Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 04 Dec 2022 13:10 IST

1. కట్టుదిట్టమైన భద్రత మధ్య కొనసాగుతున్న దిల్లీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్

దేశ రాజధాని దిల్లీలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP), భాజపా, కాంగ్రెస్‌ మధ్య త్రిముఖ పోరు నెలకొన్న ఈ ఎన్నికల్లో మొత్తం 1,349 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 250 వార్డుల్లో 1.45 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం దిల్లీ వెలుపల కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆచితూచి ఆడుతున్న రాహుల్‌, అయ్యర్‌.. 17 ఓవర్లకు భారత స్కోరు 80/3

టాప్‌ ఆర్డర్‌ విఫలం కావడంతో ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఆచూతూచి ఆడుతున్నారు. శ్రేయస్‌ అయ్యర్‌ 16, కేఎల్‌ రాహుల్‌ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. 17 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ 3 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సాహో దర్శకుడితో పవన్‌ కొత్త సినిమా.. అధికారికంగా ప్రకటించిన టీం..

పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు అదిరిపోయే న్యూస్‌.  ఆయనతో సినిమా చేస్తున్నట్లు ప్రకటిస్తూ.. డీవీవీ ఎంటర్‌టైనర్స్‌. పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. దీనికి సాహో ఫేమ్‌ సుజిత్‌ దర్శకుడు. ఇక పవన్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసి ‘ఫైర్‌ స్ట్రోమ్‌ ఇజ్‌ కమింగ్‌’ అనే వ్యాఖ్యను జోడించారు. పోస్టర్‌ పై THEY CALL HIM #OG అని రాసి ఉంది. అలాగే జపనీస్‌ భాషలోనూ ఫైర్‌ స్ట్రోమ్‌ ఇజ్‌ కమింగ్‌ అనే పదాన్ని రాశారు. ఇందులో పవన్‌ కూడా కనిపిస్తున్నారు. పోస్టర్ ఆధారంగా ఇది గ్యాంగ్‌స్టర్‌ మూవీ అని అర్థమవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వారిని క్షమించాలా..? మరోసారి మస్క్‌ ట్విటర్‌ పోల్‌..!

అమెరికా చీకటి రహస్యాలను బయటపెట్టిన ప్రజా వేగులు ఎడ్వర్డ్‌ స్నోడెన్‌, వికీ లీక్స్‌ సహ వ్యవస్థాపకుడు జులియన్‌ అసాంజేలకు అమెరికా ప్రభుత్వం  క్షమాభిక్ష పెట్టాలా..? అన్న అంశంపై మస్క్‌ ట్విటర్‌ పోల్‌ నిర్వహించారు. ఈ పోలింగ్‌లో కొన్ని గంటల్లోనే  లక్షల మంది పాల్గొన్నారు. దీనిలో చాలా మంది వారిద్దరిపట్లా సానుకూలంగానే స్పందించారు. ‘నేను నా అభిప్రాయం చెప్పడంలేదు. కానీ, ఈ పోల్‌ నిర్వహిస్తానని వాగ్దానం చేశాను’.. ‘అసాంజే, స్నోడెన్‌లకు క్షమాభిక్ష పెట్టాలా..?’ అని ప్రశ్నిస్తూ మస్క్‌ ట్విటర్‌ పోల్‌ ఏర్పాటు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘విరాట్‌ కోహ్లీ వర్సెస్‌ రోహిత్‌ శర్మ’పై రవిశాస్త్రి ఏమన్నాడంటే..!

 ‘విరాట్‌ కోహ్లీ - రోహిత్‌ శర్మ’ మధ్య పోటీ అంశంపై భారత క్రికెట్‌ అభిమానులు తరచూ రెండుగా విడిపోతుంటారు. టీమ్‌ ఇండియా మాజీ కోచ్‌, వ్యాఖ్యాత రవిశాస్త్రి దీనిపై తనదైన శైలిలో స్పందించాడు. ఇటీవల కెప్టెన్‌గా రోహిత్‌ తొలిసారి ఐసీసీ ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌ జట్టుకు నాయకత్వం వహించాడు. కానీ, భారత్‌ సెమీఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో ఓటిమిపాలైంది. దీంతో టీమ్‌ ఇండియా వ్యూహాల్లో మార్పులు చేయాలంటూ డిమాండ్లు మొదలయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పెళ్లి పీటలెక్కనున్న ‘బాహుబలి’ సింగర్‌.. ఫొటోలు వైరల్‌

‘బాహుబలి’లోని ‘మమతల తల్లి’ పాటతో గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న సత్య యామిని (Satya Yamini) త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. వరుస సినిమాల్లో పాటలు పాడుతూ కెరీర్‌లో రాణిస్తోన్న ఆమె సోషల్‌మీడియా వేదికగా తనకు కాబోయే భర్తను పరిచయం చేస్తూ తాజాగా ఓ పోస్ట్‌ పెట్టింది. ‘జీవితకాలానికి సంబంధించిన రోలర్‌ కోస్టర్‌ వేచి ఉంది’ అని రాసుకొచ్చింది. ఈ ఫొటో చూసిన గీతామాధురి, అనుదీప్‌, మనీషా, పూజాతోపాటు పలువురు సింగర్స్‌ ఈ జంటకు శుభాకాంక్షలు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. తెలుగు భాష, సాహిత్యం.. దేశ ప్రజలందరికీ సుపరిచితం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నో ప్రతిష్ఠలకు నెలవు అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. తెలుగు భాష, సాహిత్యం దేశ ప్రజలందరికీ సుపరితం.. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని కొనియాడారు. ఏపీ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతికి పోరంకిలో రాష్ట్ర ప్రభుత్వం పౌర సన్మానం చేసింది. రాష్ట్రపతిని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం జగన్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా సత్కరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. హన్సిక పెళ్లిలో ప్రత్యేక అతిథులు వీరే.. వాళ్లెవరూ సెలబ్రిటీలు కాదు

‘దేశముదురు’తో వైశాలిగా తెలుగువారిని అలరించిన ముద్దుగుమ్మ హన్సిక (Hansika) వివాహం నేడు. తన ప్రియుడు సోహైల్‌తో ఆమె మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జైపుర్‌లోని ఓ రాజకోటలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. కుటుంబసభ్యుల సమక్షంలో జరగనున్న ఈ వేడుకలో పాల్గొనేందుకు కొంతమంది అతిథులకు ఆహ్వానాలు అందాయి. అయితే వాళ్లు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన సెలబ్రిటీలు మాత్రం కాదు.. నిరుపేద చిన్నారులు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రేపే అఖిలపక్ష సమావేశం.. 40 పార్టీలకు కేంద్రం ఆహ్వానం

వచ్చే ఏడాది సెప్టెంబరులో భారత్‌ ఆతిథ్యం ఇవ్వనున్న జి-20 సదస్సుకు సంబంధించి సూచనలు, సలహాలు, చర్చలు, వ్యూహాలను ఖరారు చేసేందుకు కేంద్రం సోమవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే ఈ సమావేశానికి దాదాపు 40 పార్టీల అధ్యక్షులను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అంకితా భండారీ హత్య కేసులో నిందితులకు నార్కోపరీక్షలు..!

ఉత్తరాఖండ్‌లోని ఓ రిసార్టు రిసెప్షనిస్టు అంకితా భండారీ హత్యకేసులో నిందితులకు నార్కో పరీక్షలకు రంగం సిద్ధమవుతోంది.  ఈ కేసులో రిసార్టు యజమాని పులకిత్‌ ఆర్యాతోపాటు సౌరభ్‌ భాస్కర్‌, అంకిత్‌ గుప్తాపై ప్రధాన అభియోగాలు నమోదయ్యాయి. వీరికి నార్కో అనాలసిస్‌ పరీక్షలు నిర్వహించాలని ఇప్పటికే దర్యాప్తు బృందం కోర్టులో దరఖాస్తు చేసింది. కోర్టు నుంచి అనుమతి వచ్చిన వెంటనే పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని