Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 09 Dec 2022 13:05 IST

1. CM KCR: న్యూయార్క్‌, పారిస్‌, లండన్‌లో కరెంట్‌ పోవచ్చు కానీ.. హైదరాబాద్‌లో పోదు: కేసీఆర్‌

చరిత్రలో సుప్రసిద్ధ నగరం హైదరాబాద్‌ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైలు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషకరమని చెప్పారు. హైదరాబాద్‌ మైండ్‌స్పేస్‌ వద్ద ఎయిర్‌పోర్టు మెట్రోకు శంకుస్థాపన చేసిన అనంతరం అప్పా కూడలిలోని పోలీసు అకాడమీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్‌ మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Cyclone Mandous: తీవ్ర తుపానుగా మాండౌస్‌.. ఏపీ, తమిళనాడుకు భారీ వర్ష సూచన

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండౌస్‌ (Cyclone Mandous) తీవ్ర తుపానుగా మారింది. ఇది తీరం దిశగా వేగంగా దూసుకొస్తోంది. ఈ అర్ధరాత్రి లేదా శనివారం తెల్లవారుజామున ఈ తుపాను ఉత్తర తమిళనాడు (Tamil Nadu), దక్షిణ కోస్తాంధ్ర(Andhra Pradesh) మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు వెల్లడించారు. దీంతో ఏపీలోని రాయలసీమ, తమిళనాడులోని చెన్నై (Chennai) సహా పలు ప్రాంతాలకు భారీ వర్ష (Heavy Rains) హెచ్చరికలు జారీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Hyderabad: పురుగులన్నం.. టీచర్‌ తీరుపై ఠాణా మెట్లెక్కిన చిన్నారి

3. Pawan Kalyan: ఇక శ్వాస తీసుకోవడమూ ఆపేయమంటారా?: పేర్ని నానికి పవన్ కౌంటర్

ఏపీలో ఎన్నికల ప్రచారం కోసం జనసేన(Janasena) అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) ‘వారాహి’ (Varahi) వాహనాన్ని సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వాహనానికి నిషేధిత రంగు వేశారంటూ వైకాపా(YSRCP)కు చెందిన మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) చేసిన విమర్శలపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పరోక్షంగా కౌంటర్‌ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Gunshots: పాక్‌లో ఇంగ్లాండ్‌ టీమ్‌ బస చేసిన హోటల్‌కు సమీపంలో కాల్పులు..!

పాక్‌-ఇంగ్లాండ్‌(PAK Vs ENG) మధ్య శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు నేపథ్యంలో ఓ ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లాండ్‌(England Cricket Team) టీమ్‌ బస చేసిన హోటల్‌కు సమీపంలో కాల్పులు(gunshots) చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ముల్తాన్‌(Multan)లో ఇంగ్లాండ్‌ జట్టు బస చేసిన హోటల్‌కు సమీపంలో గురువారం కాల్పుల శబ్దం వినిపించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Loan: లోన్ పొందే అర్హతపై వయసు ప్రభావం ఎలా ఉంటుందంటే..

సొంత డబ్బుతో ఆర్థిక అవసరాలు, లక్ష్యాలు నెరవేర్చుకోలేని వ్యక్తులకు బ్యాంకు రుణాలు (Loan) సాయంగా నిలుస్తాయి. తమ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు వివిధ రకాల రుణ సదుపాయాలను రూపొందిస్తుంటాయి. అయితే, వాటిని పొందడానికి బ్యాంకులు కొన్ని అర్హతలను నిర్దేశిస్తాయి. అందులో వయసు చాలా ప్రధానమైంది. మరి వయసు రుణ అర్హతను ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకుందాం... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Video: సజ్జల వ్యాఖ్యలపై మండిపడ్డ తెలంగాణ నాయకులు

6. Russia vs US: అమెరికా జైలు నుంచి బయటకొచ్చిన ‘మృత్యు వ్యాపారి’..!

అతడో ఆయుధ వ్యాపారి.. ప్రపంచంలోని ఉగ్ర, వేర్పాటువాద సంస్థలకు ఆయుధాలు విక్రయిస్తుంటాడు. అతడికి రష్యా (Russia) పూర్తి మద్దతు ఉంది. అతడి వద్ద భారీ సంఖ్యలో సొంత రవాణా విమానాలు ఉన్నాయి. వాటిల్లోనే ప్రపంచం నలు మూలలకు ఆయుధాలను చేరవేస్తాడు. అతడి అక్రమ ఆయుధ వ్యాపారంపై ఏకంగా ‘ఘోస్ట్‌రైడర్‌’ చిత్ర హీరో నికోలస్‌ కేజ్‌తో ‘లార్డ్‌ ఆఫ్‌ వార్‌’ చిత్రాన్ని నిర్మించారంటే అర్థం చేసుకోవచ్చు. అతడి పేరు విక్టర్‌ బౌట్‌(Viktor Bout)..! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Nadendla: ప్రజల్ని అయోమయంలోకి నెట్టేలా మాట్లాడుతున్నారు: నాదెండ్ల మనోహర్‌

రాష్ట్ర విభజనపై వ్యాఖ్యలు చేసిన వైకాపా నేతలు క్షమాపణ చెప్పాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ డిమాండ్ చేశారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టి అయోమయస్థితిలోకి నెట్టేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. లాక్‌డౌన్‌లో ఓ అమ్మాయి చేసిన పని ఇంటిల్లిపాదికి ప్రమాదమైతే.. భయపెడుతున్న ‘కనెక్ట్‌’

అందమైన నగరం.. అందులో ఓ చిన్న కుటుంబం.. ఎలాంటి చింతలు లేకుండా సంతోషంగా సాగుతోన్న వారి జీవితాలు లాక్‌డౌన్‌ కారణంగా ఛిద్రమయ్యాయి. వైద్యుడైన తండ్రి కరోనా విధుల్లో భాగంగా ఆస్పత్రికే పరిమితం కావడం, తల్లి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో బిజీగా ఉండటంతో ఆ ఇంటి అమ్మాయి స్పిరిట్‌ గేమ్‌ ఆడి ఇంటిల్లిపాదిని ప్రమాదంలోకి నెట్టేసింది. ఇంతకీ ఆ అమ్మాయి స్పిరిట్‌ గేమ్‌ ఎందుకు ఆడింది? ఆ అమ్మాయి ఒంట్లోకి ప్రవేశించిన ఆత్మను బయటకు పంపించేందుకు ఇంట్లోవాళ్లు ఏం చేశారు? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Connect Trailer: ఓ అమ్మాయి చేసిన పని ఇంటిల్లిపాదికి ప్రమాదమైతే..

9. USA: భారత్‌ ఓ మహా శక్తిగా అవతరించనుంది: అమెరికా

అమెరికా(USA) మిత్రదేశంగానే భారత్‌(India) ఉండబోదని.. భవిష్యత్తులో మహాశక్తిగా అవతరించనుందని శ్వేతసౌధం ఆసియా సమన్వయకర్త కర్ట్‌ క్యాంప్‌బెల్‌ వ్యాఖ్యానించారు. గత 20 ఏళ్లలో అమెరికా(USA)-భారత్‌(India) సంబంధాలు బలపడిన స్థాయిలో మరే దేశంతో ద్వైపాక్షిక బంధం మెరుగుపడలేదని ఆయన అన్నారు. తన దృష్టిలో 21వ శతాబ్దంలో అమెరికా(USA)కు అత్యంత ముఖ్యమైన ద్వైపాక్షిక బంధం భారత్‌(India)తోనే ఉందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. క్యాన్సర్‌ను జయించిన ప్రముఖ నటి.. ఇది పునర్జన్మ అంటూ పోస్ట్‌...

అనుమానాస్పదం సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది హంసా నందిని(Hamsa Nandini). ఆ తర్వాత పలు సినిమాల్లో ప్రత్యేక పాత్రలతో అలరించింది. స్పెషల్‌ సాంగ్స్‌తోనూ ఆకట్టుకుంది. అయితే.. గత డిసెంబర్‌లో తాను క్యాన్సర్‌(cancer) బారిన పడినట్లు చెప్పి అందరినీ షాక్‌కు గురిచేసింది. తాజాగా మహమ్మారిని జయించానని చెప్పిన ఈ ముద్దుగుమ్మ తన అభిమానులకు శుభవార్త చెప్పింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని