Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 02 Oct 2022 13:15 IST

1. గాంధీ ప్రతి మాటా.. ప్రతి అడుగూ ఆచరణీయం: సీఎం కేసీఆర్‌

కరోనా విపత్తు వేళ గాంధీ ఆస్పత్రి అందించిన సేవలు ప్రశంసనీయమని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి ఆవరణలో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నిర్మించిన 16 అడుగుల బాపూజీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడారు. ‘‘బక్కపల్చని వాడు ఏం చేస్తారని నన్ను చాలా మంది అవహేళన చేశారు. అప్పుడు నేను గాంధీజీనే స్మరించుకునేవాడిని’’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నేను ఎందుకూ పనికిరానని.. రూ.పది లక్షలు ఇచ్చారు: అల్లు అర్జున్‌

ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) శత జయంతిని పురస్కరించుకొని ‘అల్లు రామలింగయ్య’ పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారం రాత్రి హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి పుస్తకాన్ని ఆవిష్కరించారు.  సందర్భంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. ‘‘నాకు 16 ఏళ్లు వచ్చేవరకూ తాతయ్య, నానమ్మలతోనే ఉన్నాను. తాతయ్య చనిపోయాక రూ.10 లక్షల ఇన్స్యూరెన్స్‌ డబ్బు వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నేటి మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం..

 భారత్‌-దక్షిణాఫ్రికా రెండో టీ20 మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా అక్కడి వాతావరణ శాఖ ఈ మేరకు అప్‌డేట్‌ ఇచ్చింది. గువహటిలోని బర్సపరా స్టేడియంలో ఆదివారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్‌ జరగనుంది. అయితే.. గువహటిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ‘ఆక్యూవెదర్‌’ తెలిపింది. మూడు గంటలపాటు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మూలానక్షత్రం.. దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడోరోజు కనకదుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రోజు అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం కావడంతో దుర్గగుడికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే బారులు తీరారు. దీంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ఈ ఒక్కరోజే అమ్మవారిని 2లక్షలకు పైగా భక్తులు దర్శించుకుంటారని అధికారులు భావిస్తున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మహాత్ముడికి నేతల ఘన నివాళి.. ఆదర్శమూర్తి అడుగుజాడల్లో నడవాలని పిలుపు

జాతిపిత మహాత్మా గాంధీ జీవిత విలువలైన శాంతి, సమానత్వం, మత సామరస్యానికి మనల్ని మనం పునరంకితం చేసుకోవడానికి ఆయన జయంతి ఒక సందర్భం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మహాత్ముడి 153వ జయంతి సందర్భంగా దిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద ఆమె ఘనంగా నివాళులర్పించారు.  అమృత మహోత్సవాలను నిర్వహించుకుంటున్న సందర్భంలో వచ్చిన ఈ గాంధీ జయంతికి మరింత ప్రాముఖ్యత సంతరించుకుందని తెలిపారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఈ ఆర్థిక పాఠాలు.. సంతోషకర జీవితానికి సోపానాలు!

సంపాదించిన డబ్బంతా ఖర్చు పెట్టొద్దు. వచ్చిన ఆదాయంలో కొంత డబ్బును దాచుకొని మిగతా మొత్తాన్ని నెలవారీ ఖర్చులకు కేటాయించాలి. ఆదాయం, ఖర్చులతో ఇంటి నెలవారీ ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలి. ఆ ప్రణాళిక ప్రకారమే ఖర్చు పెట్టాలి.. పొదుపు చేయాలి. చేబదులుగా తీసుకున్నా అప్పు అప్పే. దాన్ని తిరిగి చెల్లించగలిగే వీలు ఉన్నప్పుడే అప్పులు చేయండి. ఎంత తక్కువ అప్పు ఉంటే అంత ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది. వచ్చిన ఆదాయంతో మరింత సంపద సృష్టిస్తేనే భవిష్యత్తులో ఢోకా ఉండదు. అందుకు మీరు క్రమం తప్పకుండా మంచి రాబడి ఇచ్చే షేర్లు, ఫండ్లలో పెట్టుబడి పెట్టాలి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అగ్ర నిర్మాత చిన్న కొడుకుతో పెళ్లి వార్తలు.. అనన్య ఆగ్రహం

‘మల్లేశం’తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల (Ananya Nagalla). మొదటి సినిమాతోనే నటిగా గుర్తింపు తెచ్చుకొన్న ఈ భామ ప్రస్తుతం కెరీర్‌లో రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా.. అనన్య త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు ఇటీవల గుప్పుమన్నాయి. టాలీవుడ్‌కు చెందిన ఓ అగ్ర నిర్మాత రెండో కుమారుడితో ఆమె ఏడడుగులు వేయనున్నారని పలు వెబ్‌సైట్స్‌లో కథనాలు వచ్చాయి. వీటిపై స్పందిస్తూ అనన్య ఆగ్రహం వ్యక్తం చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గేదే విజయం.. గహ్లోత్‌ ధీమా

కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసే సామర్థ్యం సీనియర్‌ నేత, ఎంపీ మల్లికార్జున ఖర్గేకు ఉందని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ అన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో ఖర్గేనే విజయం సాధిస్తారని ఆదివారం ఆయన ధీమా వ్యక్తం చేశారు. పోటీలో ఉన్న మరో నేత శశిథరూర్‌ను ‘ఉన్నత వర్గానికి’ చెందిన వ్యక్తిగా గహ్లోత్‌ అభివర్ణించారు. ‘‘ఖర్గేకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆయన దళిత వర్గం నుంచి వచ్చిన ఓ సహృదయ నేత..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. హనుమంత వాహనంపై దర్శనమిచ్చిన శ్రీనివాసుడు

తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా హనుమంత వాహనసేవను ఘనంగా నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో హనుమంత వాహనంపై కోదండరాముడిగా మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారి వాహన సేవను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. సాయంత్రం స్వర్ణరథం, రాత్రికి గజవాహనంపై భక్తులను శ్రీనివాసుడు అభయప్రదానం చేయనున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 55మంది బంధువులతో దర్శనానికి వెళ్లిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకునేందుకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ 55మందికి పైగా బంధువులతో రాత్రి ఒంటి గంట సమయంలో ఆలయంలోకి వెళ్లారు. వీడియో తీస్తున్న మీడియా ప్రతినిధులను వీడియోలు తీయొద్దంటూ ఆయన సెక్యురిటీ సిబ్బంది వారించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts