Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 23 Mar 2023 13:21 IST

1. రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష

ఓ పరువునష్టం కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)ని సూరత్‌ కోర్టు దోషిగా తేల్చింది. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఆ వెంటనే ఆయనకు బెయిల్‌ కూడా మంజూరు చేసింది. ‘మోదీ ఇంటి పేరు ఉన్నవారంతా దొంగలే’ అంటూ 2019లో రాహుల్‌ గాంధీ కర్ణాటకలో జరిగిన ఓ సభలో వ్యాఖ్యానించారు. దీనిపై గుజరాత్‌కు చెందిన ఓ భాజపా ఎమ్మెల్యే న్యాయస్థానాన్ని ఆశ్రయించి.. పరువు నష్టం దావా వేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌.. ఓటేసిన సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటాలోని ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ ప్రక్రియ మొదలైంది. తెదేపా నుంచి పంచుమర్తి అనురాధ, వైకాపా నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒక్కో అభ్యర్థి విజయానికి అవసరమైన 22 మంది ఎమ్మెల్యేలను ఒక బృందంగా ఏర్పాటు చేసిన అధికార వైకాపా.. వారితో ఓట్లు వేయిస్తోంది. ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 5 గంటల తరువాత ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అలా చేస్తే వైకాపా పెద్ద తప్పు చేసినట్లే.. తన రాజీనామా ఆమోదంపై గంటా క్లారిటీ

తన రాజీనామాను స్పీకర్‌ ఆమోదించారంటూ గత రాత్రి నుంచి జరుగుతున్న ప్రచారం పూర్తిగా వైకాపా మైండ్ గేమ్ మాత్రమేనని తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ విషయంపై తనకు ఎలాంటి అధికారిక సమాచారం లేదన్నారు. తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికే తన రాజీనామాను అమోదించారనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెదేపాలో ఓ ఎమ్మెల్యే ఓటు వేయలేకపోతున్నారనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అశ్లీల సందేశాలు.. పాక్‌ నుంచి ఆయుధాలు.. అమృత్‌పాల్‌ నేరాల చిట్టా..!

ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌(Amritpal Singh) కోసం పోలీసులు వేటను కొనసాగిస్తున్నారు. అలాగే అతడి గత చరిత్రను మొత్తం తవ్వితీస్తున్నారు. అతడి దేశ వ్యతిరేక అజెండాను కూడా ఇంటెలిజెన్స్‌ వర్గాలు బట్టబయలు చేసేపనిలో ఉన్నాయి. తరచూ ఖలిస్థాన్‌ గురించి మాట్లాడే అమృత్‌పాల్‌(Amritpal Singh)కు చాలా మంది మహిళలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. వీటికి సంబంధించి మహిళలతో ఛాటింగ్‌లు, వాయిస్‌నోట్‌లు వెలుగులోకి వస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. యంగ్‌ టైగర్‌ కొత్త సినిమా షురూ.. బ్యాక్‌డ్రాప్‌ చెప్పేసిన కొరటాల శివ

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (NTR) కొత్త సినిమా మొదలైంది. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పూజా కార్యక్రమం గురువారం ఉదయం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌, కొరటాల శివ, జాన్వీకపూర్‌, ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్‌, సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు, సంగీత దర్శకుడు అనిరుధ్‌, నిర్మాత కల్యాణ్‌ రామ్‌ తదితరులు సందడి చేశారు. దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. టిప్పు సుల్తాన్‌పై రగులుకొన్న రాజకీయం

కర్ణాటక (Karnataka)లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అలనాటి మైసూర్‌ పాలకుడు టిప్పు సుల్తాన్‌పై మరోసారి భాజపా (BJP) నాయకులు వివాదాస్పదనమైన ప్రకటన చేశారు. ఆ పార్టీ జాతీయ సెక్రటరీ సి.టి.రవి ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ.. తాను టిప్పు సుల్తాన్‌ సమయంలో పుట్టి ఉంటే ఊరి గౌడ, నంజే గౌడలా తిరుగుబాటు చేసేవాడినని పేర్కొన్నారు. పాత మైసూర్‌ ప్రాంతంలోని  కొన్ని వర్గాలు, భాజపా నాయకులు ఈ ప్రకటనకు మద్దతుగా నిలిచాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. త్రివిక్రమ్‌తో సినిమాపై నాని ఆసక్తికర కామెంట్స్‌

 శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నాని నటించిన సినిమా ‘దసరా’. ఈ చిత్రంలో నాని (Nani ) పూర్తి మాస్‌ లుక్‌లో కనిపించనున్నాడు. ఈ ట్రైలర్‌ విడుదలైనప్పటి నుంచి నాని లుక్‌పై ఎన్నో కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.  ‘పుష్ప’, ‘కేజీయఫ్‌’ సినిమాల్లో హీరోల లుక్స్‌తో పోలుస్తున్నారు. తాజాగా దీనిపై నాని స్పందించాడు. ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘దసరా’ గురించి వివరించాడు. దసరా సినిమాకు ఆ రెండు సినిమాలకు చాలా తేడా ఉందని చెప్పాడు. అలాగే త్రివిక్రమ్‌తో సినిమా పై ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఏప్రిల్‌ నుంచి అమల్లోకి బీఎస్‌ 6 కొత్త నిబంధనలు.. ఏమేం మారుతాయ్‌!

వాహనాలు విడుదల చేసే కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు రెండేళ్ల క్రితం బీఎస్‌ 6 ప్రమాణాలను ప్రభుత్వం అమలుచేసింది. ఆ సమయంలో బీఎస్‌ 4 వాహనాలను చౌకగా విక్రయించిన విషయం గుర్తుండే ఉంటుంది. తాజాగా కేంద్రం ఏప్రిల్‌ నుంచి బీఎస్‌ 6 రెండో దశ (BS 6 Phase II)ను అమలు చేయనుంది. బీఎస్‌ 6 2.0గా పిలిచే ఈ దశలో ఆటోమొబైల్‌ తయారీ కంపెనీలు రియల్‌ డ్రైవింగ్ ఎమిషన్‌ (RDE) ప్రమాణాలను తప్పక పాటించాలి. ఇంతకీ ఆర్‌డీఈ అంటే ఏంటి? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మూడుసార్లు గోల్డెన్‌ డక్.. సూర్యకుమార్‌ పేరిట ఓ చెత్త రికార్డు

టీ20ల్లో నంబర్‌వన్‌ బ్యాటర్‌గా ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) వన్డేల్లో వరుసగా విఫలమవుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అతడి ఆటతీరు మరీ పేలవంగా ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ ఆడిన తొలి బంతికే సూర్య గోల్డెన్‌ డక్‌ (Golden Duck)గా వెనుదిరిగాడు. తొలి రెండు వన్డేల్లో స్టార్క్‌ బౌలింగ్‌లో ఒకే విధంగా వికెట్ల ముందు దొరికిపోయిన సూర్య.. మూడో మ్యాచ్‌లో అగర్‌ బంతిని అర్థం చేసుకోలేక క్లీన్‌ బౌల్డయ్యాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. జీవిత బీమా విషయంలో 5 అపోహలు.. మీకూ ఉన్నాయా?

సాఫీగా సాగిపోతున్న జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఇంట్లో సంపాదించే వ్యక్తికి ఏదైనా జరగరానిది జరిగితే ఇంటిల్లిపాదీ ఆర్థికంగా ఇబ్బంది పడాలి. అప్పటి వరకు ఎంతో హుందాగా జీవితం సాగించిన ఆ కుటుంబం ఆదాయం కోల్పోయి కష్టాల్లో పడాల్సి వస్తుంది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు జీవిత బీమా (Life Insurance) ఉపయోగపడుతుంది. అంతేకాదు పిల్లల చదువులు, వివాహాలు వంటి పెద్ద పెద్ద అవసరాలను సైతం తీరుస్తాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు