Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top Ten News At 1 PM: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 06 Dec 2022 13:08 IST

1. వాషింగ్ మెషిన్ వృథా నీటిపై వివాదం.. ఘర్షణలో మహిళ మృతి

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి(Kadiri)లో దారుణం చోటుచేసుకుంది. వాషింగ్‌ మెషిన్‌ (Washing machine) నుంచి వెళుతున్న వృథా నీటి విషయంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ మహిళ తీవ్రంగా గాయపడి మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. కదిరి పట్టణంలోని మశానంపేటలో పద్మావతి అనే మహిళ నివాసముంటున్నారు. ఆమె ఇంట్లోని వాషింగ్‌ మెషిన్‌ నుంచి వచ్చే వృథా నీరు పక్కనే ఉన్న వేమన్న నాయక్‌ ఇంటి ముందుకు వెళ్లింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అన్నారు.. ఆసక్తి రేపారు.. అటకెక్కించ లేదు కదా!

సినీ పరిశ్రమలో కొన్ని కాంబినేషన్స్‌ భలే ఆసక్తిగా అనిపిస్తాయి.  అగ్ర కథానాయకుల సినిమాలైతే వాటికి వచ్చే క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అనుకున్నవన్నీ జరగవు.. అనుకోలేదని ఆగవు.. కొన్ని రోజుల కిందట చేసిన ప్రకటనలతో ఎంతో ఆసక్తి రేపిన క్రేజీ ప్రాజెక్టుల గురించి ఇప్పుడు ఆ మాటే వినిపించడం లేదు. అసలు ఎప్పుడు మొదలవుతాయో కూడా తెలియదు. ‘అటకెక్కించలేదు కదా’ అంటూ అభిమానుల్లో అనుమానం పెరుగుతోంది. మరి ఆ సినిమాలేంటో చూసేయండి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రంజీ ట్రోఫీలో ‘మిస్టర్‌ 360’.. ముంబయి తరఫున బరిలోకి..!

టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో ఆడనున్నట్టు తెలుస్తోంది. ముంబయి జట్టు తరఫున ఈ మిస్టర్‌ 360 బరిలోకి దిగే అవకాశాలున్నట్టుగా ఓ ఆంగ్ల క్రీడా ఛానెల్‌ పేర్కొంది. హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌ మధ్య ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌ డిసెంబర్‌ 13న ప్రారంభం కానుంది. భారత సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ అజింక్యా రహానె జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్నసూర్య పేరును ముంబయి జట్టులో ప్రకటించలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. విజయవాడ-మంగళగిరి మధ్య భారీగా ట్రాఫిక్‌జామ్‌

విజయవాడ-మంగళగిరి మధ్య భారీగా ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. కడప పర్యటనకు వెళ్లేందుకు తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు సీఎం జగన్‌ బయల్దేరడంతో వాహనాలను పోలీసులు నిలిపివేశారు. సీఎం కాన్వాయ్‌ వెళ్లే మార్గం కాకపోయినా వాహనాలను నిలిపేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయాలకు వెళ్లే సమయం కావడంతో పోలీసుల తీరుపై సామాన్యులు మండిపడ్డారు. పోలీసుల ఆంక్షలతో మంగళగిరిలోని తెదేపా కార్యాలయం వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వైస్‌ ఎంపీపీ దారుణ హత్య.. కత్తితో నరికి చంపిన దుండగులు

శ్రీకాకుళం జిల్లా గార మండల వైస్‌ ఎంపీపీ, వైకాపా నేత రామశేషు దారుణ హత్యకు గురయ్యారు. శ్రీకూర్మంలోని తన గ్యాస్‌ గొడౌన్‌ వద్దకు వాకింగ్‌కు వెళ్తున్న సమయంలో దుండగులు ఆయన్ను హతమార్చారు. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు పల్సర్‌ బైక్‌పై వచ్చి కత్తితో మెడపై దాడి చేసి హతమార్చినట్లు తెలుస్తోంది. రామశేషు ఘటనాస్థలంలోనే మృతి చెందారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆయన మృతదేహాన్ని చూసి బంధువులు రోధించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. క్రిమియా వంతెనను సందర్శించిన పుతిన్‌..!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇటీవల బాంబుదాడిలో దెబ్బతిన్న క్రిమియా వంతెన( Crimean bridge)ను సందర్శించారు.  ఈ వీడియోలో పుతిన్‌ (Putin) స్వయంగా మెర్సిడెస్‌ బెంజ్‌ కారును డ్రైవ్‌ చేస్తూ క్రిమియా వంతెనపై ప్రయాణించారు. ఈ దృశ్యాలను రష్యా(Russia)లో ఓ టెలివిజన్‌ ఛానెల్‌ ప్రసారం చేసింది. ఈ సమయంలో పుతిన్‌ పక్కన డిప్యూటీ ప్రధాని మారాట్‌ ఖుసులిన్‌ ఉన్నారు. ఈ సందర్భంగా వంతెనపై దాడి గురించి వారు చర్చించుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అభిమాని కాళ్లుపట్టుకున్న స్టార్‌ హీరో.. వైరల్‌ అవుతున్న వీడియో..

టాలీవుడ్‌లో హాసినిగా అందరి మనసులు దోచేసింది జెనీలియా(Genelia). ఈ అమ్మడికి ఉన్న ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. తాజాగా ఈ క్యూట్‌ హీరోయిన్‌ తన భర్త రితేష్‌ దేశ్‌ముఖ్‌(Riteish Deshmukh)తో కలిసి నటించిన సినిమా ‘వేద్‌’(Ved). తెలుగులో విడుదలై సూపర్‌ హిట్‌ అయిన ‘మజిలీ’(Majili)కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో రితేష్‌ చేసిన పని ప్రస్తుతం వైరల్‌గా మారింది. సోషల్‌మీడియా వేదికగా ఈ స్టార్‌ హీరోకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. చావనైనా చస్తాం.. కానీ, ఈ ప్రభుత్వాన్ని వీడేది లేదు: పోచారం

చావనైనా చస్తాం.. కానీ, తెరాస ప్రభుత్వాన్ని వీడేది లేదని తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అంబేడ్కర్‌ వర్థంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలదోయాలనుకోవడం రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధం అన్నారు. అందుకోసం ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి యత్నించడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సాంకేతికలోపంతో స్పైస్‌జెట్‌ విమానం వెనక్కి.. ప్రయాణికుల ఆందోళన

హైదరాబాద్‌ నుంచి నాసిక్‌ బయల్దేరిన స్పైస్‌జెట్‌ విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో విమానాన్ని తిరిగి శంషాబాద్‌ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. 3 గంటలకు పైగా సమయం దాటినా మరో విమానం ఏర్పాటు చేయకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై విమానాశ్రయంలో ఆందోళనకు దిగారు. హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి స్పైస్‌ జెట్‌ విమానం ఉదయం 6.20 గంటలకు బయల్దేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వైకాపా నేత దేవినేని అవినాష్‌ ఇంట్లో ఐటీ సోదాలు

నగరంలో ఐటీ సోదాల కలకలం రేగింది. విజయవాడలో వైకాపా నేత దేవినేని అవినాష్‌ ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గుణదలలోని ఆయన నివాసంలో ఉదయం 6.30గంటల నుంచి సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఓ భూమి వ్యవహారంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.  మరోవైపు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని స్థిరాస్తి వ్యాపారి ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని