Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 24 Jan 2023 13:25 IST

1. టీమ్‌ఇండియా స్టార్‌ పేసర్‌ షమీకి షాక్‌.. మాజీ భార్యకు భరణం ఇవ్వాల్సిందే..

టీమ్‌ఇండియా స్టార్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ(Mohammed Shami)కి షాక్‌. మాజీ భార్య హసీన్‌ జహాన్‌కు షమీ నెలకు రూ.1.30 లక్షల భరణం చెల్లించాలని కోల్‌కతా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రూ.50 వేలు మాజీ భార్య ఖర్చుల నిమిత్తం కాగా.. మిగతా రూ.80 వేలు వారి కుమార్తె పోషణ కోసం ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది. వీరు విడిపోయిన అనంతరం కుమార్తె హసీన్‌ వద్దే ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ.. అమెరికా స్పందన ఇదే

భారత ప్రధాని నరేంద్రమోదీ(Modi)పై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ వివాదం రాజేసింది. దీనిపై కేంద్రం నుంచి తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తమైంది. తాజాగా దీనిపై అగ్రదేశం అమెరికా(US) స్పందించింది. ‘మీరు చెప్తున్న డాక్యుమెంటరీ గురించి నాకు తెలియదు. రెండు శక్తిమంతమైన ప్రజాస్వామ్యాలుగా అమెరికా, భారత్‌కు వాటి భాగస్వామ్య విలువల గురించి బాగా తెలుసు. భారత ప్రజాస్వామ్యం శక్తిమంతమైది. ఈ రెండు దేశాలను కలిపి ఉంచే వాటిపై మా దృష్టి ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌పై కన్ను.. మైలురాళ్లకు చేరువగా భారత స్టార్‌ ఆటగాళ్లు

మూడు వన్డేల సిరీస్‌ను ఇప్పటికే భారత్ 2-0తో కైవసం చేసుకొన్న విషయం తెలిసిందే. చివరి మ్యాచ్‌లోనూ విజయం సాధించి క్లీన్‌స్వీప్‌ చేయాలని టీమ్‌ఇండియా ఎదురు చూస్తోంది. తొలి వన్డేలో బ్యాటింగ్‌లో అదరగొట్టగా.. రెండో మ్యాచ్‌లో బౌలింగ్‌తో కివీస్‌ను భారత్‌ బెంబేలెత్తించింది. అయితే మూడో వన్డేలోనూ టీమ్‌ఇండియా విజయం సాధిస్తే మాత్రం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకొనేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు మూడో స్థానంలో ఉన్న భారత్‌.. సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తే నంబర్‌వన్‌ ర్యాంక్‌కు చేరుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్రకు పోలీసుల అనుమతి

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టనున్న ‘యువగళం’ పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్‌రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. షరతులతో కూడిన అనుమతి ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పాదయాత్రలో ప్రజలు, వాహనదారులు, ఎమర్జెన్సీ సర్వీసెస్‌ రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలగించొద్దని ఎస్పీ సూచించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కాల్పుల మోతతో దద్దరిల్లిన అమెరికా.. 3 రోజుల్లో 20 మందికి పైగా మృతి

అగ్రరాజ్యం అమెరికా (US)లో తుపాకీ సంస్కృతి పేట్రేగిపోతోంది. కాల్పుల గర్జనకు అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. విచ్చలవిడిగా పెరిగిన తుపాకుల వినియోగంతో కాలు బయటపెట్టాలంటేనే భయపడే పరిస్థితి నానాటికీ పెరుగుతోంది. తాజాగా గంటల వ్యవధిలో నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో (Shootings) 20 మందికి పైగా బలయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మోదీ సర్కారు ‘స్థిర’ నిర్ణయాలేమిటో..?

 కొవిడ్‌ సమయంలో అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న రంగాల్లో స్థిరాస్తి ఒకటి. లాక్‌డౌన కారణంగా కొన్ని నెలలపాటు నిర్మాణాలు నిలిచిపోయాయి. దశల వారీగా లాక్‌డౌన్‌ తొలగించే నాటికి చాలా మంది కూలీలు స్వగ్రామాలకు వలసపోయారు. దీంతో వెంటనే నిర్మాణాలు పునః ప్రారంభం కాలేదు. నెలలకొద్దీ కూలీల కొరత నెలకొంది. మెల్లగా 2022 నాటికి గృహ నిర్మాణాల విక్రయాలు అంతకు మందు ఏడాదితో పోలిస్తే 50 శాతం పుంజుకొన్నాయి. ఇప్పుడు 2023లో కూడా ఆ డిమాండ్‌ను కొనసాగించడం రియల్‌ ఎస్టేట్‌ రంగం ఎదుట నిలిచిన ముఖ్యమైన సవాల్‌. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నాన్నా ఒక్కసారి తిరిగిరావా.. కన్నీరు పెట్టిస్తోన్న జబర్దస్త్‌ నటి పోస్ట్‌

జబర్దస్త్‌(Jabardasth) కామెడీ షో ద్వారా అందరికీ దగ్గరైంది రీతూ చౌదరి(Rithu Chowdhary). తన టాలెంట్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రీతు ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తనకు నాన్న అంటే ఎంత ఇష్టమో సందర్భం వచ్చినప్పుడల్లా ఆమె చెబుతుంటుంది. తాజాగా తండ్రి మరణంపై సోషల్‌మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది. ‘‘ఐ మిస్‌ యూ నాన్న. నన్ను వదిలేసి ఎలా వెళ్లిపోయావు. నువ్వు లేకుండా నేను ఉండలేను.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఉక్రెయిన్‌లో కిరాయి కాలకేయ సైన్యం యుద్ధం ఇలా..!

రష్యాకు చెందిన ప్రైవేటు సైన్యం అత్యంత క్రూరమైన వ్యూహాలతో ఉక్రెయిన్‌లోని కీలక నగరమైన బక్ముత్‌ వద్ద పోరాడుతోంది. ఈ కిరాయి మూక పోరాటశైలి చూసి ఉక్రెయిన్‌ బలగాలే అవాక్కయ్యాయి. వందల మంది ప్రాణాలు కోల్పుతున్నా.. యుద్ధ క్షేత్రాన్ని మాత్రం వదిలి వెళ్లడంలేదు. వాగ్నార్‌ గ్రూప్‌ పోరాట విధానంపై 2022 డిసెంబర్‌లో ఉక్రెయిన్‌ ఇంటెలిజెన్స్‌ నివేదిక ఓ ఆంగ్లపత్రిక చేతికి వచ్చింది. ముఖ్యంగా అర్బన్‌ వార్ఫేర్‌లో ఈ గ్రూపు ప్రమాదకరంగా పరిణమించిందని దానిలో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9.  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఖాతాలో మరో అరుదైన అకాడమీ అవార్డు

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’‌ చిత్రం విదేశాల్లోనూ సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రం తాజాగా మరో అరుదైన అవార్డును తన ఖాతాలో వేసుకుంది. జపాన్‌ 46వ అకాడమీ అవార్డ్స్‌లో అవుట్‌ స్టాండింగ్‌ ఫారిన్‌ ఫిల్మ్‌ కేటగిరిలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అవార్డు గెలుచుకుంది. ప్రపంచాన్ని షేక్‌ చేస్తోన్న ‘అవతార్‌: ద వే ఆఫ్‌ వాటర్’, ‘టాప్‌గన్‌: మావెరిక్‌’ వంటి హాలీవుడ్‌ చిత్రాలను దాటి ఈ జక్కన్న అద్భుతం అవార్డును కైవసం చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పేజీకో కరెన్సీ నోటు.. పుస్తకంలో రూ.74లక్షలు

ఎంత క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నా.. అక్రమ రవాణా కోసం స్మగ్లర్లు కొత్త దారులు వెతుకుతూ.. అధికారులకు చిక్కుతూనే ఉన్నారు. తాజాగా దేశానికి అక్రమంగా విదేశీ కరెన్సీ, బంగారం తీసుకొస్తున్న ఇద్దరు విదేశీయులను ముంబయి ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు (Customs Officials) పట్టుకున్నారు. రెండు వేర్వేరు ఘటనల్లో వీరిని అరెస్టు చేశారు. జనవరి 22 అర్ధరాత్రి తర్వాత ముంబయి (Mumbai) ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఓ విమానంలోని ప్రయాణికులను అధికారులు తనిఖీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు