Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. కనకదుర్గమ్మ చెంత ‘వారాహి’కి పవన్ ప్రత్యేక పూజలు
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తన ఎన్నికల ప్రచార రథం ‘వారాహి’కి దుర్గమ్మ చెంత పూజలు నిర్వహించారు. మంగళవారం తెలంగాణలోని కొండగట్టు, ధర్మపురి ఆలయాల వద్ద ‘వారాహి’కి ప్రత్యేక పూజలు చేయించిన పవన్.. నేడు విజయవాడ చేరుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. ప్రేమలో పడిన స్టార్ హీరోయిన్..? 13 ఏళ్లుగా రిలేషన్ అంటూ వార్తలు..
తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తూ దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు కీర్తి సురేశ్ (Keerthy Suresh). ఈ ముద్దుగుమ్మ పెళ్లికి సంబంధించిన వార్తలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తన చిన్ననాటి స్నేహితుడితో ఆమె ప్రేమలో ఉందని.. 13 ఏళ్ల నుంచి వీరిద్దరూ సీక్రెట్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని ఆ కథనాల సారాంశం. అతడు ఒక వ్యాపారవేత్త అని.. కేరళలో అతడికి రిసార్ట్స్ ఉన్నాయని సమాచారం. అయితే వీరిద్దరూ ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదని.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. వేతన జీవుల వెతలు.. బడ్జెట్‌లో దొరికేనా ఉపశమనం..?
కేంద్ర బడ్జెట్ 2023కి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో వివిధ వర్గాల నుంచి అనేక డిమాండ్లు వినిపిస్తున్నాయి. 2022లో ఉద్యోగులకు కష్టంగానే గడిచింది. తొలగింపులు, వర్క్ ఫ్రమ్ హోం నుంచి తిరిగి ఆఫీసులకు వెళ్లడం, ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం భయాల వంటి పరిణామాలు వేతన జీవులను ఆందోళనకు గురిచేశాయి. వీటిలో కొన్ని ఇబ్బందులు ఈ ఏడాది కూడా కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో వేతనజీవుల వెతలను కాస్తయినా తగ్గించే ప్రకటనలు ఉండాల్సిన అవసరం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. సచిన్.. విరాట్ కోహ్లీ.. వీరిద్దరిలో గిల్ ఎవరిని ఎంచుకొన్నాడంటే?
ఒకే సిరీస్‌లో డబుల్ సెంచరీతోపాటు శతకం సాధించిన టీమ్‌ఇండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (360) ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఒకే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌తో సమంగా నిలిచాడు. మ్యాచ్ అనంతరం ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతున్న సందర్భంగా అడిగిన ప్రశ్నకు గిల్ చాలా సమయస్ఫూర్తిగా సమాధానం ఇచ్చాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. లఖింపుర్ ఖేరీ ఘటన.. ఆశిష్ మిశ్రాకు బెయిల్, కానీ..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపుర్ ఖేరీ (Lakhimpur Kheri) ఘటనలో ప్రధాన నిందితుడైన కేంద్రమంత్రి అజయ్ కుమార్ మిశ్రా (Ajay Kumar Mishra) కుమారుడు ఆశిష్ మిశ్రా (Ashish Mishra)కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో అతడికి సర్వోన్నత న్యాయస్థానం 8 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో పాటు కొన్ని షరతులు కూడా విధించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. పాక్‌కు భారత్ ఆహ్వానం.. 12 ఏళ్ల తర్వాత దేశానికి దాయాది మంత్రి..!
ఉగ్రవాదం, కశ్మీర్ అంశాలపై భారత్, పాకిస్థాన్ మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ.. కీలక పరిణామం చోటుచేసుకుంది. గోవా వేదికగా త్వరలో జరగబోయే షాంఘై సహకార సంస్థ- ఎస్‌సీఓ సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రభుత్వం.. దాయాదికి ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ ద్వారా కేంద్ర విదేశీ వ్యవహరాల మంత్రి ఎస్. జైశంకర్.. పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోకు అధికారికంగా ఆహ్వానం పంపినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. బీబీసీ డాక్యుమెంటరీపై ట్వీట్.. కాంగ్రెస్‌ను వీడిన ఏకే ఆంటోనీ తనయుడు
ప్రధాని మోదీ(Modi)పై బీబీసీ తీసిన డాక్యుమెంటరీ తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ డాక్యుమెంటరీని వ్యతిరేకిస్తూ పోస్టు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ(AK Antony) తనయుడు అనిల్ (Anil K Antony).. బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. తాను చేసిన ట్వీట్‌ను వెనక్కి తీసుకోవాలంటూ వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. సహచరులంతా.. అతడిని మాంత్రికుడిగా అభివర్ణిస్తారు: రోహిత్ శర్మ
తాజాగా న్యూజిలాండ్‌పైనా వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. మ్యాచ్ అనంతరం గిల్, శార్దూల్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలతో ముంచెత్తాడు. ‘‘మా బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ వేశారు. మా ప్రణాళికలకు అనుగుణంగా ఆడాం. శార్దూల్ ప్రత్యేకంగా నిలిచాడు. కీలక సమయంలో వికెట్లు తీశాడు. అందుకే జట్టు సహచరులంతా అతడిని మాంత్రికుడిగా అభివర్ణిస్తారు. సరైన సమయంలో బౌలింగ్‌తో అదరగొట్టాడు’’ అని రోహిత్ వెల్లడించాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. నాటు నాటు.. నా మనసులోని భావాలకు అక్షర రూపం ఇచ్చాను: చంద్రబోస్
ఆస్కార్ నామినేషన్లలో ‘ఆర్‌ఆర్‌ఆర్’(RRR) సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు చోటుదక్కడంపై సినీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పాట రాసిన చంద్రబోస్(Chandrabose) మాట్లాడుతూ.. ‘‘నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్(Oscars 2023)కు నామినేట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. కీరవాణి(Keeravaani), రాజమౌళి(Rajamouli)కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. చిన్న పల్లెటూరి నుంచి వచ్చి, సామాన్య నేపథ్యం ఉన్న నాలాంటి రచయితకు ఇది గొప్ప విజయం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. ‘కిసాన్’ వడ్డీ చెల్లిస్తే సరిపోతుందా..? బడ్జెట్‌పై ఎస్‌బీఐ రీసెర్చ్ అంచనాలు!
ఓవైపు ఆర్థిక మాంద్యం భయాలు, మరోవైపు అస్థిర ఆర్థిక పరిస్థితుల మధ్య కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న బడ్జెట్ (Budget 2023) ప్రవేశపెట్టనుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ 2.0కు ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ (Budget 2023) కావడం కూడా అంచనాలను పెంచుతోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ (Budget 2023)పై అనేక సంస్థలు తమ అభిప్రాయాలు, అంచనాలను వెల్లడిస్తున్నాయి. తాజాగా ఎస్‌బీఐ రీసెర్చ్ రీపోర్ట్ సైతం పలు రంగాలపై తమ అంచనాలను బయటపెట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Lottery: సినీ నటి ఇంట్లో సహాయకుడు.. ఇప్పుడు కోటీశ్వరుడు
-
India News
క్యాన్సర్, అధిక రక్తపోటుకు అల్లోపతిలో చికిత్స లేదు: బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
Politics News
కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/03/23)
-
General News
Viral: ప్రొజెక్టర్ స్క్రీన్‌గా బెడ్‌షీట్.. ఇది కదా వాడకమంటే..!
-
Ts-top-news News
ఒకే పేరు... 38 బ్యాంకు ఖాతాలు!.. బాధితుడికి తెలియకుండానే ఆన్లైన్లో అకౌంట్లు