూటర్‌/ల్యాప్‌టాప్‌ హెల్త్‌ చెకప్‌.. ఇలా చేయండి!

 ఆరోగ్యం గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటాం. హెల్త్‌ చెకప్‌లు, డైట్‌ ప్లాన్‌ అంటూ జాగ్రత్తలు పాటిస్తాం. మరి, రోజూ ఉపయోగించే కంప్యూటర్‌/ల్యాప్‌టాప్‌ హెల్త్‌ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? కంప్యూటర్‌ హెల్త్‌ ఏంటి అనేగా మీ సందేహం. అదేనండీ.. పీసీ పనితీరు. ముఖ్యమైన పనిచేస్తున్నప్పుడు.. కంప్యూటర్‌ నెమ్మదిస్తేనో, పనిచేయకుండా మొరాయిస్తేనో.. కంప్యూటర్‌/ల్యాప్‌టాప్‌ హెల్త్‌పై చాలా మంది దృష్టి సారించరు. మన హెల్త్‌ రిపోర్టుల మాదిరే, కంప్యూటర్లకు కూడా వేర్వేరు విభాగాలకు సంబంధించిన రిపోర్ట్‌లు ఉంటాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* యాప్ ఆధారిత హాజరు.. సాంకేతిక సమస్యలతో కొత్త సమస్యలు

9. గణనీయంగా తగ్గిన కరోనా కేసులు.. ఎన్నొచ్చాయంటే..?

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ముందురోజు 14 వేలుగా ఉన్న కేసులు..తాజాగా తొమ్మిది వేల దిగువకు తగ్గాయి. సోమవారం 2.12 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 8,813 మందికి వైరస్ సోకింది. పాజిటివిటీ రేటు 4.15 శాతంగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో 15,040 మంది కోలుకున్నారు. 29 మంది మరణించారు. 2020 ప్రారంభం నుంచి 4.42 కోట్ల మందికి కరోనా సోకగా.. 98.46 శాతం మంది వైరస్‌ను జయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఉత్కంఠగా ‘హైవే’ ట్రైలర్‌.. కొత్త లుక్‌లో ఆనంద్‌ దేవరకొండ

ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda) హీరోగా కె.వి. గుహన్‌ (KV Guhan) తెరకెక్కించిన చిత్రం ‘హైవే’ (Highway). మానస కథానాయిక. అభిషేక్‌ బెనర్జీ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా నేరుగా ఓటీటీ ‘ఆహా’లో ఈ నెల 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం చిత్ర ట్రైలర్‌ని నటుడు నాగశౌర్య విడుదల చేశారు. ‘వరుస హత్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న సైకో కిల్లర్‌’ అనే న్యూస్‌తో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

చిరు-రజనీ-శ్రీదేవిలతో ‘రంగీలా’ చేయాలనుకున్నా.. కానీ!


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని