Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. ఫ్లూతో మరణాలు.. కర్ణాటక, హరియాణాలో ఇద్దరు మృతి..!
కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్న వేళ.. దేశంలో ఇన్‌ఫ్లుయెంజా (Influenza) వైరస్ వ్యాప్తి కలవరపెడుతోంది. గత రెండు, మూడు నెలలుగా ఈ ఫ్లూ కేసులు విపరీతంగా పెరుగుతుండగా తాజాగా మరణాలు కూడా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ‘ఇన్‌ఫ్లుయెంజా ఏ (Influenza A)’ ఉప రకమైన ‘హెచ్2ఎన్2 (H3N2)’ అనే వైరస్ కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు చెందిన ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. హరియాణా, కర్ణాటక ఒక్కొక్కరు చొప్పున ఈ వైరస్ లక్షణాలతో మరణించినట్లు పేర్కొన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. జిన్‌పింగ్ మూడోసారి ‘కింగ్’.. చైనా అధ్యక్షుడి సరికొత్త చరిత్ర
చైనా (China) అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్ (Xi Jinping) సరికొత్త చరిత్ర లిఖించారు. ముచ్చటగా మూడోసారి దేశాధ్యక్ష పదవిని చేపట్టారు. మరో ఐదేళ్ల పాటు జిన్‌పింగ్‌కు అధ్యక్ష (President) బాధ్యతలు అప్పగిస్తూ చైనా పార్లమెంట్ శుక్రవారం ఆమోదముద్ర వేసింది. దీంతో డ్రాగన్ దేశానికి ఆయన జీవితకాల అధినాయకుడిగా ఉండేందుకు మార్గం లభించినట్లైంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ఆస్కార్ వేదికపై డ్యాన్స్ చేయకపోవడానికి కారణమిదే: ఎన్టీఆర్
ప్రస్తుతం ఎన్టీఆర్ (NTR) అమెరికాలో సందడి చేస్తున్నారు. ఆస్కార్ (Oscar) వేడుకకు హాజరయ్యేందుకు లాస్ ఏంజిల్స్ చేరుకున్న తారక్.. అక్కడ అభిమానులతో ముచ్చటిస్తున్నారు. అలాగే అక్కడి మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ జోష్ నింపుతున్నారు. ఇక తమ అభిమాన హీరోలు ఆస్కార్ వేడుకలో రెడ్ కార్పెట్‌పై నడిచే రోజు కోసం సినీప్రియులంతా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓ విదేశీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘ఆర్‌ఆర్‌ఆర్’ ( RRR) టీం రెడ్ కార్పెట్‌పై నడవడం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. టాటా గ్రూప్ నుంచి బిగ్ అప్‌డేట్.. 18 ఏళ్ల తర్వాత ఐపీఓ!
టాటా మోటార్స్ (TATA Motors) అనుబంధ సంస్థ టాటా టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ (Tata Technologies IPO)కు రాబోతోంది. ఈ మేరకు సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించింది. టాటా మోటార్స్ (TATA Motors) సహా మరో ఇద్దరు ఇన్వెస్టర్లు 23.6 శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధమయ్యారు. 2004లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ను పబ్లిక్ ఇష్యూకు తెచ్చిన టాటా గ్రూప్ (TATA Group).. 18 ఏళ్ల తర్వాత మళ్లీ మరో సంస్థను ఐపీఓకు తీసుకొస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. మహిళా బిల్లుపై భాజపా ముందుకొస్తే అన్ని పార్టీలూ మద్దతిస్తాయి: ఎమ్మెల్సీ కవిత
రాజకీయాల్లోనూ మహిళలకు సముచిత స్థానం దక్కాలని భారత్ జాగృతి అధ్యక్షురాలు, భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు చాలాకాలంగా పెండింగ్‌లో ఉందని.. దాన్ని ఆమోదించి చట్టంగా తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలో కవిత మాట్లాడారు. ధరణిలో సగం.. ఆకాశంలో సగం.. అవకాశంలోనూ సగం కావాలంటూ ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. నరేశ్ - పవిత్రల పెళ్లి వీడియో.. ప్రచారమా..? నిజమా..?
సీనియర్ నటుడు నరేశ్ (Naresh) శుక్రవారం ఉదయం విడుదల చేసిన ఓ స్పెషల్ వీడియో తీవ్ర చర్చకు దారితీసింది. అందులో తన స్నేహితురాలు పవిత్రా లోకేశ్‌తో ఆయన ఏడడుగులు వేస్తూ కనిపించారు. ‘‘శాంతి, సంతోషాలతో కూడిన మా నూతన ప్రయాణానికి మీ ఆశీస్సులు కోరుతున్నాను. ఒక పవిత్ర బంధం.. రెండు మనసులు.. మూడు మూళ్లు.. ఏడడుగులు.. మీ ఆశీస్సులు కోరుకుంటూ మీ పవిత్రా నరేశ్’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. రవి అస్తమించలేదు...సామ్రాజ్యం నామమాత్రంగా మిగిలింది..
దాదాపు నాలుగు శతాబ్దాలు ప్రపంచ రాజకీయాలను వారే శాసించారు.. అనేక దేశాలకు తమ పాలనను విస్తరించారు.. భారీ సైనిక శక్తిగా ఎదిగారు.. వారు స్వాధీనం చేసుకున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి.. అంతటి అజేయశక్తిగా పేరొందిన ఇంగ్లాండ్ నేడు కేవలం నాలుగు దీవులకే పరిమితమైందంటే కాలవైచిత్రి కాక మరేమిటి? రవి అస్తమించని సామ్రాజ్యంగా ప్రసిద్ధమై ఇతర ఐరోపా శక్తులను అవలీలగా ఎదుర్కొని అనేక దేశాల్లో వలస పాలనను ఏర్పాటు చేసిన ఇంగ్లాండ్ నేడు చిన్నదేశంగా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. మా నిజాయతీపై అనుమానం అక్కర్లేదు.. ఆసీస్ మీడియాపై మండిపడ్డ గావస్కర్
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (Border Gavaskar Trophy)లో ఆట కంటే పిచ్‌ల గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. ఈ పిచ్‌లపై ఆస్ట్రేలియా మీడియా వ్యవహరిస్తున్న తీరుపై మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) అసంతృప్తి వ్యక్తం చేశాడు. అలాగే.. కొంత మంది మాజీ ఆటగాళ్లు చేస్తున్న వ్యాఖ్యలు కూడా సరిగా లేవంటూ విమర్శించాడు. ఈ సిరీస్ (IND vs AUS Test Series) ప్రారంభం కాక ముందు నుంచే పలువురు ఆసీస్ మాజీలు పిచ్‌లపై అక్కసు వెళ్లగక్కారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. జెలెన్‌స్కీకి ఆస్కార్ షాక్..!
ఉక్రెయిన్(Ukraine)పై రష్యా దురాక్రమణ ప్రారంభించిన దగ్గరి నుంచి ఆ దాడి గురించి అంతర్జాతీయ వేదికలపై వినిపిస్తున్నారు వొలొదిమిర్ జెలెన్‌స్కీ( Volodymyr Zelenskyy). అయితే ప్రతిష్ఠాత్మక ఆస్కార్ వేదికపై తమ దేశం ఎదుర్కొంటోన్న క్లిష్టపరిస్థితులను ఇంకా ఎక్కువ మంది దృష్టికి తీసుకెళ్లాలనుకున్నారు. కానీ ఆయన కల మాత్రం నెరవేరేలా కనిపించడం లేదు. ఈ విషయంలో ఆస్కార్ నిర్వాహకుల నుంచి ఉక్రెయిన్ అధ్యక్షుడికి షాక్ తగిలింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం.. కొత్త తేదీ ఖరారు
తెలంగాణ నూతన సచివాలయ భవనం (TS Secretariat) ప్రారంభోత్సవానికి కొత్త తేదీ ఖరారైంది. ఏప్రిల్ 30న దీన్ని ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నూతనంగా నిర్మించిన సచివాలయానికి డా.బి.ఆర్. అంబేడ్కర్ పేరును పెట్టిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 17నే సచివాలయ భవనాన్ని ప్రారంభించాలని తొలుత భావించినా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయింది. దీంతో తాజాగా కొత్త తేదీని నిర్ణయించారు. మరోవైపు జూన్ 2న తెలంగాణ అమరవీరుల స్మారకాన్ని ప్రారంభించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Manisha Koirala: ఆ సినిమా భారీ వైఫల్యంతో నా కెరీర్ ముగిసిపోయింది: మనీషా
-
Crime News
Temple Tragedy: ఆలయంలో మెట్లబావి ఘటన.. 35కి చేరిన మృతులు
-
Crime News
సర్ప్రైజ్ గిఫ్ట్.. కళ్లు మూసుకో అని చెప్పి కత్తితో పొడిచి చంపారు!
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Couple Suicide: నిస్సహాయ స్థితిలో దంపతుల ఆత్మహత్య!
-
Politics News
EC: వయనాడ్ ఖర్చులు సమర్పించని ‘రాహుల్’పై ఈసీ వేటు!