Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 23 Nov 2022 13:02 IST

1. మోదీ అధ్యక్షతన సమావేశం.. చంద్రబాబుకు ఆహ్వానం

తెదేపా అధినేత చంద్రబాబు డిసెంబర్‌ 5న దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఫోన్‌ చేసి ఈ సమావేశానికి ఆహ్వానించారు. భారత్‌లో నిర్వహించే జీ-20 భాగస్వామ్య దేశాల సదస్సుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. 54 క్షణాల్లో 24 పాస్‌లతో కళ్లు చెదిరే గోల్‌..!

ఫుట్‌బాల్‌లో ప్రత్యర్థి జట్టును ఏకంగా నిమిషం పాటు ప్రేక్షకులుగా మార్చేసిన ఘటన 2006లో ఫిపా ప్రపంచకప్‌లో చోటు చేసుకొంది. లీగ్‌ దశలో అర్జెంటీనా జట్టు సెర్బియా-మాంటెనెగ్రోతో తలపడింది. ఈ మ్యాచ్‌ను అర్జెంటీనా 6-0 తేడాతో అలవోకగా గెలిచింది. కానీ, ఈ మ్యాచ్‌లో ఫుట్‌బాల్‌ చరిత్రలో అపురూపంగా నిలిచిపోయే గోల్‌ ఒకటి కొట్టారు. ఈ మ్యాచ్‌ ఆరో నిమిషంలోనే అర్జెంటీనా గోల్‌ కొట్టి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వాల్‌మార్ట్‌ స్టోర్‌లో మేనేజర్‌ కాల్పులు.. 10 మంది మృతి!

అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. వర్జీనియాలోని ప్రముఖ వాల్‌మార్ట్‌ స్టోర్‌లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో పలువురు మృతిచెందగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. నిందితుడు అదే స్టోర్‌లో పనిచేస్తోన్న మేనేజర్‌గా తెలుస్తోంది. అమెరికా కాలమానం ప్రకారం.. మంగళవారం రాత్రి స్టోర్‌ మేనేజర్‌ బ్రేక్‌ రూంలోకి చొరబడి అక్కడున్నవారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘అసలు ట్విటర్‌ ఉంటుందా?’.. ఎలాన్‌ మస్క్‌ సమాధానమిదే..!

కొత్త యజమాని ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) నేతృత్వంలో ట్విటర్‌ (Twitter)లో వస్తోన్న మార్పులు, వేల సంఖ్యలో ఉద్యోగాల కోతలను చూస్తుంటే అసలు ఈ సంస్థ మనుగడ సాధిస్తుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై పలువురు విమర్శలు చేయగా.. మస్క్‌ వారికి గట్టి సమాధానమిచ్చారు. అలా అనుకుంటే ట్విటర్‌ ఈపాటికే చచ్చిపోయి ఉండాలి? కదా అంటూ విమర్శకులకు కౌంటర్‌ ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5.  శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. ప్రజలకు తప్పని తిప్పలు

శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో ప్రజలు, విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. రోడ్లకు ఇరువైపులా దాదాపు రెండు కిలోమీటర్ల మేర బారికేడ్లు పెట్టడంతో విద్యార్థులు, స్థానికులు వాటి కింద నుంచే వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు నరసన్నపేట ఖాకీపేటగా మారింది. శ్రీకాకుళం జిల్లానే కాకుండా విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి అదనపు బలగాలను మోహరించారు. సుమారు రెండు వేల మంది పోలీసుల దిగ్బంధంలో నరసన్నపేట ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘టెంపర్‌’ క్లైమాక్స్‌ విన్నాక పూరి జగన్నాథ్‌ భోజనం ప్లేట్‌ నెట్టేశారు!

ఆయన కథలోని పాత్రలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆడియన్స్‌ను ఉర్రూతలూపే మంచి కిక్‌ ఉంటుంది. రచయితగా సూపర్‌ హిట్ కథలను అందించడమే కాక దర్శకుడిగా చక్కటి చిత్రాన్ని తెరకెక్కించి, నటుడిగా, టీవీ యాంకర్‌గా తన ప్రతిభ చూపిన క్రేజీ రైటర్‌ వక్కంతం వంశీ (Vakkantham Vamsi). తన భార్య శ్రీవిద్యతో కలిసి ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చి తన సినీ ప్రయాణం గురించి వివరించారు. మరి వంశీ చెప్పిన ముచ్చట్లేంటో చూద్దాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మంత్రి మల్లారెడ్డి తన ఫోన్‌ను చెత్తబుట్టలో ఎందుకు దాచిపెట్టారు?: రఘునందన్‌ రావు

ఐటీ దాడుల నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు వ్యాఖ్యానించారు. దుబ్బాక నియోజకవర్గ అభిృద్ధికి కేటాయించిన రూ.5 కోట్లు ఖర్చు చేసే వెసులుబాటు కల్పించాలంటూ ముఖ్యమంత్రికి ఆయన బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ దాడుల అంశంపై స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. చైల్డ్‌-ఎడ్యుకేషన్‌ ప్లాన్లలో అన్నీ ఉన్నా.. పరిమితులున్నాయ్‌!

రోజురోజుకీ పిల్లల చదువుల ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల విద్య విషయంలో ఓ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. బీమా, పెట్టుబడితో కూడిన మదుపు మార్గాలు ఉపయోగకరంగా ఉంటాయి. ఒకవేళ ప్రమాదవశాత్తూ సంరక్షుడు అకాలమరణం చెందినా.. పిల్లలకు ఆర్థిక భరోసా ఉంటుంది. అలాగే ద్రవ్యోల్బణం అధిగమించే రాబడి వల్ల పై చదువులకు కావాల్సిన డబ్బూ సమకూరుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘అఫ్తాబ్ నన్ను నరికి చంపుతాడు’.. 2020లోనే శ్రద్ధా ఫిర్యాదు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న శ్రద్ధా వాకర్ హత్యలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. నిందితుడు ఆమెను ముక్కలుగా కోసి, దిల్లీలోని అటవీ ప్రాంతంలో విసిరినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. తనకు ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని ఆమె ముందుగానే భయపడినట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం మహారాష్ట్రలోని వసాయ్‌లో ఆమె చేసిన ఫిర్యాదు బట్టి ఈ విషయం వెల్లడవుతోంది. దిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఈక్వెడార్‌ అభిమానుల అత్యుత్సాహం.. ఫిఫా క్రమశిక్షణ చర్యలు

ఉత్కంఠభరిత మ్యాచ్‌లతో ఫిఫా ప్రపంచకప్‌ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఇక తమ జట్లను ప్రోత్సహిస్తూ అభిమానులు చేసే సందడికి కొదవే లేదు. అయితే ఓ జట్టు అభిమానులు చూపిన అత్యుత్సాహం.. ఇప్పుడు ఫిఫా క్రమశిక్షణ చర్యలు తీసుకునే వరకూ వెళ్లింది. నవంబర్‌ 20న ఆతిథ్య ఖతార్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఈక్వెడార్‌ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే.. ఇవి వివాదాస్పదం కావడంతో ఫిఫా పాలక మండలి క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని