Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 07 Mar 2023 13:09 IST

1. మరికొద్ది గంటల్లో ఆకాశంలో ఉత్కంఠ దృశ్యం.. 

చైనా ఉపగ్రహాలు తరచూ కక్ష్య నుంచి అదుపుతప్పి భూవాతవరణంలోకి దూసుకొచ్చిన ఘటనలు ఈ మధ్య కాలంలో తరచూ చూస్తూనే ఉన్నాం. చైనా ఉపగ్రహ శకలాలు ప్రపంచాన్నివణికించాయి. ఈ నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. కాలం చెల్లిన తన  ఉపగ్రహాలను నియంత్రిత విధానంలో కూల్చివేయడంపై  ఇస్రో(Isro) కసరత్తు మొదలుపెట్టింది. వాస్తవానికి అంతరిక్షంలోనే ఉపగ్రహాన్ని పేల్చివేసే సామర్థ్యం భారత్‌కు ఉంది. కానీ, అలా చేస్తే వాటి శకలాలు భవిష్యత్తులో సమస్యాత్మకంగా మారతాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మీరు తల తీసేసినా.. డీఏ మాత్రం పెంచలేను..!

కరవు భత్యం(DA) పెంపు కోసం రాష్ట్ర ఉద్యోగులు చేస్తోన్న నిరసనపై పశ్చిమ బెంగాల్(West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న డీఏను పెంచేందుకు రాష్ట్రం వద్ద నిధులు లేవని వెల్లడించారు. కేంద్రంతో సమానంగా రాష్ట్రంలో కూడా డీఏను పెంచాలని ఉద్యోగులకు మద్దతుగా విపక్ష పార్టీలైన భాజపా, కాంగ్రెస్, వామపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అహ్మదాబాద్‌ టెస్టులో వారిద్దరినీ ఆడించాలి: రికీ పాంటింగ్‌

బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) భారత్ - ఆస్ట్రేలియా(IND vs AUS) జట్ల మధ్య మార్చి 9 నుంచి నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లాలంటే టీమ్‌ఇండియా (Team India)కు ఇది చాలా కీలకం. అయితే, జట్టు కూర్పుపై మాత్రం భారత మేనేజ్‌మెంట్ మల్లగుల్లాలు పడుతోంది. తొలి రెండుటెస్టుల్లో విఫలమైన కేఎల్ రాహుల్‌ను తప్పించి యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్‌కు అవకాశం కల్పించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘ఆస్కార్‌’ గెలిచిన భారతీయులు వీరే..

భారత తొలి ఆస్కార్‌ విజేతగా భాను అథైయా (Bhanu Athaiya) చరిత్ర పుటల్లో నిలిచారు. 1983లో నిర్వహించిన 55వ ఆస్కార్‌ వేడుకల్లో ఆమె ఆ పురస్కారం స్వీకరించారు. 1982లో విడుదలైన ‘గాంధీ’ సినిమాకిగానూ బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌ విభాగంలో ఆ ప్రతిష్ఠాత్మక అవార్డును ఆమె అందుకున్నారు. జాతిపిత మహాత్మ గాంధీ జీవితాధారంగా తెరకెక్కిన ఆంగ్ల చిత్రమది. దర్శకుడు సహా ఎక్కువమంది ఇంగ్లాండ్‌ వారు ఈ సినిమాకి పని చేశారు. భానుతోపాటు కొందరు భారతీయులు ఆ ప్రాజెక్టులో భాగమయ్యారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్‌ తీయబోయి..!

విమానం (Flight)లో ప్రయాణికులు అభ్యంతరకరంగా ప్రవర్తించడం, అడ్డుకున్న సిబ్బందిపై దాడికి పాల్పడుతున్న ఘటనలు ఇటీవల తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అమెరికా (US)కు చెందిన విమానంలో ఓ ప్రయాణికుడు వీరంగం సృష్టించాడు. విమానం గాల్లో ఉండగా అత్యవసర ద్వారాన్ని (emergency door) తెరిచేందుకు యత్నించాడు. వద్దని చెప్పినందుకు సిబ్బందిపై ఏకంగా దాడికి పాల్పడ్డాడు. లాస్‌ఏంజిల్స్‌ నుంచి బోస్టన్‌ వెళ్తున్న యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్ (United Airlines) విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారుల కథనం ప్రకారం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మెటాలో మరోసారి భారీగా ఉద్యోగుల తొలగింపు?

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మాతృసంస్థ మెటా (Meta) మరింత మంది ఉద్యోగులను తొలగించే (Layoffs) యోచనలో ఉన్నట్లు సమాచారం. బహుశా వచ్చే వారంలోనే సదరు ఉద్యోగులకు సమాచారాన్ని అందజేసే అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. నవంబరులోనే మెటా (Meta) 11,000 మందిని తొలగించిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సంతోషం కోసం వింత నిర్ణయం!

డబ్బుకు లోకం దాసోహం అంటారు. ఆధునిక ప్రపంచం మొత్తం డబ్బు(Money) చుట్టూ తిరుగుతోంది. ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సంపాదిస్తూ వచ్చిన ఆదాయాన్ని ఖర్చు చేస్తున్నారు. అలా ఖర్చు చేసే  మొత్తంలో మెజారిటీ వాటా చాలా మంది ఇంటి అద్దె చెల్లించడానికే (house rent)వెచ్చిస్తున్నారు. ఈ విధానంపై ఓ వ్యక్తికి విసుగుపుట్టింది. అంతే.. డబ్బు, ఇల్లు లేకుండా ఓ గుహలో 16ఏళ్లు జీవనం సాగించాడు. అదెలా సాధ్యమైందో తెలుసుకుందాం పదండి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఫోన్‌లో బెదిరింపులు.. ఎంపీ కోమటిరెడ్డిపై కేసు

భువనగిరి ఎంపీ, కాంగ్రెస్‌ (Congress) సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komatireddy)పై కేసు నమోదైంది. ఇటీవల టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ కుమారుడు సుహాస్‌ను ఫోన్‌లో కోమటిరెడ్డి బెదిరించినట్లు ఆడియో క్లిప్‌ కలకలం రేపిన సంగతి తెలిసిందే. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో తనకు ప్రాణహాని ఉందంటూ సుహాస్‌ నల్గొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నా మాటలు వెనక్కి తీసుకోను.. కానీ ఆ విషయంలో మాత్రం క్షమించండి: వెంకటేశ్ మహా

టాలీవుడ్‌ దర్శకుడు వెంకటేశ్‌ మహా (Venkatesh Maha) ‘కేజీయఫ్‌’ (KGF) సినిమాను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై నెటిజన్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తన వ్యాఖ్యలపై మహా స్పందించారు. తన మాటలను వెనక్కి తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ‘‘నేను తాజాగా చేసిన వ్యాఖ్యలు చాలా మందికి అభ్యంతరకరంగా అనిపించాయి. నేను ఇప్పటికీ ఆ మాటలను వెనక్కి తీసుకోవడంలేదు..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. దిల్లీ మద్యం కేసు..అరుణ్ రామచంద్ర పిళ్లై అరెస్ట్

దిల్లీ మద్యం కేసులో మరొకరు అరెస్టయ్యారు. హైదరాబాద్‌కు చెందిన అరుణ్‌ రామచంద్ర పిళ్లైని సోమవారం అదుపులోకి తీసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ).. రాత్రి 11 గంటల సమయంలో అరెస్టు చేసినట్లు తెలిపింది. ఈ మేరకు ఈడీ అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని ఈడీ అరెస్టు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు