Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. ప్రపంచ వృద్ధిలో భారత్, చైనాదే సగం వాటా: ఐఎంఎఫ్
కేంద్ర ప్రభుత్వం బుధవారం బడ్జెట్ (Budget 2023) ప్రవేశపెట్టనున్న తరుణంలో ‘అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)’ భారత వృద్ధిరేటుకు సంబంధించి కీలక గణాంకాలను వెల్లడించింది. ఈ ఏడాది దేశ జీడీపీ (GDP) వృద్ధిరేటు 6.1 శాతానికి పరిమితమవుతుందని తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అది 6.8 శాతానికి పుంజుకుంటుందని అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక ఔట్‌లుక్‌కు సంబంధించిన జనవరి అప్‌డేట్‌ను ఐఎంఎఫ్ మంగళవారం విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 30 మందికి గాయాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు పాఠశాల బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 30 మందికి గాయాలయ్యాయి. పాఠశాల బస్సులోని 20 మంది విద్యార్థులు, ఆర్టీసీ బస్సులోని 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సులోని క్షతగాత్రులకు సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ధైర్యవంతమైన ప్రభుత్వం.. విప్లవాత్మక నిర్ణయాలు: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
భారత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సెంట్రల్‌హాలులో ఉభయసభల సభ్యులనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ప్రసంగించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె లోక్‌సభ, రాజ్యసభల సంయుక్త సమావేశంలో ప్రసంగించడం ఇదే తొలిసారి. దేశం ఆత్మనిర్భర్ భారత్‌గా ఆవిర్భవిస్తోందని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము కొనియాడారు. ప్రపంచానికి పరిష్కారం చూపేలా మన దేశం తయారైందన్నారు. స్థిరమైన, నిర్ణయాత్మక ప్రభుత్వం.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. విమాన ప్రయాణికురాలి వీరంగం.. సిబ్బందిని కొట్టి, అర్ధ నగ్నంగా తిరిగి..!
విమానంలో ప్రయాణికుల అసభ్య చేష్టలు ఇటీవల తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా విస్తారా (Vistara) విమానంలో ఇటలీకి చెందిన ఓ 45 ఏళ్ల మహిళ వీరంగం సృష్టించింది. సిబ్బందిపై దాడి చేయడమే గాక, విమానంలో అర్ధ నగ్నంగా తిరుగుతూ తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ఆ మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది.. తారకరత్న ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్
గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన సినీ నటుడు నందమూరి తారకరత్నకు చికిత్స కొనసాగుతోంది. ఆయన త్వరగా కోలుకోవాలంటూ సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తారకరత్న ఆరోగ్యంపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. ‘‘సోదరుడు తారకరత్న(Taraka Ratna) త్వరగా కోలుకుంటున్నారు. ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. బడ్జెట్ సమావేశాలకు ముందే.. ప్రపంచం నుంచి సానుకూల సందేశాలు..!
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ముందు ప్రధాని నరేంద్రమోదీ(Modi) మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశాలు ప్రారంభానికి ముందే విశ్వసనీయ వర్గాల నుంచి సానుకూల సందేశాలు అందాయని ప్రధాని అన్నారు. ‘ఈ రోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం నుంచే ఆర్థిక ప్రపంచంలోని విశ్వసనీయ వర్గాల నుంచి సానుకూల సందేశాలు వెలువడ్డాయి. కొత్త ఉత్సాహానికి నాంది పలికాయి. ఆర్థిక అనిశ్చితుల వేళ ప్రపంచం మొత్తం భారత్ బడ్జెట్ వైపు చూస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. బుధవారం సచిన్ చేతుల మీదుగా అండర్-19 వరల్డ్‌కప్ విజేతలకు సత్కారం
తొలిసారి నిర్వహించిన అండర్ - 19 మహిళల ప్రపంచకప్ టైటిల్‌ను టీమ్‌ఇండియా ఎగరేసుకుపోయిన విషయం తెలిసిందే. ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి మరీ విజేతగా నిలిచింది. దీంతో యువ ప్లేయర్లను అందరూ ప్రశంసలతో ముంచెత్తారు. జట్టులోని సభ్యులు, సహాయక సిబ్బందికి రూ. 5 కోట్లను నజరానాగా బీసీసీఐ ప్రకటించింది. ఈ క్రమంలో భారత క్రీడాకారిణులను ప్రత్యేకంగా సత్కరించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. రాష్ట్రపతి ప్రసంగానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం.. మంచు కారణమట..!
కొత్త ఆర్థిక సంవత్సరం కోసం కేంద్రప్రభుత్వం(Center) ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. దీంతో మంగళవారం నుంచి పార్లమెంట్(Parliament) బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సెంట్రల్ హాల్‌లో ఉభయసభల సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించనున్నారు. దీనికి కాంగ్రెస్ ఎంపీలు దూరం కానున్నారు. రాజ్యసభ సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే, పలువురు ఎంపీలు హాజరుకారని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. అచ్యుతాపురం సెజ్‌లో పేలిన రియాక్టర్: ఒకరి మృతి.. ముగ్గురికి తీవ్రగాయాలు
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్)లో భారీ పేలుడు జరిగింది. లాలంకోడూరు సమీపంలోని జీఎఫ్‌ఎంఎస్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో.. భయాందోళనకు గురైన కార్మికులు అక్కడ నుంచి పరుగులు తీశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. డ్రాగన్ శక్తిని ఎదుర్కోవాలంటే..!
భారత్ గతంలో ఎన్నడూ ఎదుర్కోనంత ముప్పును వాస్తవాధీన రేఖ వద్ద ఎదుర్కొంటోంది. ఎల్‌ఏసీ వద్ద పాగావేసిన చైనా దళాలు వెనక్కి తగ్గే ఆలోచనే చేయడం లేదు. అంతకంతకూ చొచ్చుకొస్తున్నాయి. చైనా వైపు 5జీ కమ్యూనికేషన్స్ నెట్‌వర్క్‌తో సహా అత్యాధునిక సాంకేతికతను కూడా మోహరిస్తోంది. చైనా ముప్పు కేవలం హిమగిరులకే పరిమితం అనుకొంటే పొరబడ్డట్లే. డ్రాగన్ నౌకలు బంగాళాఖాతంలోకి కూడా చొచ్చుకొస్తున్నాయి. భారత్ చుట్టూ నౌకాదళ స్థావరాలను ఏర్పాటు చేసుకొంటున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Kola Guruvulu: కోలా గురువులుకు మళ్లీ నిరాశే
-
Ap-top-news News
Botsa Satyanarayana: నాకు 2 మార్కులే ఇస్తామన్నారుగా: మంత్రి బొత్స
-
Crime News
Acid Attack: ప్రియుడితో వెళ్లిపోయిందని.. కోర్టులోనే భార్యపై యాసిడ్ దాడి!
-
Politics News
kotamreddy giridhar reddy: తెదేపాలోకి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి
-
World News
Tourist Visa: పర్యాటక వీసాతోనూ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు
-
Politics News
హిమంతను రాహుల్ సరిగా డీల్ చేయలేదు