Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 07 Oct 2022 12:59 IST

1. విశాఖ రాజధానికి అడ్డొస్తే రాజకీయంగా చితక్కొట్టాలి: మంత్రి ధర్మాన

విశాఖలో రాజధాని ఏర్పాటైతే మన భవిష్యత్‌ బాగుంటుందని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. దీనికోసం త్యాగాలు చేయాల్సిన అవసరం లేదని.. విశాఖ రాజధాని అని ఏక కంఠంతో మాట్లాడితే చాలన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో నిర్వహించిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి
 
2. VVS Laxman: వన్డే వరల్డ్‌కప్‌ స్క్వాడ్‌ ఎంపిక కత్తిమీద సామే: వీవీఎస్‌ లక్ష్మణ్‌

వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్‌నకు జట్టు ఎంపిక సెలక్టర్లకు కత్తిమీద సాముగా మారనుందని హైదరాబాదీ వెటరన్‌ బ్యాటర్‌, నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ అధిపతి వీవీఎస్‌ లక్ష్మణ్‌ జోస్యం చెప్పారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌కు లక్ష్మణ్‌ స్టాండ్‌ ఇన్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. యువ క్రికెటర్లు అద్భుతంగా ఆడుతుండటంతో సెలక్టర్ల ఆప్షన్లు కఠినతరంగా మారనున్నాయని లక్ష్మన్‌ విశ్లేషించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

3.  దీపావళి నాటికి ఇ-కామర్స్‌లో మరో 5 లక్షల ఉద్యోగాలు!

పండగ వేళ విక్రయాలు ఊపందుకున్న నేపథ్యంలో డిమాండ్‌కు అనుగుణంగా ఇ-కామర్స్‌ సంస్థలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ఇప్పటి వరకు దాదాపు మూడు లక్షల మంది కొత్త సిబ్బందిని నియమించుకున్నట్లు టీమ్‌లీజ్‌ నివేదిక తెలిపింది. దీపావళి నాటికి మరో ఐదు లక్షల మందికి ఈ రంగంలో ఉపాధి లభించే అవకాశం ఉందని అంచనా వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. ఎయిరిండియా మాజీపైలట్‌ కన్నుసన్నల్లో డ్రగ్‌ రాకెట్‌..!

ముంబయి, గుజరాత్‌లో పట్టుబడిన రూ.100 కోట్లకుపైగా విలువైన డ్రగ్స్‌ వెనుక ఎయిరిండియా మాజీ పైలట్‌ హస్తం ఉన్నట్లు ఎన్‌సీబీ (ది నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో) అధికారులు గుర్తించారు. ఇటీవల ఎన్‌సీబీ అధికారులు ముంబయి, గుజరాత్‌లో 60 కేజీల మెఫిడ్రొన్‌(ఎండీ)ను స్వాధీనం చేసుకొన్నారు. దీని విలువ రూ.120 కోట్లకు పైమాటే. ఈ కేసులో కీలక సూత్రధారులుగా సొహైల్‌ గఫ్పార్‌ మహిదా, మిథి పిచైదాస్‌ అనే వ్యక్తులను గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. Delhi liquor scam: హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా మరోసారి ఈడీ సోదాలు

దిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరోసారి దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తోంది. తెల్లవారుజాము నుంచే సోదాలు చేపట్టినట్లు ఈడీ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. దిల్లీ, పంజాబ్‌, హైదరాబాద్‌లోని 35 ప్రదేశాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో నాలుగుచోట్ల ఈడీ సోదాలు జరుగుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. Priyanka Chopra: యుగాల తర్వాత వినిపిస్తోన్న గళం.. అగ్నిపర్వతంలా పేలుతుంది..!

హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ఇరాన్‌ మహిళలకు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మద్దతు పలికారు. హిజాబ్‌ సరిగా ధరించలేదన్న అభియోగంపై అరెస్టయిన మాసా అమీని అనే యువతి నైతిక విభాగం పోలీసుల కస్టడీలో మరణించింది. ఈ ఘటనపై వ్యక్తం అవుతోన్న నిరసనల్లో యువతులు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో తమ హక్కుల కోసం పోరాడుతున్న మహిళల ధైర్యాన్ని ఆమె కొనియాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. Ukraine War: పుతిన్‌ అణు బెదిరింపులు జోక్‌ కాదు..: బైడెన్‌

1962లో క్యూబా మిసైల్‌ సంక్షోభం తర్వాత తాము ఈ స్థాయి తీవ్రమైన అణు అంతిమపోరు ముప్పును చూడలేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు. ఆయన గురువారం మాన్‌హట్టన్‌లో డెమొక్రాటిక్‌ పార్టీ విరాళాల సేకరణ కార్యక్రమంలో ప్రసంగించారు. ఉక్రెయిన్‌ను ఆక్రమించాలనే లక్ష్యం కోసం పుతిన్‌ చేస్తున్న అణు బెదిరంపులు ఏమాత్రం హాస్యాస్పదం కాదని బైడెన్‌ వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి
 

8. Adipurush: సైఫ్‌ లుక్‌ కాంట్రవర్సీ.. ఓం రౌత్‌ క్లారిటీ

సుమారు రూ.300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush). పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా టీజర్‌పై ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రావణాసురుడి పాత్రధారి అయిన సైఫ్‌ అలీఖాన్‌ లుక్‌పై విపరీతమైన ట్రోల్స్‌ చేస్తున్నారు. దీనిపై తాజాగా డైరెక్టర్‌ ఓం రౌత్‌ స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. India Corona: 30 వేలకు దిగొచ్చిన క్రియాశీల కేసులు..!

దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. తాజాగా మరోసారి కొత్త కేసులు రెండు వేల దిగువన నమోదయ్యాయి. క్రియాశీల కేసులు 30 వేలకు పడిపోయాయి. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. Munugode Bypoll: మునుగోడు తెరాస అభ్యర్థిని ఖరారు చేసిన కేసీఆర్

త్వరలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నికకు అభ్యర్థిని తెరాస ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని తెరాస అభ్యర్థిగా ప్రకటించారు. మునుగోడు టికెట్‌ కోసం పార్టీలోని సీనియర్‌ నేతలు ప్రయత్నించగా.. సుదీర్ఘ చర్చల అనంతరం పార్టీ అధిష్ఠానం కూసుకుంట్లవైపు మొగ్గు చూపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని