Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 29 Nov 2022 13:02 IST

1. టెన్త్‌ విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్‌.. వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌!

హైదరాబాద్‌ నగర శివారు హయత్‌నగర్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న బాలికపై ఐదుగురు తోటి విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆగస్ట్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులు అత్యాచారాన్ని వీడియో తీసి తోటి విద్యార్థులకు పంపించారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోను సోషల్‌ మీడియాలో పెడతామని బాలికను బెదిరించారు. అనంతరం 10 రోజుల తర్వాత మరోసారి అత్యాచారానికి పాల్పడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వివేకా హత్య కేసు తెలంగాణకు బదిలీ: సుప్రీం తీర్పు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ అయింది. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. కేసును హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఈ విచారణపై మరణించిన వ్యక్తి కుమార్తె, భార్య అసంతృప్తిగా ఉన్నందున ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకుని కేసును కడప న్యాయస్థానం నుంచి హైదరాబాద్‌ బదిలీ చేస్తున్నట్లు జస్టిస్‌ ఎం.ఆర్‌.షా  పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ట్విటర్‌ Vs యాపిల్‌.. పోరుకు సిద్ధమైన మస్క్‌!

ట్విటర్‌ను మస్క్‌ హస్తగతం చేసుకొని నెల గడిచింది. ఈ 30 రోజుల్లో కంపెనీలో చాలా గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించారు. సామాజిక మాధ్యమంలోని కొన్ని ఫీచర్లలో మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు మస్క్‌ ఏకంగా టెక్‌ దిగ్గజం యాపిల్‌ (Apple)తో పోరుకు సిద్ధమయ్యారు. ఈ విషయంలో మస్క్‌ పెద్ద సాహసమే చేస్తున్నారని నిపుణులు అంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వరల్డ్‌కప్‌ గెలవాలంటే ఇలాంటి ఆటగాడు ఒక్కడు చాలు అనిపించిన రొనాల్డో..!

బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ జట్టు పేరు చెబితే పీలే గుర్తుకొస్తాడు. కానీ.. ఒంటిచేత్తో బ్రెజిల్‌కు ప్రపంచకప్‌ అందించిన రొనాల్డో పేరు మాత్రం వెంటనే స్ఫురణకు రాదు. 2002 ప్రపంచకప్‌ నాటికి.. కాఫు, రివాల్డో, రోనాల్డిన్హో, రొనాల్డో వంటి సూపర్‌స్టార్లతో  బ్రెజిల్‌ జట్టు అత్యంత శక్తిమంతంగా ఉంది. ఈ చుక్కల్లో కూడా రొనాల్డో చంద్రుడిలా వెలిగిపోయాడు. ఈ టోర్నీలో బ్రెజిల్‌ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో మొత్తం 16 గోల్స్‌ కొడితే.. ఒక్క రొనాల్డోనే 8 చేశాడంటేనే అతడి భీకరమైన ఫామ్‌ను అర్థం చేసుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. శ్రద్ధా హత్య కేసు.. డీఎన్‌ఏ నివేదిక ఆలస్యమెందుకో..?

సంచలనం సృష్టించిన కాల్ సెంటర్‌ ఉద్యోగి శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్‌ ఆమిన్‌ పూనావాలను అరెస్టు చేసి రెండు వారాలకు పైనే అయ్యింది. నిందితుడు చెప్పిన వివరాల మేరకు శ్రద్ధావిగా భావిస్తున్న కొన్ని శరీర భాగాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అవి మృతురాలివేనా? అని చెప్పేందుకు మాత్రం ఇంతవరకూ ఎలాంటి ఆధారాల్లేవు. దీన్ని తేల్చేందుకు చేపట్టిన డీఎన్‌ఏ పరీక్షల నివేదిక ఇంతవరకూ రాకపోవడంపై ఫోరెన్సిక్‌ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘కశ్మీర్‌ ఫైల్స్‌’పై ఇఫి జ్యూరీ హెడ్‌ సంచలన వ్యాఖ్యలు.. అనుపమ్ ఖేర్‌ ఆగ్రహం

అంతర్జాతీయ భారతీయ చలనచిత్ర వేడుకల్లో ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రాన్ని ప్రదర్శించడం దుమారానికి దారితీసింది. ఇది ‘అసభ్యకర’ చిత్రమంటూ జ్యూరీ అధినేత, ఇజ్రాయెల్‌ దర్శకుడు నడవ్‌ లాపిడ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో స్పందించిన జ్యూరీ బోర్డు.. అది ఆయన ‘వ్యక్తిగత అభిప్రాయం’ అంటూ వివాదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేసింది. మరోవైపు.. లాపిడ్‌ వ్యాఖ్యలను భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి ఖండిస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి క్షమాపణలు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. డిసెంబరు నెలంతా ‘ఫోన్‌ సిరీస్‌’లదే హంగామా!

మొబైల్‌ కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఏటా ఎన్నో కొత్త మోడల్స్‌ను విడుదల చేస్తుంటాయి. వాటిలో కంపెనీలకు లాభాలు తెచ్చిన మోడల్స్‌ ఉంటాయి, సక్సెస్‌ కానివీ ఉంటాయి. కానీ, దాదాపు అన్ని కంపెనీలూ తమ మార్కెట్‌ పరిధిని విస్తరించుకునేందుకు ప్రతి నెలా కొత్త ఫోన్లను విడుదల చేస్తూనే ఉంటాయి. ఈ ఏడాది పూర్తి కావస్తుండటంతో డిసెంబరులో కంపెనీలు విడుదల చేసే మోడల్స్‌పై యూజర్లు కాస్త ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అక్కడ 100 కంపెనీల్లో 4 రోజులే పనిదినాలు!

యూకేలో దాదాపు 100 కంపెనీలు వారానికి నాలుగు రోజులు పనిదినాలుగా ప్రకటించాయి. శాశ్వతంగా ఇదే పనివిధానాన్ని కొనసాగిస్తామని తెలిపాయి. వేతనాల్లో ఎలాంటి కోత కూడా విధించడం లేదు. ఈ కంపెనీల్లో మొత్తం 2,600 మంది పనిచేస్తున్నారు. ఈ కొత్త విధానం కంపెనీలో సరికొత్త మార్పును తీసుకొస్తుందని యాజమాన్యాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. యూకేలో చాలా మంది నాలుగురోజుల పనివిధానాన్ని సమర్థిస్తున్నారు. ఐదు రోజుల పనిదినాలు పాతకాల ఆర్థిక వ్యవస్థకు చెందిన విధానమని వాదిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. భర్తను కూలీని చేసేసింది.. చాహల్‌ భార్యపై శిఖర్‌ ధావన్‌ సెటైర్లు: వీడియో

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్‌ టీమ్‌ఇండియాకు కీలకం కానున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో భారత్‌ ఓడగా.. రెండో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయ్యింది. ఇక చివరి మ్యాచ్‌లో గెలిచి 1-1తో సిరీస్‌ను సమం చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం జరగనున్న మ్యాచ్‌ కోసం భారత ఆటగాళ్లు తమ భార్యలను వెంటబెట్టుకొని క్రైస్ట్‌చర్చ్‌కు పయనమయ్యారు. ఈ సందర్భంగా కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇంకా ఓటీటీలోకి రాని సినిమాలివే.. మీరు దేనికోసం ఎదురుచూస్తున్నారు?

ఏదైనా సినిమా థియేటర్లలో విడుదలకావడమే ఆలస్యం.. ‘ఓటీటీలోకి ఎప్పుడొస్తుంది?’ అంటూ కొందరు ఆరా తీస్తుంటారు. ఓటీటీలోకి వచ్చిన వెంటనే చూసేస్తారు. కొందరు థియేటర్లలో చూసినా, ఓటీటీలోనూ ఆస్వాదిస్తారు. మీరూ అంతేనా? ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో కొన్ని ఇప్పటికీ రాలేదు. మరి, మీరు దేనికోసం ఎదురుచూస్తున్నారు? ఈ దీపావళి కానుకగా (అక్టోబరు 21న) థియేటర్లలో విడుదలై, సందడి చేసిన చిత్రాల్లో ‘జిన్నా’ ఒకటి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని