Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 03 Oct 2022 13:03 IST

1. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

మునుగోడు ఉప ఎన్నికకు నగారా మోగింది. ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. మునుగోడులో నవంబర్‌ 3న ఉప ఎన్నిక పోలింగ్‌ నిర్వహించనున్నారు. నవంబర్‌ 6న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాన్ని ప్రకటించనున్నారు. ఉప ఎన్నికకు ఈనెల 7న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఈసీ తెలిపింది. నామినేషన్ల స్వీకరణకు ఈనెల 14 వరకు గడువు విధించింది. 15న నామినేషన్ల పరిశీలన, 17న ఉపసంహరణకు తుది గడువుగా పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మీరు ‘జెన్‌-జీ’నా? భవిష్యత్తు ఆర్థిక భరోసాకు మార్గాలివే!

మీరు జనరేషన్‌ జెడ్‌- ‘జెన్‌ జీ’ (1997-2012 మధ్య జన్మించినవారు)కు చెందినవారా? పెట్టుబడులను ఎలా వర్గీకరించుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే, మీ కంటే ముందు తరం అంటే మీ తల్లిదండ్రుల పెట్టుబడి మార్గాన్ని మీరు అనుసరించాల్సిన అవసరం లేదు! ఎందుకంటే అప్పటి ధరలు, సామాజిక-రాజకీయ పరిస్థితులు, పెట్టుబడి మార్గాలు, ఉపాధి అవకాశాలు.. చాలా భిన్నంగా ఉండేవి. సగటున 7.75 శాతం ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే 1960లో రూ.100 ఇప్పుడు దాదాపు రూ.8,800తో సమానం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఈ దసరా నిరుడు లెక్క ఉండదు.. థియేటర్‌-ఓటీటీ దద్దరిల్లిపోతాయ్‌!

‘ఈ దసరా నిరుడు లెక్క ఉండదీ.. జమ్మివెట్టి చెప్తాన్నా.. బద్దల్ బాసింగలయ్‌తయ్.. ఎట్లైతేగట్లాయె.. చూసుకుందాం’.. ‘దసరా’ టీజర్‌లో నాని చెప్పిన డైలాగ్‌ ఈ దసరాకు సరిగ్గా సరిపోతుంది. గతంలో ఎన్నడూ లేనంత ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఈ వారం ఇవ్వనుంది. అటు థియేటర్‌.. ఇటు ఓటీటీలో అదిరిపోయే చిత్రాలు వస్తున్నాయి. అవేంటో చూసేయండి...!  చిరంజీవి కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘గాడ్‌ఫాదర్‌’ దసరా కానుకగా అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఖర్గే వ్యాఖ్యకు థరూర్ కౌంటర్..!

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో బరిలో మిగిలిన ఇద్దరు అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టారు. ఈ క్రమంలో సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై మరో నేత శశిథరూర్ ట్విటర్ వేదిక స్పందించారు. సమర్థవంతమైన నాయకత్వ ఎంపికకు ఇదొక అవకాశమంటూ పోస్టు పెట్టారు. నిన్న ఖర్గే మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఏకాభిప్రాయంతో పూర్తి కావాలని తాను ప్రయత్నించినా, థరూర్‌ మాత్రం పోటీనే కోరుకున్నారని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. హైదరాబాద్‌లో అమల్లోకి ‘రోప్‌’.. స్టాప్‌లైన్‌ దాటితే..

నగరంలో నేటి నుంచి ట్రాఫిక్‌ ఫోలీసుల ఆపరేషన్‌ ‘రోడ్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పార్కింగ్‌ అండ్‌ ఎంక్రోచ్‌మెంట్‌’ (రోప్‌) అమల్లోకి వచ్చింది. ట్రాఫిక్‌ కూడళ్ల వద్ద రెడ్‌లైట్‌ వెలిగినప్పుడు పాదచారులు అటూ, ఇటూ దాటేందుకున్న తెల్లగీతల (స్టాప్‌లైన్‌)ను లెక్కచేయకుండా దూసుకెళ్లేవారిపై ట్రాఫిక్‌ పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నారు. స్టాప్‌లైన్‌ను దాటేసి వెళ్తున్న వాహదారులకు ప్రస్తుతం రూ.100 జరిమానా విధిస్తుండగా.. ఈరోజు నుంచి రూ.200 జరిమానా వేయనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆ రోజు బాధపడ్డా.. ఇప్పుడు గెస్ట్‌గా వచ్చా: నవీన్ పొలిశెట్టి

‘‘తెలుగు చిత్రపరిశ్రమలో పనిచేయడమనేది ఒక వరం’’ అంటున్నారు నటుడు నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty). బెల్లంకొండ గణేశ్‌, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ‘స్వాతిముత్యం’ (Swathimuthyam) ప్రీ రిలీజ్‌ వేడుకలో నవీన్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘‘కొన్నేళ్ల క్రితం ఇదే శిల్పకళావేదికలో ఎన్నో ఈవెంట్స్‌కి ఫ్యాన్‌ పాసులు దొరక్క బాధపడుతూ తిరిగి వెళ్లిపోయిన రోజులు ఉన్నాయి. ఆరోజు నిరాశతో తిరిగివెళ్లిపోయిన ఆ అభిమానే ఈరోజు ఇదే వేదికపై అతిథిగా నిలబెట్టిన తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ట్రాఫిక్‌ ఆంక్షలు.. అటువైపు వెళ్లొద్దు: హైదరాబాద్‌ పోలీసుల సూచన

ఎల్బీస్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో సోమవారం మధ్యాహ్నం నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసుల తెలిపారు. ఆంక్షల సమయంలో నిజాం కాలేజ్‌, బషీర్‌బాగ్‌ కూడలి, కంట్రోల్‌ రూమ్‌, ఆర్బీఐ, లక్డీకాపూల్‌, అంబేడ్కర్‌ విగ్రహం, తెలుగుతల్లి కూడళ్ల వైపు వెళ్లొద్దని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మహమ్మారి నేర్పిన పాఠమిదే..!

పర్యావరణ సమతుల్యతతోనే ప్రజలందరి జీవితాలు ముడిపడిఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్‌ అన్నారు. వాతావరణ మార్పులతో కలిగే దుష్ప్రభావాలు ఎలా ఉంటాయో కరోనా మహమ్మారి మనకు పాఠాలు నేర్పిందన్నారు. ఈ మార్పుల వల్ల బలహీన వర్గాలే ఎక్కువ ఇబ్బంది పడుతున్నాయంటూ.. పాకిస్థాన్‌ వరదల గురించి ఆమె ప్రస్తావించారు. ఏ దేశమైనా అందుకు మినహాయింపు కాదని.. అయితే అందరికి సమాన సదుపాయాలు అందించడంపైనే దృష్టి సారించాలని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. టీ20 క్రికెట్‌లో నమోదైన అత్యధిక స్కోర్లు ఇవే!

అఫ్గానిస్థాన్‌ (278/3).. ఐర్లాండ్‌పై 2019లో.. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్‌ ఆటగాడు హజ్రతుల్లా జాజాయ్‌ 62 బంతుల్లోనే 162 పరుగులు చేశాడు. చెక్‌ రిప్లబిక్‌ (278/4).. టర్కీపై 2019లో.. చెక్‌ రిప్లబిక్‌ ఆటగాడు సుదేష్ విక్రమశేఖర 36 బంతుల్లో 104 పరుగులు చేశాడు. టర్కీ 21 పరుగులకే ఆలౌట్‌ కావడం గమనార్హం. ఆస్ట్రేలియా (263/3).. శ్రీలంకపై 2016లో.. ఆసీస్‌ ప్లేయర్‌ మ్యాక్స్‌వెల్‌ 65 బంతుల్లో 145 పరుగులు బాదాడు. శ్రీలంక (260/6).. కెన్యాపై 2007లో.. లంక ఆటగాళ్లు సనత్‌ జయసూర్య (88), జయవర్ధనే (65) రాణించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సూర్యప్రభ వాహనంపై విహరించిన మలయప్పస్వామి

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో వాహనంపై విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. వాహన సేవలో మలయప్పస్వామిని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సూర్యప్రభ వాహనంపై తిరుమలేశుడి దర్శనంతో పూర్ణ ఫలం దక్కుతుందనేది భక్తుల నమ్మకం. ఈ వాహనసేవను తిలకిస్తే ఆరోగ్యం, ఐశ్వర్య భాగ్యం కలుగుతాయనేది వారి విశ్వాసం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని