Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 22 Jan 2023 13:39 IST

1. చాకచక్యంగా నన్ను నేను రక్షించుకున్నా: స్మితా సభర్వాల్‌

తన ఇంట్లోకి డిప్యూటీ తహసీల్దార్‌ చొరబాటు ఘటనపై ఐఏఎస్‌ అధికారిణి స్మితా సభర్వాల్‌ (Smitha Sabharwal) స్పందించారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు. ‘‘అర్ధరాత్రి బాధాకరమైన అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి నా ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డాడు. ధైర్యం, చాకచక్యంతో నన్ను నేను రక్షించుకోగలిగాను. ఎంత భద్రత ఉన్నా.. మనల్ని మనం కాపాడుకునేలా ఉండాలి. రాత్రివేళ తలుపులు, తాళాలను స్వయంగా పరిశీలించుకోవాలి. అత్యవసర స్థితిలో డయల్‌ 100కు ఫోన్‌ చేయాలి’’ అని ట్వీట్‌లో స్మితా సభర్వాల్‌ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ట్విటర్‌లో మరో కీలక మార్పు యోచనలో మస్క్‌

సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్‌ (Twitter) ఆర్థిక కష్టాలతో సతమతమవుతోంది. దాన్ని గట్టెక్కించేందుకు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగుల తొలగింపు, ట్విటర్‌ బ్లూ (Twitter Blue) వంటి మార్పులను తీసుకొచ్చారు. తాజాగా మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. వాణిజ్య ప్రకటనలు లేని ట్విటర్‌ (Twitter) వెర్షన్‌ను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు శనివారం వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. బుల్‌పై ‘మార్కెట్లో’ ఆశలు..!

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, అమెరికాలో ద్రవ్యోల్బణం, చైనాలో కొవిడ్‌ భయాలు అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేశాయి. ఆ ప్రభావం భారతీయ కంపెనీలపై కూడా పడింది. అయినా కానీ, దేశీయ స్టాక్‌మార్కెట్లు(stock market) కొంత ప్రీమియంలోనే ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. మాంద్యం భయాలు ఉండటంతో మార్కెట్‌ ఈ ఏడాది సున్నితంగా మారే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌(Budget 2023)లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నిర్ణయాలు 2023-24లో కోట్ల మంది మదుపర్ల ప్రయోజనాలను ప్రభావితం చేయనున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. భారీ స్కోరు బాకీ ఉందని తెలుసు.. కానీ నాకు కంగారేమీ లేదు: రోహిత్‌

భారత కెప్టెన్‌ రోహిత్ శర్మ దూకుడుగా ఆడతాడు. అయితే వన్డేల్లో సెంచరీ కొట్టి దాదాపు రెండేళ్లవుతోంది. కీలక ఇన్నింగ్స్‌లు ఆడినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు. తాజాగా న్యూజిలాండ్‌పై అర్ధశతకం సాధించాడు. గత కొంతకాలంగా మూడంకెల స్కోరు సాధించకపోవడంపై రోహిత్ శర్మ స్పందించాడు. ‘‘ఇప్పుడు నేను నా గేమ్‌ను మార్చుకొనేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నా. బౌలర్లపై ఆధిపత్యం కొనసాగిస్తున్నా. ఒత్తిడి తేవడం చాలా ముఖ్యమనేది నా భావన.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. శతాబ్దాల సంప్రదాయానికి కింగ్‌ ఛార్లెస్‌-3 స్వస్తి?

బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3 (King Charles III), ఆయన సతీమణి క్యామిల్లా పట్టాభిషేకం  ఈ ఏడాది మే నెలలో వైభవంగా జరగనుంది. ఈ వేడుకలో శతాబ్దాల సంప్రదాయానికి కొత్త చక్రవర్తి స్వస్తి పలకనున్నట్లు సమాచారం. పట్టాభిషేక (coronation) సమయంలో రాజ దుస్తులను ధరించే ఆచారానికి ఆయన దూరంగా ఉండనున్నట్లు ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ‘ఇండిపెండెంట్‌’ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘రంజితమే’ పాట.. డ్యాన్స్‌తో షేక్‌ చేసిన కొరియోగ్రాఫర్‌ జానీ

విజయ్ ‌(Vijay) హీరోగా నటించిన ఫ్యామిలీ, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘వారిసు’ (Vaarisu). రష్మిక (Rashmika) కథానాయిక. వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని ‘రంజితమే’ (Ranjithame) పాట థియేటర్లను షేక్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. విజయ్‌ - రష్మిక జోడీ వేసిన స్టెప్పులను ఫ్యాన్స్‌ ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారు. మరోవైపు యూట్యూబ్‌లోనూ ఈ పాట 150 మిలియన్లకు పైగా వ్యూస్‌ సొంతం చేసుకుంది. కాగా, ఈ పాటకు జానీ మాస్టర్‌ (Jani Master) డ్యాన్స్‌ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మనిషిని పోలిన మనుషులు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు!

మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని విన్నాం. అయితే ఆ ఏడుగురు ఎక్కడుంటారో ఎవరికైనా తెలుస్తుందా? పోనీ.. కనీసం మనలా ఎవరో ఒకరైనా ఉన్నారే అనుకుందాం. వారిని కలవాలంటే.. ఫేస్‌బుక్‌(facebook), ట్విటర్‌(twitter), యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌(instagram) ఇలా ఏ సామాజిక మాధ్యమంలో వెతకాలి? వారు మనకు అసలు ఎదురుపడతారా? ప్చ్‌.. కష్టం అనుకుంటున్నారా? అదేమీ అంత కష్టం కాదని నిరూపిస్తోంది Twinstrangers.com అనే వెబ్‌సైట్‌. ఇదే పేరుతో ఓ యాప్‌ కూడా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. బ్రెజిల్‌ ఆర్మీ చీఫ్‌ తొలగింపు..!

బ్రెజిల్‌(Brazil) మాజీ అధ్యక్షుడు జైర్‌ బోల్సొనారో(Jair Bolsonaro) మద్దతుదారులు రాజధాని  బ్రసిలియాలో సృష్టించిన అల్లర్లపై అధ్యక్షుడు లూలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దేశ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ జూలియో సిజర్‌ డె అర్రుడాను పదవి నుంచి తొలగించింది. ఈ మేరకు శనివారం ఆదేశాలు జారీ చేసినట్లు ఆ దేశ సైన్యం అధికారిక వెబ్‌సైట్‌ వెల్లడించింది. జూలియో స్థానంలో జనరల్‌ టొమస్‌ మిగ్యూల్‌ రెబెరో పైవాను నియమించినట్లు పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నిజమే.. రోజుకు రెండు కోట్ల పారితోషికం తీసుకున్నా..

ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా బాలీవుడ్‌లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుని ఎదిగిన నటుడు కార్తిక్‌ ఆర్యన్ (Kartik Aaryan)‌‌. గతేడాది ‘భూల్‌ భులయ్యా-2’(Bhool Bhulaiyaa 2) సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ చిత్రంతో బాలీవుడ్‌లో ఒక్కసారిగా సెన్సేషనల్‌ స్టార్‌గా మారిపోయాడు ఈ యువనటుడు. అయితే, ఇటీవల ఈ యంగ్‌ హీరోకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. తన మొదటి సినిమాకు రూ.1.75 లక్షలు పారితోషికం తీసుకున్న కార్తిక్‌.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఈ రోజు చైనాలో ‘హ్యాపీ న్యూ ఇయర్‌’

అందరికీ జనవరి 1న నూతన సంవత్సరం(calendar) ప్రారంభమవుతుంది. కానీ, చైనా(china)లో మాత్రం ఇవాళ.. అంటే జనవరి 22న. సంప్రదాయ లూనిసోలార్‌ క్యాలెండర్‌ ప్రకారం వసంత రుతువు లిచున్‌తో చైనాలో నూతన సంవత్సరం(Chinese New Year) ప్రారంభమవుతుంది. దీనినే ‘స్ప్రింగ్‌ ఫెస్టివల్‌’ అని కూడా అంటారు. చైనా క్యాలెండర్‌లో 24 సౌర కాలాలు ఉంటాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని