Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 26 Sep 2022 13:05 IST

1. దెందులూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న మహాపాదయాత్ర

అమరావతి పరిరక్షణకోసం రాజధాని ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర 15వ రోజుకు చేరుకుంది. ఆదివారం సాయంత్రం కృష్ణా జిల్లా నుంచి ఏలూరు జిల్లాలోకి ప్రవేశించింది. సోమవారం దెందులూరు నియోజకవర్గం కొనికి నుంచి రైతులు పాదయాత్ర ప్రారంభించారు. రైతులకు సంఘీభావం తెలిపేందుకు ఏలూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, రామరాజు, మాజీ మంత్రి జవహర్‌, మాజీ ఎంపీ మాగంటి బాబు, జిల్లా కార్యాలయ కార్యదర్శి పాలి ప్రసాద్‌.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారుల మృతి

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ మున్సిపాలిటీలో విషాదం చోటుచేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని సోలీపూర్‌ శివారులో నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన అక్షిత్ గౌడ్‌, ఫరీద్‌, ఫరీన్‌ ఈ ఉదయం ఆడుకోవడానికి బయటకు వెళ్లారు. ఓ చోట వెంచర్‌ కోసం వేసిన స్థలంలో నీరు నిలవగా.. అందులో చేపలు పట్టేందుకు దిగారు. ఈ క్రమంలో ఈత రాక మునిగిపోయి ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రాహుల్‌జీ మీ జోడో యాత్ర సరే.. ముందు వారిద్దరిని కలపండి..!

అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతోన్న వేళ రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం కాంగ్రెస్‌ పార్టీకి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. రాజస్థాన్‌ సీఎం కుర్చీ సచిన్‌ పైలట్‌కు ఇచ్చేందుకు ససేమిరా అంటోన్న ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ వర్గీయులు మూకుమ్మడి రాజీనామాకు దిగారు. దీంతో వారిని బుజ్జగించేందుకు సీనియర్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ స్పందిస్తూ.. కాంగ్రెస్‌పై వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆసీస్‌తో సిరీస్‌ ముగించాం సరే.. భారత్‌కు కలిసొచ్చిందేంటి.. లోపాలేంటి?

ఆసియా కప్‌లో ఘోర పరాభవంతో ఢీలాపడిన అభిమానులకు.. ఆస్ట్రేలియాపై సిరీస్‌ విజయంతో జోష్ తెచ్చింది టీమ్‌ఇండియా. సరిగ్గా 28 రోజుల్లో టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు తొలి పోరు.. ఈలోపు దక్షిణాఫ్రికాతో మాత్రమే టీ20 సిరీస్‌ మిగిలి ఉంది. స్వదేశంలోనే సెప్టెంబర్‌ 28 నుంచి సఫారీలతో మూడు టీ20లు ఆడనుంది. ఈ క్రమంలో ఆసీస్‌తో సిరీస్‌లో భారత్‌కు కలిసొచ్చిన సానుకూలాంశాలు ఏమున్నాయి..? రెండు రోజల్లో ప్రారంభమయ్యే మరో సిరీస్‌కు జట్టులో ఎలాంటి మార్పులు చేసుకోవాలి..? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అణుదాడి చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇటీవల సైనిక సమీకరణ ప్రకటన చేసిన నాటి నుంచి పశ్చిమ దేశాల్లో అణుభయాలు పెరిగిపోయాయి. ఉక్రెయిన్‌ యుద్ధ భూమిలో ఓటమి తప్పించుకోవడానికి రష్యా చిన్నసైజు టాక్టికల్‌  అణు బాంబును వాడొచ్చనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి ప్రైవేటుగా ఓ సందేశం రష్యాకు చేరింది. రష్యా అణు యుద్ధం మొదలుపెడితే తీవ్ర పరిణామాలు తప్పవని ఈ సందేశంలో పేర్కొంది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌ ధ్రువీకరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఎన్టీఆర్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. 

‘అమ్మతోడు అడ్డంగా నరికేస్తా’... ఈ పవర్‌ఫుల్‌ డైలాగ్‌ వినగానే తెలుగు సినీ ప్రేక్షకులు, ముఖ్యంగా ఎన్టీఆర్‌ (NTR) అభిమానులకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఎన్టీఆర్‌ హీరోగా వెండితెరకు పరిచయమైన తొలినాళ్లలో విడుదలైన ‘ఆది’(Aadi)లోని డైలాగ్‌ ఇది. వి.వి. వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేశ్‌ నిర్మాతగా రూపుదిద్దుకొన్న ఈ చిత్రం అప్పట్లో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుంది. ‘ఆది’ విడుదలై 20 సంవత్సరాలైన సందర్భంగా ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అందాన్ని పెంచే ఈ జ్యూస్‌లను తాగుతున్నారా!

మనకు అందుబాటులోనే ఉండే కూరగాయలు, పండ్లలో శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల అన్ని కూరగాయలు, పండ్లు తినాలని పెద్దలు చెబుతుంటారు. కొన్ని కూరగాయలు, పండ్లు ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా ఇస్తాయి. అయితే వీటిని తినడానికి బదులు జ్యూస్‌లుగా చేసుకొని నేరుగా తాగేయచ్చు. క్యారెట్లో ఉండే విటమిన్‌  ‘ఎ’ చర్మ సౌందర్యాన్ని పెంచడంలో ఎంతగానో తోడ్పడుతుంది. దీంతో పాటు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. యూఎస్‌ మీడియాపై జై శంకర్ ఘాటు విమర్శలు..!

 అమెరికా మీడియాపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌ విమర్శలు గుప్పించారు. భారత్‌పై పక్షపాత ధోరణిలో కథనాలు ప్రచురితం చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. మీడియాలో రాజకీయాలు నడుస్తున్నాయంటూ.. కశ్మీర్‌ అంశంపై అగ్రదేశంలో జరిగిన చర్చ గురించి స్పందించారు. ‘నేను ఇక్కడి మీడియాను గమనిస్తున్నాను. కొన్ని మీడియా సంస్థల కవరేజ్‌లో పక్షపాత ధోరణి కనిపిస్తోంది. కొందరు తమను తాము భారత్‌ సంరక్షకులమని భావిస్తుంటారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సరికొత్త జీవనకాల కనిష్ఠానికి రూపాయి.. కొనసాగుతున్న పతనం

 డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ పతనం ఇంకా కొనసాగుతూనే ఉంది. అమెరికాలో రేట్ల పెంపుతో ఊపందుకున్న పతనం ఈక్విటీ మార్కెట్లలోని బలహీనతలతో కొనసాగుతూనే ఉంది. సోమవారం రూ.81.55 వద్ద ప్రారంభమైన రూపాయి క్రితం సెషన్‌ ముగింపైన రూ.80.99తో పోలిస్తే 0.64 శాతం పతనమైంది. గత తొమ్మిది సెషన్‌లలో మొత్తం ఎనిమిది సెషన్‌లలో రూపాయి నేలచూపులు చూసింది. 2.28 శాతం నష్టపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు బెయిల్‌

రూ.200 కోట్ల దోపిడీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ (Jacqueline Fernandez)కు దిల్లీ కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో పాటియాలా హౌస్‌ కోర్టు ఆమెకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో జాక్వెలిన్‌ను నిందితురాలిగా పేర్కొంటూ ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అనుబంధ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు