Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 23 Sep 2022 13:07 IST

1. రూపాయి పతనం ఇంకెంత దూరం? ఆర్‌బీఐ జోక్యం చేసుకోదా?

డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత దిగజారింది. శుక్రవారం తొలి సెషన్‌లో రూ.81 మార్క్‌ను కూడా దాటేసి సరికొత్త జీవనకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపు ఖాయమని తేలడంతో బుధవారం నుంచి డాలర్‌ బలపడుతూ వస్తోంది. వడ్డీరేట్లను 75 బేసిస్‌ పాయింట్లు పెంచుతున్నామని.. భవిష్యత్తులో మరిన్ని పెంపులు తప్పవని ఫెడ్‌ ప్రకటించడంతో రూపాయికి డిమాండ్‌ పూర్తిగా పడిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. టికెట్లు అమ్మడం లేదు.. దయచేసి సహకరించండి

భారత్‌-ఆస్ట్రేలియా మూడో టీ20 మ్యాచ్‌కు సంబంధించి గురువారం సికింద్రాబాద్‌ జింఖానా మైదానంలో టికెట్ల అమ్మకం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. అయితే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్న వారికి భౌతికంగా టికెట్లు ఇస్తామని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ప్రకటించింది. హెచ్‌సీఏ ప్రకటన నేపథ్యంలో ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసకున్న క్రికెట్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో మరోసారి జింఖానా స్టేడియానికి చేరుకుంటున్నారు. స్టేడియానికి చేరుకుంటున్న అభిమానులను పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపించేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక.. గాంధీలెవరూ పోటీలో ఉండరు..!

గత కొద్దిరోజులుగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక అంశం రసవత్తరంగా మారింది. ఈ పదవి కోసం పోటీ పడే జాబితాలో ఎన్నో పేర్లు వినిపిస్తున్నాయి. గాంధీలు పోటీ చేస్తారా..? లేదా..? విషయంలో మాత్రం ఇన్నాళ్లు స్పష్టత లేదు. ఇప్పుడు దానిపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి,కాంగ్రెస్‌ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ స్పందించారు.  గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పార్టీ అధ్యక్షుడిగా ఉండరని రాహుల్‌ గాంధీ వెల్లడించారని గహ్లోత్ స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్‌ తిరిగి బాధ్యతలు చేపట్టాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారనీ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రూపాయి విలువ పడిపోతుంటే.. రేషన్ దుకాణాల్లో మోదీ ఫొటో వెతుకుతున్నారు: కేటీఆర్

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయి కనిష్ఠానికి(₹81.18)కి పడిపోవడంపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ట్విటర్‌ వేదికగా కేంద్రం తీరుపై కేటీఆర్‌ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘రూపాయి విలువ అత్యంత కనిష్ఠానికి పడిపోయింది. అయినప్పటికీ కేంద్ర ఆర్థిక మంత్రి రేషన్‌ దుకాణాల్లో ప్రధాని ఫొటో కోసం వెతుకుతున్నారు. పైగా రూపాయి విలువ సాధారణంగానే పడిపోయిందని చెబుతున్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రిషభ్‌ పంత్‌ను తీసుకుంటారా?

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో ఘోర పరాభవాన్ని చవిచూసిన టీమిండియా నేడు ఆ ప్రతీకారం తీర్చుకుంటుందా? సిరీస్‌పై ఆశలు నిలవాలంటే నేడు జరగబోయే రెండో టీ20 మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి..! మరి ఈ మ్యాచ్‌కు జట్టు కూర్పు ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపని వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ స్థానంలో రిషభ్‌ పంత్‌కు అవకాశం కల్పిస్తారా? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆ ఖాళీ కుర్చీ వెనుక ఓ ఆసక్తికర ఘటన..!

ఇంటర్వ్యూ చేయడానికి సిద్ధంగా ఉన్న యాంకర్‌ ఎదుట ఖాళీ కుర్చీ ఉన్న ఆ ఫొటో వెనుక ఓ ఆసక్తికర ఘటన ఉంది. ఆ ఫొటోలోని మహిళ పేరు క్రిస్టియన్‌ అమన్పూర్‌. ఇరానీ-బ్రిటన్‌ కుటుంబంలో జన్మించింది. 11ఏళ్లు వచ్చే వరకు ఇరాన్‌లోనే పెరిగింది. ఆమె ప్రస్తుతం సీఎన్‌ఎన్‌లో చీఫ్‌ ఇంటర్నేషనల్‌ యాంకర్‌. అమెరికా ప్రభుత్వ నిర్వహణలోని పీబీఎస్‌లో కూడా ఓ షో చేస్తోంది. ఆమె తన ట్విటర్‌లో ఆ ఫొటోను పోస్టు చేసి.. దాని వెనుక కథను మొత్తం వివరించింది. అదేంటంటే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సమంత అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. వీడియో షేర్‌ చేసిన టీమ్‌

అగ్ర కథానాయిక సమంత (Samantha) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన అపురూప ప్రేమకావ్యం ‘శాకుంతలం’ (Shakunthalam) రిలీజ్‌ డేట్‌ వెల్లడైంది. నవంబర్‌ 4న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థలు గుణ టీమ్‌ వర్క్స్‌, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ శుక్రవారం ఉదయం అధికారికంగా ప్రకటించాయి. ‘శాకుంతలం’ నుంచి కొత్త ఫొటో‌, మోషన్‌ పోస్టర్‌ని అభిమానులతో పంచుకున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆరోజు అర్ధరాత్రి ప్రధాని మోదీ నాకు ఫోన్‌ చేసి..

సంక్షోభ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యవహరించే తీరు చాలా గొప్పగా ఉంటుందని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ అన్నారు. తన నాయకత్వ ప్రతిభతో ఎన్నో సమస్యలను ప్రశాంతంగా పరిష్కరించారని కొనియాడారు. ప్రస్తుతం జైశంకర్‌ అమెరికాలో పర్యటిస్తున్నారు. న్యూయార్క్‌లో ‘మోదీ@20: డ్రీమ్స్‌ మీట్‌ డెలివరీ’ అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్నేళ్ల క్రితం అఫ్గానిస్థాన్‌లో భారత రాయబార కార్యాలయంపై జరిగిన దాడి ఘటనను గుర్తుచేసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. హైదరాబాద్‌ చేరుకున్న జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు ఘనస్వాగతం

సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. సీజేఐగా పదవీ విరమణ చేశాక ఆయన తొలిసారి హైదరాబాద్‌కు వచ్చారు. విమానాశ్రయానికి చేరుకున్న జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నాగార్జున, జస్టిస్ కన్నెగంటి లలిత, జస్టిస్ బి. శరత్, జస్టిస్‌ సీవీ భాస్కర్ రెడ్డి, జస్టిస్ సాంబశివరావు, జస్టిస్ చిన్నకూరి సుమలత, జస్టిస్ వేణుగోపాల్, జస్టిస్ పుల్ల కార్తీక్.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఈడీ నుంచి మాకెలాంటి నోటీసులు రాలేదు: తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో నోటీసులు అందుకున్నారంటూ వస్తున్న వార్తలపై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు స్పందించారు. ఈ కేసుకు సంబంధించి తమకు ఎలాంటి నోటీసులు రాలేదని నలుగురు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు స్పష్టం చేశారు. ఇప్పటివరకు తమకు ఈడీ నుంచి నోటీసులు అందలేదని మాజీ మంత్రులు షబ్బీర్‌ అలీ, గీతారెడ్డి, సుదర్శన్‌ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌లు తెలిపారు. పార్టీ విరాళం కింద డబ్బులు ఇచ్చింది వాస్తవమేనని వారు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని