Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 21 Jan 2023 13:15 IST

1. జిన్‌పింగ్‌ నోట యుద్ధం వేళ.. చైనా సరిహద్దుల్లో భారత్‌ ‘ప్రళయ్‌’

వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి భారత్‌, చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. సరిహద్దుల్లో భారీ విన్యాసాలకు భారత వాయుసేన (IAF) సిద్ధమైంది. తూర్పు సెక్టర్‌లోని అరుణాచల్‌ప్రదేశ్‌, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో ఫైటర్‌జెట్లు, హెలికాప్టర్లు, డ్రోన్లతో భారీ స్థాయిలో విన్యాసాలు చేపట్టనుంది. లద్దాఖ్‌ (Ladakh) సరిహద్దుల్లో యుద్ధ సన్నద్ధతను చైనా (China) అధ్యక్షుడు జిన్‌పింగ్ (Xi Jinping) పరిశీలించిన వేళ.. ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. టీమ్ఇండియా మేనేజ్‌మెంట్ ప్రణాళిక ఏంటో అర్థం కావడం లేదు: కపిల్‌ దేవ్‌

సూర్యకుమార్‌ యాదవ్‌.. టీ20ల్లో భారీ ఇన్నింగ్స్‌లను ఆడటంలో దిట్ట. దాదాపు ఒకే ఏడాదిలో మూడు సెంచరీలు బాది సంచలనం సృష్టించాడు. పొట్టి ఫార్మాట్‌లో నంబర్‌వన్‌ ర్యాంకర్‌. అలాంటి సూర్యకుమార్‌కు వన్డేల్లో మాత్రం పెద్దగా అవకాశాలు రావడం లేదు. కేఎల్ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్‌.. ఇలా ఎవరైనా గాయపడితేనే జట్టులోకి తీసుకోవడం జరుగుతోంది. అలాగే ఐదారు స్థానాల్లో బ్యాటింగ్‌ చేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ క్రమంలో సూర్యకుమార్‌కు రెగ్యులర్‌గా  జట్టులో స్థానం కల్పించకపోవడంపై.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. క్లబ్‌లో దేవిశ్రీ డ్యాన్సులు.. వీడియో షేర్‌ చేసిన బాబీ..

సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ (Devisri Prasad)కు తెలియకుండా.. ఓ క్లబ్‌లో ఆయన డ్యాన్స్‌లు చేస్తోన్న వీడియోను దర్శకుడు బాబీ (Bobby) చిత్రీకరించి సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. దీనిపై దేవిశ్రీ స్పందిస్తూ.. ‘‘మీ డైరెక్టర్‌ యాంగిల్‌ చూపించారుగా’’ అని వ్యాఖ్యానించారు. అసలు ఏం జరిగిందంటే..? బాబీ, దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా వీరిద్దరూ కలిసి శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఓ క్లబ్‌లో సందడి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘ఆ ట్వీట్లను అనువదిస్తాం’.. మరో అప్‌డేట్ ఇచ్చిన మస్క్‌

ట్విటర్‌(Twitter)ను సొంతం చేసుకున్న దగ్గరి నుంచి ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్‌మస్క్‌(Elon Musk) కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. శనివారం ఆయన కొత్త అప్‌డేట్ ఇచ్చారు. ‘రానున్న నెలల్లో ఇతర దేశాలు, సంస్కృతులకు చెందిన  ప్రజలు చేసే అద్భుతమైన ట్వీట్లను ట్విటర్‌ అనువదిస్తుంది. అలాగే వాటిని సిఫార్సు చేస్తుంది. ఇతర దేశాల్లో ప్రతిరోజూ ఎన్నో అమోఘమైన ట్వీట్లు ఉంటాయి. మరీ ముఖ్యంగా జపాన్‌ నుంచి..’ అంటూ ఆయన పోస్టు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మోదీ సర్కారు ఆ ఐదు నిర్ణయాలపై ఆసక్తి..!

ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటోంది. భారత్‌ పరిస్థితి మెరుగ్గా ఉన్నా.. దీని ప్రభావం కొంతైనా దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు ఉద్యోగాల కోతను మొదలుపెట్టాయి. దీంతో ప్రజల వ్యయశక్తి తగ్గి ప్రభుత్వ ఆదాయం తగ్గనుంది. ఈ క్రమంలో ఎక్కడ అభివృద్ధికి బ్రేకులు పడకుండా ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడం మోదీ సర్కారుకు కత్తిమీద సాములా మారనుంది. ప్రభుత్వం వ్యయ నియంత్రణ ఎక్కడ బ్యాలెన్స్‌ తప్పినా ద్రవ్యలోటు పెరిగిపోయే ప్రమాదం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. తిరుమలలో డ్రోన్ దృశ్యాల కలకలం.. స్పందించిన తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించిన ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌ శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో వ్యాపించడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించిన ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌ హైదరాబాద్‌కు చెందిన సంస్థ సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేసినట్లు గుర్తించామన్నారు. సదరు సంస్థపై క్రిమినల్‌ కేసు నమోదు చేస్తామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పిల్లలు పుట్టడం లేదని.. మహిళతో శ్మశానంలో ఎముకలు తినిపించారు

పిల్లలు పుట్టడం లేదని ఓ మహిళతో ఎముకలు తినిపించిన దారుణ ఘటన మహారాష్ట్రలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణె, ధైరీ ప్రాంతంలోని సింహగడ్‌ రోడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధిత మహిళకు సంతానం కలగలేదని భర్త సహా కుటుంబ సభ్యులు ఆమెను కొంతకాలంగా మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారు. ఆమెపై నరబలి, జంతుబలి చేసే మాంత్రికుడితో క్షుద్ర పూజలు చేయించారు. శ్మశానంలో ఆ మహిళను కూర్చోబెట్టి ఆమె చేత అస్థికలు తినిపించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రష్యా-గోవా విమానానికి మరోసారి బాంబు బెదిరింపు..

రష్యా (Russia) నుంచి గోవా (Goa) బయల్దేరిన ఓ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని (Flight) దారిమళ్లించినట్లు గోవా పోలీసులు తెలిపారు. 240 మంది ప్రయాణికులు, సిబ్బందితో మాస్కో నుంచి బయల్దేరిన అజుర్‌ ఎయిర్‌ విమానం షెడ్యూల్‌ ప్రకారం శనివారం తెల్లవారుజామున 4.15 గంటలకు దక్షిణ గోవాలోని డబోలిమ్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అవ్వాల్సి ఉంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ప్రచారం ఎందుకో వినియోగదారుడికి చెప్పాల్సిందే..!

ఏదైనా కంపెనీ ఉత్పత్తులు లేదా సేవలకు ప్రచారకర్తలుగా (Brand Ambassdors) వ్యవహరించే సెలబ్రిటీలు (Celebrities) లేదా సామాజిక మాధ్యమాల్లో లక్ష కంటే ఎక్కువ మంది అనుసరిస్తున్న వ్యక్తులు (Social Media Influencers) ఇకపై ఆయా ఉత్పత్తులకు ఎందుకు ప్రచారం చేస్తున్నామనేది బహిర్గతం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాల శాఖ ఎండార్స్‌మెంట్‌ నో హౌస్‌ (Endorsement Know Hows) పేరుతో శుక్రవారం కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వేధింపులు డ్రామా కాదు.. మీవే చెత్త రాజకీయాలు: మాలీవాల్‌

దేశ రాజధాని దిల్లీ(Delhi)లో మహిళా కమిషన్‌(DCW) ఛైరపర్సన్ స్వాతి మాలీవాల్‌(Swati Maliwal)కు ఎదురైన వేధింపులు డ్రామా అంటూ భాజపా(BJP) నేతలు విమర్శలు చేశారు. ఇదంతా దిల్లీ పోలీసులను చెడుగా చూపించేందుకేనని నిందించారు. దీనిపై మాలీవాల్‌ కూడా అంతేఘాటుగా స్పందించారు. ‘నా గురించి చెత్త అబద్ధాలు చెప్పి, నన్ను భయానికి గురిచేయాలనుకునే వారికి ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ చిన్న జీవితంలో నేను ఎన్నో పనులు చేశాను. ఎన్నో సార్లు దాడులు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని