Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
Top Ten News At 1 PM: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. రివ్యూ: అవతార్ - ది వే ఆఫ్ వాటర్
తొలి భాగం పండోరా గ్రహంలోని సుందరమైన అటవీ, జీవరాశుల ప్రపంచం చుట్టూనే సాగుతుంది. ఈసారి కథని ‘ది వే ఆఫ్ వాటర్’ అంటూ నీటి ప్రపంచంలోకి తీసుకెళ్లాడు జేమ్స్ కామెరాన్. మనం పుట్టకముందు, మనం పోయాక సముద్రమే మన నివాసం అంటూ తాత్వికతని జోడిస్తూ దర్శకుడు కామెరాన్ మరో దృశ్యకావ్యాన్ని తెరపై ఆవిష్కరించారు. జేక్ అతడి కుటుంబం మెట్కయినా ప్రాంతానికి వెళ్లేంతవరకు తొలి సినిమానే గుర్తుకొచ్చినా.. అక్కడికి చేరుకున్నాక మాత్రం పూర్తిగా ప్రేక్షకుల్ని ఆ ప్రపంచంలో లీనం చేస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. క్రెడిట్ నివేదికను తరచూ చెక్ చేసుకోవాలి.. ఎందుకంటే?
క్రెడిట్ స్కోరు (Credit Score), నివేదిక ప్రాముఖ్యతపై ఇటీవల భారతీయుల్లో అవగాహన పెరిగింది. 2021 అక్టోబరు నుంచి 2022 సెప్టెంబరు మధ్య కొత్తగా 2.38 కోట్ల మంది తమ వద్ద రిజిస్టర్ చేసుకున్నట్లు ట్రాన్స్‌యూనియన్ సిబిల్ ఇటీవల తెలిపింది. క్రితం ఏడాది వ్యవధితో పోలిస్తే ఇది 83 శాతం అధికం. అంటే వీరంతా తమ క్రెడిట్ స్కోరు (Credit Score), నివేదిక (Credit Report)ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడానికి సిద్ధమయ్యారని అర్థం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. కేఎల్ రాహుల్ ఔట్.. శుబ్‌మన్ హాఫ్ సెంచరీ.. భారత్ స్కోరు 83/1 (26)
టీమ్‌ఇండియా ఓపెనర్, కెప్టెన్ కేఎల్ రాహుల్ (23) మరోసారి నిరాశపరిచాడు. క్రీజ్‌లో కుదురుకొని ఆడుతున్న సమయంలో బంగ్లా బౌలర్ ఖలిద్ వేసిన షార్ట్ పిచ్ బంతికి (22.4వ ఓవర్) పెవిలియన్‌కు చేరాడు. భారీ షాట్‌కు యత్నించిన రాహుల్ బౌండరీ లైన్ వద్ద తైజుల్ ఇస్లామ్ చేతికి చిక్కాడు. దీంతో శుబ్‌మన్ గిల్ (55*)తో తొలి వికెట్‌కు జోడించిన 70 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మరోవైపు గిల్ అర్ధశతకం పూర్తి చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. దమ్మాయిగూడలో బాలిక అదృశ్యం ఘటన విషాదాంతం
మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ పరిధిలో బాలిక అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లి కనిపించకుండా పోయిన పదేళ్ల బాలిక ఇందు.. శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. దమ్మాయిగూడలోని అంబేడ్కర్ నగర్ చెరువులో బాలిక మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. బాలికను ఎవరైనా కిడ్నాప్ చేసి హతమార్చారా? ప్రమాదవశాత్తు బాలిక చెరువులో పడి మృతిచెందిందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. పెరట్లో పామును పెంచి.. పక్కవారినే కాటేయాలంటే ఎలా..?
అంతర్జాతీయ వేదికగా దాయాది పాకిస్థాన్ (Pakistan) ఆగడాలను భారత్ మరోసారి ఎండగట్టింది. ఉగ్రవాదం ముప్పు ఎక్కడి నుంచి మొదలైందో ఈ ప్రపంచం మర్చిపోలేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ (S Jaishankar) అన్నారు. ఇకనైనా ఆ దేశం తమ చేష్టలను మార్చుకుని, పొరుగు దేశాల పట్ల స్నేహంగా ఉండాలని హితవు పలికారు. ఈ సందర్భంగా అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ ఓసారి పాకిస్థాన్‌పై చేసిన ‘పాము’ వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. దాయాదిపై నిప్పులు చెరిగారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. అధిక బరువుతో పంత్.. ఇంకా ఫిట్‌గా ఉంటే అద్భుత షాట్లు కొట్టగలడు: మాజీ కెప్టెన్
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ (46) దూకుడుగా ఆడే క్రమంలో క్లీన్‌బౌల్డ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రిషభ్ పంత్ ఆటపై ప్రశంసలు కురిపించిన పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్.. పలు కీలక సూచనలు చేశాడు. అలాగే పంత్ అధిక బరువుతో ఉన్నాడని పేర్కొన్నాడు. అతడు ఇంకా మంచి ఫిట్‌గా ఉంటే టెస్టుల్లో వినూత్న షాట్లను అలవోకగా కొట్టగలడని తెలిపాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. సురేఖ అత్తమ్మను మిస్ అవుతున్నా: ఉపాసన
రామ్‌చరణ్ (Ram Charan) సతీమణి ఉపాసన (Upasana) ఫ్యామిలీ టైమ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రెగ్నెన్సీని ప్రకటించిన తర్వాత పుట్టింటి వారిని కలిసిన ఆమె ఎంతో సరదాగా గడిపారు. వారి ఆశీస్సులు తీసుకున్నారు. జీవితంలోని మధుర క్షణాలను ఆస్వాదిస్తున్నట్లు తెలిపారు. అయితే, తన అత్తమ్మ, చిరంజీవి సతీమణి సురేఖను మిస్ అవుతున్నట్లు చెప్పారు. ‘‘నా జీవితంలో ఎంతో ముఖ్యమైన మహిళల ఆశీస్సులతో మాతృత్వంలోకి అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ‘రెండు లక్షలమందితో కొత్త బలగాలు.. మరోసారి కీవ్ ముట్టడికి రష్యా ప్లాన్..!’
ఉక్రెయిన్(Ukraine)పై సైనిక చర్యలో భాగంగా మొదట్లో దేశ రాజధాని కీవ్(Kyiv)ను ముట్టడించేందుకు రష్యా విఫలయత్నం చేసిన విషయం తెలిసిందే. అయితే, వచ్చే ఏడాది ప్రారంభ నెలల్లో కీవ్ ముట్టడికి మరో భారీ ప్రయత్నం జరగొచ్చని ఉక్రెయిన్ అంచనా వేస్తోంది. దేశ సాయుధ దళాల కమాండర్- ఇన్- చీఫ్ జనరల్ వాలేరీ జాలుజ్నీ(Valeriy Zaluzhny) తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ప్రస్తుతం చాలా వరకు యుద్ధం.. తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ఫిఫా ప్రపంచకప్‌లో ‘ఈగ’ 2.0 సంచలనం..!
ప్రపంచకప్‌లో ఓ ‘ఈగ’ సూపర్ హిట్ అయ్యింది.. తన కల నెరవేర్చుకోవడానికి కేవలం 90 నిమిషాల దూరంలో ఉంది. 2018 ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి కసిగా ఎదురు చూస్తోంది.. అదేం రాజమౌళి ‘ఈగ’ కాదు.. అర్జెంటీనా ఈగ..! అదే లియోనల్ మెస్సీ(lionel messi)..! అదేంటీ మెస్సీని ఈగతో పోలుస్తున్నారంటారా.. ‘లా పుల్గా’ అనేది మెస్సీ ముద్దుపేరు. స్పానిష్ భాషలో దీనికి ‘ఈగ’ అని అర్థం. ఈ పేరును మెస్సీ సోదరులే పెట్టారు. ఆ తర్వాత ఇది పాపులర్ అయింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. డివైడర్‌ను ఢీకొని కారు పల్టీలు.. మంటలు చెలరేగి తల్లీకుమారుడి మృతి
నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని ఇనుపాముల గ్రామం వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన సీదెళ్ల ఫణికుమార్(43) కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌లో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లారు. శుక్రవారం ఉదయం తిరిగి స్వగ్రామానికి కారులో బయలుదేరారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
రాష్ట్రంలో త్వరలోనే క్రీడాపాలసీ
-
Crime News
చాట్ జీపీటీతో జవాబులు.. ఎలక్ట్రానిక్ డివైస్‌తో చేరవేత!
-
Sports News
Ambati Rayudu: చివరి మ్యాచ్‌లో రాయుడు మెరుపు షాట్లు.. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ముగింపు
-
World News
Japan: ప్రధాని ఇంట్లో ప్రైవేటు పార్టీ.. విమర్శలు రావడంతో కుమారుడిపై వేటు!
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి
-
Sports News
Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్