Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 20 Mar 2023 13:11 IST

1. ప్రకటనల స్థానంలో పోర్న్‌ క్లిప్‌.. మండిపడిన ప్రయాణికులు.. రైల్వే స్టేషన్‌లో ఘటన

రైలు(Train) కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఆగ్రహంతో ఊగిపోయారు. బిహార్‌(Bihar)లోని పట్నా రైల్వే స్టేషన్‌లో ఉన్న టీవీల్లో ఒక్కసారిగా పోర్న్‌ దృశ్యాలు ప్రసారం కావడం వారి మండిపాటుకు కారణం. ప్రకటనలు రావాల్సిన స్థానంలో ఆదివారం ఉదయం ఆ అసభ్యకర దృశ్యాలు మూడు నిమిషాలు ప్రసారం అయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. జగన్‌ ప్రోద్బలంతోనే సభలో మా ఎమ్మెల్యేలపై దాడి: చంద్రబాబు

అసెంబ్లీలో  తమ పార్టీ ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. శాసనసభలో ఎమ్మెల్యేపై దాడి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. ‘‘అసెంబ్లీ చరిత్రలో ఇవాళ చీకటిరోజు. సీఎం జగన్‌ ప్రోద్బలంతోనే దళిత సభ్యుడు డోలా బాల వీరాజంనేయ స్వామిపై దాడి చేశారు. చట్టసభలకు మచ్చ తెచ్చిన వ్యక్తిగా జగన్‌ నిలిచిపోతారు. వైకాపా సిద్ధాంతమేంటో ప్రజలకు పూర్తిగా అర్థమైంది. ఇది శాసనసభ కాదు.. కౌరవ సభ’’ అని చంద్రబాబు అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఆయన విపక్షాలను నడిపిస్తే.. మోదీని ఎదుర్కోలేం..!

ఇటీవల దేశంలో కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పేరు విపరీతంగా వినిపిస్తోంది. విదేశీ గడ్డపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను భాజపా తీవ్రంగా ఖండిస్తుండగా.. తాజాగా పశ్చిమ్ బెంగాల్(West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) ఆయన్నుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ విపక్షాలను నడిపిస్తే.. ప్రధాని మోదీని ఎవరూ అడ్డుకోలేరని ఆమె వ్యాఖ్యానించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఉగాది స్పెషల్‌.. ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!

గతవారం, అంతకుముందు వారం విడుదలైన సినిమాలు థియేటర్లలో సందడి చేస్తూనే ఉన్నాయి. మరోవైపు, ‘ఉగాది’ని పురస్కరించుకుని పలు చిత్రాలు ఈ బుధవారం ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యాయి. కొన్ని థియేటర్ల వేదికగా.. మరికొన్ని ఓటీటీ వేదికగా అలరించనున్నాయి. థియేటర్లు: విశ్వక్‌సేన్‌ ‘దాస్‌ కా ధమ్కీ’, ‘రంగమార్తాండ’, కాజల్‌ అగర్వాల్‌ ‘కోస్టి’, ‘గీతసాక్షిగా’. ఓటీటీ: పంచతంత్రం(ఈటీవీ విన్‌), వినరో భాగ్యము విష్ణుకథ(ఆహా), అమెరికన్‌ అపోకలిప్స్‌(నెట్‌ఫ్లిక్స్‌). పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. క్రెడిట్‌ సూయిజ్‌ పతనానికి ‘యూబీఎస్‌’తో విరుగుడు!

ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న స్విట్జర్లాండ్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ సూయిజ్‌ (Credit Suisse)ను కొనుగోలు చేసేందుకు ఆ దేశంలోని దిగ్గజ బ్యాంకు యూబీఎస్‌ ముందుకు వచ్చింది. ఈ కొనుగోలు ఒప్పందం విలువ 3.2 బిలియన్‌ డాలర్లు. ఈ పరిణామంతో అంతర్జాతీయంగా బ్యాంకింగ్‌ వ్యవస్థలో వస్తోన్న ఆందోళనలకు తెరపడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అమృత్‌పాల్‌కు దుబాయ్‌లో బ్రెయిన్‌వాష్‌.. జార్జియాలో శిక్షణ..!

ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌(Amritpal Singh) దేశం విడిచి పారిపోయేందుకు తీవ్రంగా యత్నిస్తున్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు అనుమానిస్తున్నాయి. అతడు నేపాల్‌ మీదుగా కెనడా పారిపోయే అవకాశాలున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ‘వారిస్‌ పంజాబ్‌ దే’ నేత కోసం భద్రతా దళాలు పంజాబ్‌ను జల్లెడ పడుతున్నాయి. గతంలో  చాలా కాలం దుబాయ్‌లో ఉన్న అమృత్‌పాల్‌కు అక్కడే పాకిస్థానీ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ ఐఎస్‌ఐతో పరిచయాలు ఏర్పడ్డాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘సూర్య’ ప్రతాపం టీ20లకేనా?.. SKYని డీకోడ్‌ చేసేశారా?

టీ20ల్లో ఆడటం చాలా కష్టం.. ఈ పొట్టి క్రికెట్‌లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాంటి చోట అదరగొడుతున్న సూర్య కుమార్‌ యాదవ్‌.. వన్డేల్లోకి వచ్చేసరికి ఇబ్బంది పడుతున్నాడు. మెరుపుల సంగతి పక్కన పెడితే.. కనీసం పరుగులు రావడం లేదు. దీంతో SKYకి ఏమైంది అనే చర్చ మొదలైంది! సూర్య కుమార్‌ యాదవ్‌..  టీ20ల్లో అదరగొడుతుంటే.. ‘ఇన్నాళ్లూ ఈ మెరికలాంటి ప్లేయర్‌ను ఎందుకు జట్టులోకి తీసుకోలేదు’ అనే ప్రశ్న వినిపించింది. ఆ తర్వాత ‘ఇప్పటికే ఆలస్యమైంది వన్డేలు, టెస్టుల్లోకి వెంటనే తీసుకోండి’ అని కూడా అన్నారు. అయితే ఇప్పుడు సూర్య వన్డేలకు సరిపోడా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌.. కంగన కామెంట్‌

ఓ ప్రేమ వ్యవహారాన్ని ఉద్దేశిస్తూ ట్విటర్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌ పెట్టిన పోస్ట్‌పై బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut) స్పందించారు. ప్రేమలో తనకు ఎదురైన ఇబ్బందులను వెల్లడించారు. సినిమా మాఫియా తనని జైలుకు పంపాలని చూసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ‘‘ప్రభుత్వాన్ని కూల్చకుండా అడ్డుకునేందుకు సీఏఐ పంపిన నకిలీ వ్యక్తి అని తెలిసినా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. దమ్ముంటే సభలో జరిగిన పరిణామాలపై వీడియోలను బయటపెట్టాలి: తెదేపా ఎమ్మెల్యేలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో వైకాపాలో పిచ్చి పరాకాష్ఠకు చేరిందని తెదేపా ఎమ్మెల్యేలు విమర్శించారు. అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్మెల్యేలు డోలా బాల వీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్యచౌదరిపై జరిగిన దాడి ఘటనలను వారు. తీవ్రంగా ఖండించారు. సభ వాయిదా అనంతరం డోలా బాల వీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్యచౌదరితో పాటు మిగిలిన తెదేపా ఎమ్మెల్యేలు బెందాళం అశోక్‌, ఏలూరి సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వానికి దమ్ముంటే సభలో జరిగిన పరిణామాలపై వీడియోలను బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ధోనీ బటర్‌ చికెన్‌ ఎలా తింటాడంటే.. ఆసక్తికర విషయాలు చెప్పిన ఉతప్ప

మహేంద్ర సింగ్‌ ధోనీ.. ఫిట్‌నెస్‌ కోసం ఎంత కష్టపడతాడో తెలిసిందే. 41 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌గా ఉండేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాడు. ఈ ఐపీఎల్‌(IPL) సీజన్‌ కోసం ధోనీ చెపాక్‌ స్టేడియంలో ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోలు ఇప్పటికే సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. కాగా.. టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ రాబిన్‌ ఉతప్ప.. ధోనీ ఆహారపు అలవాట్లకు సంబంధించిన ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. బటర్‌ చికెన్‌ను ఆర్డర్‌ చేసి.. దానిని ఎలా తినేవాడో వివరించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని