Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 06 Mar 2023 13:17 IST

1. మోదీపై పోటీ చేసిన గ్యాంగ్‌స్టర్‌.. మళ్లీ ఇప్పుడు వార్తల్లో ఎందుకు..?

యూపీలో హంతకులపై మరోసారి తుపాకులు గర్జించాయి. ఓ ఎమ్మెల్యే హత్యకేసులోని ముఖ్య సాక్షిని అంతమొందించిన షార్ప్‌షూటర్‌ను యూపీ పోలీసులు నేడు ఎన్‌కౌంటర్‌ చేశారు. బీఎస్పీ ఎమ్మెల్యే రాజ్‌పాల్‌ హత్యకేసులో ప్రధాన సాక్షి అయిన ఉమేశ్‌పాల్‌ను గతనెల 24 వతేదీ సాయంత్రం ప్రయాగ్‌రాజ్‌లో పట్టపగలే హంతకులు కాల్చి చంపారు. ఆయన తన అంగరక్షకులతో కలిసి ఇంటివద్దకు చేరుకోగానే తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఉమేశ్‌ అంగరక్షకుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మా జీపీఎఫ్ సంగతేంటి? దాచుకోవడమే నేరమా?: బొప్పరాజు

ఉద్యోగులకు సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను గుర్తుచేసేందుకే ఈనెల 9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నట్లు ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. గత నాలుగేళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బొప్పరాజు మాట్లాడారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సరైన మ్యూచువల్‌ ఫండ్‌ ఎంపిక కోసం 6 టిప్స్‌!

ప్రతిఒక్కరూ తమ పెట్టుబడులు వేగంగా వృద్ధి చెంది మంచి రాబడి రావాలని ఆశిస్తారు. ఈ క్రమంలో మంచి మ్యూచువల్‌ ఫండ్‌ (Mutaul Funds)లో మదుపు చేయాలని భావిస్తారు. మరి మన లక్ష్యానికి అనుగుణంగా ప్రతిఫలం ఇచ్చే మ్యూచువల్‌ ఫండ్‌ (Mutaul Funds)ను ఎంపిక చేసుకోవడం ఎలా? ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి? చూద్దాం.. వాస్తవానికి మంచి మ్యూచువల్‌ ఫండ్‌ (Mutaul Funds) అంటూ ఏమీ ఉండదు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మీ పార్టీ గెలవని చోట పోటీ చేయగలరా?: జగన్‌కు లోకేశ్‌ సవాల్

ఏపీలో ప్రభుత్వ టెర్రరిజం నడుస్తోందని పారిశ్రామిక వేత్తలు చెప్పారని.. ప్రముఖ కంపెనీలు బైబై ఏపీ అంటున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) అన్నారు. రాష్ట్రంలో జగన్‌ (CM Jagan) ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాలు నిల్‌.. గంజాయి ఫుల్‌ అన్నట్లు పరిస్థితి తయారైందని విమర్శించారు. పీలేరులో నిర్వహించిన మీడియా సమావేశంలో లోకేశ్‌ మాట్లాడారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘ది గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ ఇండియా’.. పొడవు ఎంతో తెలుసా!

ప్రపంచంలోని ఓ వింతగా.. అతి ఎత్తయిన, పొడవైన గోడ ‘ది గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా’(The Great Wall of China) పేరుగాంచింది. అలాంటి గ్రేట్‌ వాల్‌ మన దేశంలోనూ ఒకటి ఉందంటే మీరు నమ్ముతారా! అదే పర్యాటకులు ‘ది గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ ఇండియా’గా పిలుస్తున్న కుంభాల్‌గడ్‌ కోట గోడ. కుంభాల్‌గడ్‌ కోట గోడ రాజస్థాన్‌(Rajasthan) రాష్ట్రం రాజ్‌సమంద్‌ జిల్లాలో ఉంది. ఆరావళి పర్వతాలకు(Aravalli Hills) పశ్చిమశ్రేణిలో.. దాదాపు 36 కిలోమీటర్ల చుట్టుకొలతతో ఉంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘ఎన్టీఆర్‌ 30’లో హీరోయిన్‌గా జాన్వీకపూర్‌.. నెరవేరిన నటి కల

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (NTR) కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. NTR 30వ ప్రాజెక్ట్‌గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో కథానాయికను చిత్రబృందం తాజాగా పరిచయం చేసింది. శ్రీదేవి (Sridevi) పెద్ద కుమార్తె, బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) ఇందులో ఎన్టీఆర్‌ సరసన హీరోయిన్‌గా కనిపించనుందని ప్రకటించింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. విదేశాల్లో భారత్‌ పరువు తీసింది మోదీనే.. నేను కాదు..!

భారత్‌ గురించి ప్రపంచమంతా కీర్తిస్తుంటే.. ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ((Rahul Gandhi) విదేశీ గడ్డపై దేశాన్ని అవమానించేలా మాట్లాడుతున్నారంటూ భాజపా(BJP) నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమలం నేతలనుంచి వచ్చిన ఈ విమర్శలను రాహుల్ తిప్పికొట్టారు. ‘నాకు గుర్తున్నాయ్‌’ అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘ప్రాజెక్ట్‌ కె’ షూట్‌.. అమితాబ్‌కు గాయం

బాలీవుడ్‌ అగ్ర నటుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitab Bachchan) గాయపడ్డారు. ‘ప్రాజెక్ట్‌ కె’ (Project K) షూట్‌లో ఆయనకు దెబ్బలు తగిలాయి. ఈ విషయాన్ని తన బ్లాగ్‌ వేదికగా బిగ్‌బీ తెలియజేశారు. గాయం కారణంగా తాను పాల్గొనాల్సిన షూట్స్‌ అన్నింటినీ వాయిదా వేసుకున్నట్లు చెప్పారు. ఈ వీకెండ్‌లో అభిమానులను కలవలేకపోతున్నానని వెల్లడించారు. ‘‘ప్రాజెక్ట్‌ కె’ (Project K) షూట్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన షెడ్యూల్‌లో నేను గాయపడ్డాను..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. యూపీలో ‘సాక్షి హత్య’ కేసు ప్రకంపనలు.. మరో నిందితుడి ఎన్‌కౌంటర్‌

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో సంచలనం రేపిన ఉమేశ్‌ పాల్‌ (Umesh Pal) హత్య కేసులో మరో నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. సోమవారం తెల్లవారుజామున ప్రయాగ్‌రాజ్‌లోని కౌంధియారా పోలీసు స్టేషన్‌లో నిందితుడు విజయ్‌ అలియాస్‌ ఉస్మాన్‌ను ఎన్‌కౌంటర్‌ (Encounter)లో కాల్చి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఉమేశ్‌ పాల్‌పై కాల్పులు జరిపిన ఆరుగురు షార్ప్‌ షూటర్లలో ఉస్మాన్‌ ఒకడు. ఇతడే నేరుగా ఉమేశ్‌ను కాల్చాడని పోలీసులు వెల్లడించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నాలుగో టెస్టులో భారత్‌ గెలవచ్చు.. కానీ.. : గావస్కర్‌

 బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ(Border-Gavaskar Trophy ) నేపథ్యంలో పిచ్‌(pitch)లపై విపరీతంగా చర్చ జరుగుతోంది. మూడో టెస్టు జరిగిన ఇందౌర్‌ పిచ్‌కు ఐసీసీ(ICC) ‘పేలవం’ రేటింగ్‌తో మూడు డీమెరిట్‌ పాయింట్లు ఇచ్చింది. దీనిపై మాజీ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌(Sunil Gavaskar) మండిపడిన విషయం తెలిసిందే. దీంతో అహ్మదాబాద్‌ వేదికగా జరిగే నాలుగో టెస్టు పిచ్‌ ఎలా ఉంటుందనే విషయంపై అందరి దృష్టి నెలకొంది. ఈ నేపథ్యంలో గావస్కర్‌ పిచ్‌లపై మరోసారి స్పందించాడు. సమతుల్య పిచ్‌లు ఉండాల్సిన అవసరముందని సూచించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని