Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 29 Sep 2022 12:58 IST

1. పెళ్లితో సంబంధం లేదు.. మహిళలందరికీ అబార్షన్‌ చేయించుకునే హక్కుంది..!

మహిళల గర్భస్రావాలపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. చట్టపరంగా మహిళలందరికీ సురక్షితంగా అబార్షన్లు చేయించుకునే హక్కు ఉందని తెలిపింది. ఇందులో వివాహితులు, అవివాహితులు అంటూ తేడా చూపించడం రాజ్యాంగవిరుద్ధమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ‘వైవాహిక అత్యాచారాన్ని’ కూడా కోర్టు ప్రస్తావించింది. బలవంతపు గర్భధారణ నుంచి మహిళలను కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. ఎప్పటికీ నువ్వే నా గ్రేటెస్ట్‌ ఆటగాడివి: విరాట్‌

టెన్నిస్‌ జెంటిల్మెన్‌ రోజర్‌ ఫెదరర్‌కు క్రికెట్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లీ ఓ వీడియో సందేశం పంపించారు. దీనిలో ఆయన స్విస్‌ సూపర్‌స్టార్‌ ఫెదరర్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ వీడియోను ఏటీపీ టూర్‌ (ది అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌) తన ట్విటర్‌ హ్యాండిల్‌లో పోస్టు చేసింది. ఈ సందర్భంగా 2015, 2018లో ఆస్ట్రేలియాలో ఫెదరర్‌ను కలిసిన విషయాన్ని కూడా విరాట్‌ గుర్తు చేసుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. అమిత్ షా పర్యటనకు ముందు.. జమ్ముకశ్మీర్‌లో వరుస పేలుళ్లు

జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్‌ను రెండు భారీ పేలుళ్లు వణికించాయి. బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకొంది.  మొత్తం రెండు బస్సుల్లో ఈ పేలుళ్లు జరిగినట్లు గుర్తించారు. తొలి పేలుడులో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం రాత్రి 10.30 సమయంలో దొమాయిల్‌ చౌక్‌లోని ఓ పెట్రోల్‌ పంప్‌ సమీపంలో నిలిపిన బస్సులో పేలుడు చోటు చేసుకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. తిరుమలలో వైభవంగా మలయప్పస్వామి సింహ వాహన సేవ

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన గురువారం ఉదయం స్వామివారు సింహ వాహనంపై యోగ నృసింహుడిగా మాఢవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. జగన్నాయకుడి అవతారాల్లో నాలుగోది నృసింహ అవతారం. దుష్టజన శిక్షణకు, శిష్టజన రక్షణకు సింహ వాహనం ప్రతీతి. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. పాత హిట్‌ సినిమాలు కొత్తగా.. ‘రీ రిలీజ్‌’ క్రేజ్‌ సంగతులివీ

గతంలో సూపర్‌ హిట్‌ అయిన సినిమాలు బాక్సాఫీసు వద్ద మళ్లీ సందడి చేస్తున్నాయి. ‘రీళ్లు’లో సందడి చేసిన చిత్రాలు ఇప్పుడు ‘4కే’ (4 k) టెక్నాలజీతో కొత్త అనుభూతి పంచుతున్నాయి. ఈతరం సినీ ప్రియులను నాటి తరంలోకి తీసుకెళ్తున్నాయి. టాలీవుడ్‌లో ట్రెండ్‌గా మారిన ‘రీ రిలీజ్‌’ (Re Release) విశేషాలేంటో చూద్దాం.. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. హరికేన్ బీభత్సం.. తేలియాడిన ఇళ్లు, వీధుల్లోకి షార్క్‌లు..!

అమెరికాలో హరికేన్ ‘ఇయన్’ బీభత్సం సృష్టించింది. బుధవారం సాయంత్రం ఇది ఫ్లోరిడా తీరాన్ని బలంగా తాకింది. దీంతో కుండపోత వర్షాలు, 200 కిలోమీటర్లకుపైగా వేగంతో వీచిన భీకర గాలులతో తీర ప్రాంత ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. యూఎస్‌లో రికార్డైన అత్యంత శక్తిమంతమైన తుపానుల్లో ఇదొకటని అధికారులు వెల్లడించారు. ఈ భయానక గాలుల వేగానికి లైవ్‌లో పరిస్థితి వివరిస్తున్న రిపోర్టర్లు కొట్టుకొని పోయినంతపనైంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. KTR: కేంద్రానికి థాంక్స్‌.. ఆ సిఫార్సులను కూడా గౌరవిస్తే బాగుంటుంది: కేటీఆర్‌

‘మిషన్‌ భగీరథ’ పథకానికి కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించడపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ఆవాసాలకు సురక్షిత తాగునీరు సరఫరా చేస్తున్న విషయాన్ని గుర్తించడంపై కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. అయితే మిషన్‌ భగీరథకు రూ.19వేల కోట్లు ఇవ్వాలన్న నీతి ఆయోగ్‌ సిఫార్సులను ఎన్డీయే ప్రభుత్వం గౌరవిస్తే ఇంకా బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. Prabhas: 12 ఏళ్ల తర్వాత ప్రభాస్ రాక.. మొగల్తూరులో అభిమానుల హంగామా

ఇంటర్నెట్‌డెస్క్‌: రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు (Krishnam Raju) సంస్మరణ సభ కోసం ఆయన స్వగ్రామమైన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గురువారం మధ్యాహ్నం జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సుమారు 12 ఏళ్ల తర్వాత ప్రభాస్‌ (Prabhas) ఇక్కడకు చేరుకున్నారు. దశాబ్దకాలం తర్వాత తమ అభిమాన హీరో ఇక్కడికి రావడంతో ఈ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. PFI: పీఎఫ్‌ఐ ట్విటర్‌ ఖాతా నిలిపివేత

ఇస్లామిక్ అతివాద సంస్థ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ)పై కేంద్రం నిషేధం విధించిన మరుసటి రోజే ఆ సంస్థపై ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ కూడా చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పీఎఫ్‌ఐ అధికారిక ఖాతాలను గురువారం నుంచి నిలిపివేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. India Corona: 0.09 శాతానికి క్రియాశీల కేసుల రేటు..!

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తోంది. గత కొద్ది రోజులుగా ఐదు వేల దిగువనే కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా 3.16 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. నాలుగువేల మందికి వైరస్ సోకినట్లు తేలింది. మరోపక్క క్రియాశీల కేసులు క్రమంగా దిగొస్తున్నాయి. గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని