Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 08 Dec 2022 14:44 IST

1. భారత్‌ షెడ్యూల్‌: SL, NZ, AUS సిరీస్‌ల వివరాలు!

ముంబయి: ముంబయి: భారత జట్టు కొత్త ఏడాదిలో ఆడనున్న మూడు సిరీస్‌ల షెడ్యూల్‌ విడుదలైంది. స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా జట్లతో భారత్‌ తలపడనుంది. కివీస్‌ తొలి వన్డే హైదరాబాద్‌లోను, ఆసీస్‌ సెకండ్‌ వన్డే వైజాగ్‌లో ఉంటుంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. Gujarat - Himachal Pradesh: హిమాచల్‌లో ఉత్కంఠ రేపుతున్న ఫలితాలు

గుజరాత్‌ (Gujarat), హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh) అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Assembly Election Results) ప్రక్రియ కొనసాగుతోంది. గుజరాత్‌ భాజపా అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, హిమాచల్‌ ప్రదేశ్‌లో భాజపా - కాంగ్రెస్‌ల మధ్య నువ్వా-నేనా అన్నట్లు పోటీ ఉంది. లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి

3. Satyadev: ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్‌ ఉన్నారు.. టికెట్లు ఇప్పించాలని నెటిజన్‌ ట్వీట్‌.. సత్యదేవ్‌ కౌంటర్‌

‘గాడ్‌ఫాదర్‌’ (Godfather), ‘రామ్‌సేతు’ (Ramsetu)లో కీలకపాత్రలు పోషించి సినీ ప్రముఖులు, అభిమానుల ప్రశంసలు అందుకున్నారు నటుడు సత్యదేవ్‌. ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’ (Gurthunda Seethakalam) ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఆయన.. తాజాగా నెటిజన్లతో ట్విటర్‌ చాట్‌లో పాల్గొన్నారు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. By Election Results: మైన్‌పురిలో డింపుల్‌కు ఆధిక్యం.. ఉపఎన్నికల ఫలితాలు ఇలా..

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని మైన్‌పురి (Mainpuri) లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక(By poll results) ఫలితాలు గురువారం వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి డింపుల్‌ యాదవ్‌ (Dimple Yadav) భారీ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం.. తన సమీప భాజపా అభ్యర్థిపై  డింపుల్‌ దాదాపు 55వేల ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Virender sehwag: క్రిప్టో కరెన్సీ కన్నా వేగంగా టీమ్ ఇండియా ఫామ్‌ను కోల్పోతోంది: వీరేంద్ర సెహ్వాగ్‌

బంగ్లా(Bangladesh)తో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 0-2తో టీమ్‌ఇండియా(Team india) సిరీస్‌(Ind vs Ban 2022)ను కోల్పోయిన విషయం తెలిసిందే. బంగ్లా టెయిలెండర్‌ మెహదీ హసన్‌ మిరాజ్‌ చిరస్మరణీయ శతకం, పేలవమైన బ్యాటింగ్‌ కలగలిసి ఈ మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో టీమ్‌ఇండియాకు ఓటమిని మిగిల్చాయి. ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌(Virender sehwag) జట్టు ఫామ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Himachal Pradesh: హిమాచల్‌లో హోరాహోరీ.. ఎమ్మెల్యేల తరలింపు యోచనలో కాంగ్రెస్‌..!

హిమాచల్‌ ప్రదేశ్‌(Himachal Pradesh) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) ఓట్ల లెక్కింపు గురువారం కొనసాగుతోంది. ఈ ఫలితాల్లో భాజపా (BJP), కాంగ్రెస్‌(Congress) మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. కాంగ్రెస్‌ 34, భాజపా 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్న హస్తం పార్టీ వ్యూహాలు మొదలుపెట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. pan-India actor: ట్రోలింగ్‌ గురైన స్టార్‌ హీరో.. కారణమేంటంటే..!

సినిమాలో తన ఫస్ట్‌లుక్‌ కారణంగా ట్రోలింగ్‌కు గురయ్యాడు ఓ స్టార్‌ హీరో. నెటిజన్లు లాజిక్‌లతో తనని ప్రశ్నించారు. ఏకంగా ఆయన ఇన్‌స్టా పేజిలోనే కామెంట్స్‌ చేశారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar) ప్రధాన పాత్రలో మరాఠీ చిత్రం ‘వేదత్‌ మరాఠే వీర్‌ దౌడ్లే సాత్‌’ (Vedat Marathe Veer Daudale Sat) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Supreme Court: సుప్రీంకోర్టు మొబైల్ యాప్ 2.0 ప్రారంభం

సుప్రీంకోర్టు మొబైల్ యాప్ 2.0ను ప్రారంభించినట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. న్యాయాధికారులు, వివిధ కేంద్రమంత్రిత్వ శాఖలకు చెందిన నోడల్ ఆఫీసర్లు తమ కేసులను ట్రాక్ చేసుకునేందుకు ఈ అప్‌డేట్‌ వెర్షన్ వీలు కల్పిస్తుందని చెప్పారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసులు, స్టేటస్ ఆర్డర్లు, తీర్పులు, ఇతర పత్రాలను యాప్‌లోకి వెళ్లి పరిశీలించవచ్చని సీజేఐ తెలిపారు. పూర్తి వీడియో కోసం క్లిక్‌ చేయండి 

9. Putin: అణు యుద్ధం ముప్పు పెరుగుతోంది..: పుతిన్‌ హెచ్చరిక

అణు యుద్ధం ముప్పు రోజురోజుకూ పెరుగుతోందని రష్యా(russia) అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌(Vladimir Putin) హెచ్చరించారు. అయితే రష్యా (russia) ఉన్మాదంగా ప్రవర్తించబోదని ఆయన పేర్కొన్నారు. మొదట తామే అణ్వస్త్రాలు వినియోగించబోమని తెలిపారు. రష్యాలోని మానవహక్కుల మండలి వార్షిక సమావేశంలో వీడియో లింక్‌ ద్వారా ప్రసంగిస్తూ పుతిన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Loans: ఐటీఆర్‌ లేకుండా లోన్‌ పొందాలంటే..

మీరు లోన్ (Loan) కోసం దరఖాస్తు చేసినప్పుడు రుణదాత మీ దరఖాస్తును నిశితంగా పరిశీలించి కొన్ని పత్రాలను కోరతారు. వాటిలో ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) ముఖ్యమైనది. ముఖ్యంగా పెద్ద రుణాలకు ఇది తప్పనిసరి. వేతన జీవులకు ITR ఉంటుంది. కానీ, స్వయం ఉపాధిలో ఉన్నవారు.. వార్షిక ఆదాయ పన్ను పరిమితి కంటే తక్కువ ఉన్నప్పుడు ఐటీఆర్ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఐటీఆర్‌ లేకుండానే లోన్‌ ఎలా పొందాలో చూద్దాం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని