Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 01 Feb 2023 13:21 IST

1. మహిళల కోసం కొత్త స్కీమ్‌

ఆజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగంగా మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్రం కొత్త పథకం తీసుకొచ్చింది. మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ను ప్రవేశపెట్టింది. రెండేళ్ల కాలానికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకంలో డిపాజిట్‌పై 7.5 శాతం స్థిర వడ్డీ ఉంటుంది. గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు ఈ పథకంలో డిపాజిట్‌ చేయొచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆదాయపన్ను పరిమితి రూ.7లక్షలకు పెంపు

ఉద్యోగులకు ఊరటనిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఉన్న రూ.5లక్షల  ఆదాయపు పన్ను పరిమితిని రూ.7లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అయితే, ఇది కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకున్నవారికి మాత్రమే వర్తిస్తుంది. * రూ.9లక్షల నుంచి రూ.12లక్షల వరకూ 15శాతం పన్ను * రూ.12లక్షల నుంచి రూ.15లక్షల వరకూ 20శాతం పన్ను * రూ.15. లక్షలకు పైబడిన వారికి 30శాతం పన్ను వర్తిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. లోక్‌సభలో నవ్వుల్‌ నవ్వుల్‌

పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో సరదా సన్నివేశం చోటుచేసుకుంది. తుక్కు విధానం గురించి ఆమె ప్రకటన చేస్తూ పొల్యూటెడ్‌ వెహికల్‌ అనబోయి.. పొలిటికల్‌ అని పలికారు. దీంతో అధికార సభ్యులతో పాటు, విపక్ష సభ్యులు ఒక్కసారిగా నవ్వారు. దీంతో ఒక్కసారిగా ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. పొరపాటును గ్రహించిన నిర్మలా సీతారామన్‌ సైతం నవ్వుతూ తప్పును సవరించుకుని తన ప్రసంగాన్ని కొనసాగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. గృహ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌..

కొత్తగా ఇల్లు కొనుగోలు, కట్టుకోవాలనుకోవాలనుకునే వారికి మోదీ సర్కారు గుడ్‌న్యూస్‌ చెప్పింది. పీఎం ఆవాస్‌ యోజన పథకానికి ఈ సారి బడ్జెట్‌లో నిధులు పెంచింది. గత బడ్జెట్‌లో పీఎం ఆవాస్‌ యోజనకు 48 వేల కోట్ల రూపాయలు కేటాయించగా.. ఈ ఏడాది ఆ మొత్తాన్ని 66 శాతం పెంచి రూ.79వేల కోట్లు కేటాయించారు. వడ్డీ రేట్లు పెరిగిన వేళ గృహ కొనుగోలుదారులకు ఇది ఊరట కల్పించే అంశం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రైల్వేలకు రూ.2.40 లక్షల కోట్లు

తాజా బడ్జెట్‌లో రైల్వేలకు రికార్డు స్థాయిలో నిధులు కేటాయిస్తున్నట్లు నిర్మల తెలిపారు.. రైల్వేల అభివృద్ధికి  ఈ బడ్జెట్‌లో రూ.2.40లక్షల కోట్లు కేటాయిస్తున్నాం. కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి పెద్ద పీట వేస్తాం. అలాగే మౌలిక వసతుల అభివృద్ధికి 33శాతం అధికంగా నిధులు కేటాయిస్తున్నాం. మూలధనం కింద రూ.10లక్షల కోట్లు కేటాయిస్తున్నాం అని వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సప్తర్షి రీతిలో మన బడ్జెట్‌.. ప్రాధాన్య అంశాలు వెల్లడించిన మంత్రి

 ఆర్థిక సంవత్సరానికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌(Nirmala Sitharaman ) పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అమృత్‌ కాలానికి ఇది తొలి పద్దు అని వెల్లడించారు. సప్తర్షి(సప్త రుషుల) రీతిలోనే బడ్జెట్‌లో ఏడు అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు.  * సమ్మిళత వృద్ధి చిట్టచివరి వ్యక్తికి కూడా లబ్ధి చేకూరాలి మౌలిక సదుపాయాలు- పెట్టుబడులు * సామర్థ్యాలను వెలికితీయడం( unleashing the potential) హరిత వృద్ధి యువ శక్తి  ఆర్థిక రంగం బలోపేతం పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సీనియర్‌ సిటిజన్స్‌ పొదుపు పథకం పరిమితి పెంపు

సీనియర్‌ సిటిజన్స్‌లో పొదుపు పథకంలో భాగంగా డిపాజిట్‌ పరిమితి పెంచుతున్నట్లు బడ్జెట్‌ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  ప్రకటించారు. ప్రస్తుతం రూ.15లక్షల వరకూ ఉన్న పరిమితిని డబుల్‌ చేసి, రూ.30లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. వరుసగా 5సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆరోమంత్రి సీతారామన్‌!

స్వాతంత్య్ర భారతదేశంలో వరుసగా ఐదుసార్లు బడ్జెట్‌ (Budget 2023) ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) నిలిచారు. ఈ జాబితాలో అరుణ్‌ జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్‌ సిన్హా, మన్మోహన్‌ సింగ్‌, మొరార్జీ దేశాయ్‌ ఉన్నారు. 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సీతారామన్‌ వరుసగా బడ్జెట్‌ ప్రవేశపెడుతూ వస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బంగారం, వెండి ధరలపై కస్టమ్స్‌ డ్యూటీ పెంపు

బంగారం, వెండి ధరలపై కస్టమ్స్‌ డ్యూటీ పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దీంతో ఆయా లోహల ధరలు పెరగనున్నాయి. అలాగే టైర్లు, సిగరెట్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ఎలక్ట్రిక్‌ వాహన ధరలు భారీగా తగ్గనున్నాయి. వీటితో పాటు, టీవీ, మొబైల్‌, కిచెన్‌ చిమ్నీ ధరలు కూడా తగ్గుతాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. బడ్జెట్‌ వేళ..ప్రత్యేక ఆకర్షణగా నిర్మలమ్మ చీరకట్టు..!

నేడు బడ్జెట్‌ పండగ. ఫిబ్రవరి ఒకటిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌(Nirmala Sitharaman ) కురిపించే వరాల జల్లు కోసం దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే ప్రతి ఏడాది ఈ ప్రత్యేకమైన రోజున ఆమె ధరించే చీరలపైనా అందరి దృష్టి ఉంటుంది. ఈ రోజు బడ్జెట్ ట్యాబ్‌తో ఎరుపు రంగు చీరలో దర్శనమిచ్చారు. బ్రౌన్‌ రంగులో టెంపుల్‌ బోర్డర్‌లో ఉన్న ప్రకాశవంతమైన ఎరుపు చీరతో కనిపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు