Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 26 Nov 2022 13:23 IST

1. అక్టోబర్‌ 23 ఎంతో ప్రత్యేకం.. ఎప్పుడూ లేనంత శక్తి వచ్చినట్లుంది: విరాట్ కోహ్లీ

టీ20 ప్రపంచకప్‌ 2022 తర్వాత టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం కుటుంబంతో గడుపుతూ విశ్రాంతి తీసుకొంటున్నాడు. పొట్టి కప్‌లో భారత్‌ సెమీస్‌లోనే వెనుదిరిగిన విషయం తెలిసిందే. అయితే గ్రూప్‌ స్టేజ్‌ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించడంలో స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. ఆ ఒక్క మ్యాచ్‌లోనే కాకుండా టోర్నీ ఆసాంతం మంచి ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీకి పాక్‌పై చేసిన 82* పరుగులు ప్రత్యేకమైనవి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ట్రంప్‌ ట్వీట్‌ చేయకపోతే ఏంటి..? ఆ ఘోర తప్పిదాన్ని సరిదిద్దా..!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ ట్విటర్‌ ఖాతా పునరుద్ధరించి వారం రోజులు కావొస్తుంది. అయితే.. ఆ తర్వాత ట్రంప్‌ ఒక్క పోస్టు కూడా చేయలేదు. దీని గురించి ఓ నెటిజన్‌ ప్రశ్నించగా  ప్రపంచ కుబేరుడు, ట్విటర్ యజమాని ఎలాన్‌ మస్క్ స్పందించారు. ఆయన ట్వీట్‌ చేయకపోయినా ఫర్వాలేదు కానీ.. అంతకంటే ముఖ్యమైన విషయం మరొకటి ఉందన్నారు. ‘ట్విటర్‌లో ట్రంప్‌ ట్వీట్‌ చేయకపోవడంపై నాకెలాంటి ఇబ్బంది లేదు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ముంబయి మారణహోమానికి 14ఏళ్లు.. కుట్రదారులకు శిక్ష పడాల్సిందే..!

దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో భీకర ఉగ్రదాడి జరిగి నేటికి సరిగ్గా 14ఏళ్లు. అమాయక ప్రజలపై పాకిస్థానీ ముష్కరులు బాంబు పేలుళ్లు జరిపి అనేక మందిని పొట్టనబెట్టుకున్నారు. ఆ మారణహోమం తాలూకు భయానక క్షణాలు ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. కానీ, ఆ ఘోరానికి పాల్పడిన వారు మాత్రం శత్రుదేశంలో స్వేచ్ఛగా తిరుగుతూనే ఉన్నారు. వారిని చట్టం ముందుకు తీసుకొస్తేనే బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని అన్నారు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. తెగించి పోరాడకపోతే వైకాపా శ్రేణుల అకృత్యాలు చుట్టుముడతాయి: చంద్రబాబు

తాము చెప్పిందే రాజ్యాంగమనే గర్వంతో విర్రవీగుతున్న వైకాపా నేతలను ప్రజాక్షేత్రంలో శిక్షించి ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. తెగించి పోరాడకపోతే వైకాపా శ్రేణుల అకృత్యాలు ప్రతి ఒక్కరి ఇంటినీ చుట్టుముడతాయని హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ వ్యతిరేక పాలనపై ప్రజలందరూ ఏకమై రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలని.. లేదంటే రాష్ట్ర భవిష్యత్తు అంధకారమవుతుందని హెచ్చరించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. విజయవంతమైన పీఎస్‌ఎల్‌వీ సీ-54 ప్రయోగం.. నింగిలోకి 9 ఉపగ్రహాలు

శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ప్రయోగించిన పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ)-సి54 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. పీఎస్‌ఎల్‌వీ సీ-54 రాకెట్‌ ద్వారా 9 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించారు. ఈవోఎస్‌ శాట్‌-6 సహా 8 నానో ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ సీ-54 నిర్దేశిత కక్ష్యలోకి మోసుకెళ్లింది. ఓషన్‌ శాట్‌ ఉపగ్రహాల ద్వారా భూవాతావరణం పరిశీలన, తుపానులను పసిగట్టడం, వాతావరణంలో తేమ అంచనా, సముద్రాల మీద వాతావరణంపై అధ్యయనం చేయనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రివ్యూ: ల‌వ్ టుడే

త‌మిళంలో విజ‌య‌వంత‌మైన చిత్రం ‘ల‌వ్ టుడే’. ప్రదీప్ రంగ‌నాథ‌న్ స్వయంగా ర‌చించి, ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ సినిమాలో ఆయ‌నే న‌టుడు. న‌వ‌త‌రం ఆలోచ‌న‌లు, వాళ్ల ప్రేమ‌ల్ని ఆధారంగా చేసుకుని రూపొందిన ఈ సినిమాని తెలుగులో దిల్‌రాజు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆస‌క్తి రేకెత్తించే  ట్రైల‌ర్, దిల్‌రాజు సంస్థ నుంచి విడుద‌ల‌వుతుండ‌డంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు త‌గ్గట్టుగా సినిమా ఉందో? లేదో? తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. విదేశీ విద్యార్థులపై రిషి సునాక్‌ ఆంక్షలు..?

బ్రిటన్‌లో రిషి సునాక్‌ ప్రభుత్వాన్ని వలసలు కలవరపెడుతున్నాయి. దేశంలో వలసదారుల సంఖ్య నానాటికీ పెరగుతుండటంతో.. దీన్ని నియంత్రించేందుకు కొత్త విధానాన్ని తీసుకురావాలని ప్రధాని సునాక్‌ యోచిస్తున్నారు. ఇందుకోసం విదేశీ విద్యార్థుల సంఖ్యను తగ్గించడంతో పాటు ఇతర మార్గాలను అన్వేషిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ‘‘వలస వ్యవస్థను పటిష్టం చేసేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కివీస్‌తో మరో వన్డే ఓడితే.. సిరీస్‌తోపాటు భారత్‌ అగ్రస్థానానికి ఎసరు..!

తొలి వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో టీమ్‌ఇండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. 300కిపైగా పరుగులు సాధించినా కాపాడుకోవడంలో బౌలర్లు విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. అయితే తొలి వన్డేలో పరాజయం పాలైనప్పటికీ ఐసీసీ వరల్డ్‌ కప్‌ సూపర్ లీగ్‌ పాయింట్ల టేబుల్‌లో భారత్‌ స్థానం మాత్రం మారలేదు. అగ్రస్థానంతో కొనసాగుతోంది. అయితే శిఖర్ ధావన్‌ నాయకత్వంలోని భారత్‌ ఆదివారం కివీస్‌తో రెండో వన్డేలో తలపడనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మళ్లీ జైన్‌ జైలు వీడియోల కలకలం..!

ప్రస్తుతం తిహాడ్ జైల్లో ఉన్న ఆప్‌ నేత, దిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తాజా వీడియోలో అప్పటి జైలు సూపరింటెండెంట్‌ అజిత్ కుమార్‌ మంత్రిని కలిసినట్లు కనిపిస్తోంది. జైల్లో జైన్‌కు వీఐపీ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం ఆయనపై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. CPI Narayana: పైకి బాబా వేషం.. లోపల ఆయనో కార్పొరేట్‌ వ్యాపారి!: నారాయణ

బాబా రాందేవ్ వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రంగా మండిపడ్డారు. మహిళల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకించడంతోపాటు బాబా రాందేవ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యాఖ్యలు చేసే సమయంలో మహిళలు అతణ్ని చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పాల్సిందని ఆయన అన్నారు. యోగాను కార్పొరేట్‌ వ్యవస్థగా మార్చి.. పతంజలి పేరుతో వ్యాపారాలు చేస్తున్నారని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని