Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 07 Dec 2022 13:06 IST

1. Tammineni: వార్‌ జోన్‌లో అడుగుపెట్టాం.. కురుక్షేత్రానికి మేం సిద్ధమే: స్పీకర్‌ తమ్మినేని

రాష్ట్రంలోని బీసీ కులాల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఛైర్మన్లను నియమిస్తే తెదేపా నేతలు హేళన చేస్తున్నారని ఏపీ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ అన్నారు. బీసీల ఓట్ల కోసం ఆ పార్టీ నేతలు ముసుగులు వేస్తూ వస్తున్నారని ఆక్షేపించారు. విజయవాడ లోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో వైకాపా ఆధ్వర్యంలో ‘జయహో బీసీ మహాసభ’ నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Twitter files: సెగలు పుట్టిస్తున్న ట్విటర్‌ ఫైల్స్‌.. మరో కీలక ఉద్యోగిపై మస్క్‌ వేటు

2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌కు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించిన ట్విటర్‌(Twitter) సీనియర్‌ ఉద్యోగిపై ఎలాన్‌ మస్క్‌(Elon Musk) వేటు వేశారు. జోబైడెన్‌ (joe biden ) తనయుడు హంటర్‌ బైడెన్‌ లీలలపై న్యూయార్క్‌ పోస్టు ప్రచురించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో ప్రచారం కాకుండా ట్విటర్‌(Twitter) నిలిపేసింది. దీనికి సంబంధించి కంపెనీ వెబ్‌సైట్‌ డిప్యూటీ జనరల్‌ కౌన్సిల్‌ జేమ్స్‌ బేకర్‌పై ఎలాన్‌ మస్క్‌(Elon Musk) తాజాగా వేటు వేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Modi: కొత్త ఎంపీల బాధను అర్థం చేసుకోండి: రాజకీయ పార్టీలకు మోదీ పిలుపు

పార్లమెంట్ (Parliament) శీతాకాల సమావేశాలు (Winter Session) మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా పార్లమెంట్‌కు విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Modi).. మీడియాతో మాట్లాడారు. జీ20కి భారత్‌ అధ్యక్షత వహించిన వేళ.. ఈ సమావేశాలు జరుగుతుండటం ప్రాధాన్యమని అన్నారు. చర్చలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రధాని ప్రతిపక్షాలను కోరారు. కొత్త ఎంపీలకు సభలో అవకాశాలు కల్పించాలని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. RBI: రెపోరేటు మరో 35 బేసిస్‌ పాయింట్ల పెంపు

వాణిజ్య వర్గాలు, విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఈసారి వడ్డీ రేట్లను 35 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది. దీంతో రెపోరేటు 6.25 శాతానికి చేరింది. సోమవారం ప్రారంభమైన ద్రవ్య పరపతి కమిటీ (MPC) సమావేశ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ నేడు ప్రకటించారు. తాజా పెంపుతో అన్ని రకాల రుణాలు మరింత భారం కానున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఒత్తిడి తరుముతోంది.. స్మార్ట్‌ హుషార్‌!

ఒత్తిడి.. ఒత్తిడి.. ఒత్తిడి! వయసుతో నిమిత్తం లేకుండా ఇప్పుడు అందరూ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. ఉద్యోగం, పని, ఆర్థిక పరమైన అంశాల మూలంగా మనదేశంలో 89% మంది మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నారని ఆ మధ్య సిగ్నల్‌ టీటీకే హెల్త్‌ కేర్‌ ఇన్సూరెన్స్‌ నిర్వహించిన అధ్యయనం పేర్కొంటోంది. ఒత్తిడిని ఎదుర్కొంటున్నవారి ప్రపంచ సగటు (86%) కన్నా ఇది ఎక్కువ. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Iran: ఇరాన్‌లో 1,200 మంది విద్యార్థులపై విషప్రయోగం..!

విద్యార్థులు ఆందోళన చేస్తామని ప్రకటించిన తేదీకి ఒక రోజు ముందు ఇరాన్‌ (Iran)ప్రభుత్వం వారిపై విషప్రయోగం చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నిన్న ఆహారం తిన్న తర్వాత దాదాపు 1,200 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిపై విషప్రయోగం జరిగిందని ది నేషనల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ తీవ్ర ఆరోపణలు చేసింది. విద్యార్థులు వాంతులు, తీవ్రమైన నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Delhi MCD Elections: దిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో.. ట్రాన్స్‌జెండర్‌ విజయం

దేశ రాజధాని దిల్లీ (Delhi)లోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ (MCD Elections)లో తొలిసారి ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి విజయం సాధించారు. బుధవారం వెలువడుతున్న మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాల్లో సుల్తాన్‌పురి-ఎ వార్డు నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ(AAP) అభ్యర్థి, ట్రాన్స్‌జెండర్‌(Transgender) బాబీ కిన్నార్‌ గెలిచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Wasim akram: ఏమో.. నిజంగానే అతడు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడి ఉండొచ్చు: వసీం అక్రమ్‌

పాకిస్థాన్‌(Pakistan) మాజీ కెప్టెన్‌ సలీం మాలిక్‌ తననో పనివాడిలా చూసేవాడంటూ వసీం అక్రమ్‌(Wasim Akram) సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తన జీవిత చరిత్ర ‘సుల్తాన్‌.. ఎ మెమోయర్‌’ అనే పుస్తకంలో మరో మాజీ కెప్టెన్‌ రషీద్‌ లతీఫ్‌పైనా ఈ మాజీ కెప్టెన్‌ విమర్శలు గుప్పించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Video: ‘ఆదిత్య 369’ తరహాలో వింత శకటం.. ఎక్కడి నుంచి వచ్చిపడిందో..!

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో ఓ వింత శకటం ప్రత్యక్షమైంది. ‘ఆదిత్య 369’ సినిమాలో మాదిరిగా ఉన్న గుండ్రని భారీ శకటాన్ని స్థానికులు ఆసక్తికరంగా తిలకిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చిపడిందోనని కొందరు భయాందోళనలకు గురవుతున్నారు. దీని గురించి అధికారులకు సమాచారం అందించారు. వీడియో కోసం క్లిక్‌ చేయండి

10. MLAs Bribery case: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. హైకోర్టులో సిట్‌ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌

ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఏసీబీ ప్రత్యేక కోర్టు మెమో తిరస్కరించడంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, డా.జగ్గుస్వామి, తుషార్‌ వెల్లాపల్లి, బూసారపు శ్రీనివాస్‌లను నిందితులుగా చేరుస్తూ దాఖలు చేసిన మెమోను మంగళవారం ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సిట్ ఉన్నత న్యాయస్థానంలో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు