Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 25 Mar 2023 13:08 IST

1. రాహుల్‌పై అనర్హత వేళ.. సుప్రీంలో కీలక పిటిషన్‌

కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)పై అనర్హత వేళ సుప్రీంకోర్టు (Supreme Court)లో కీలక పిటిషన్‌ దాఖలైంది. దోషిగా తేలిన ఎంపీ, ఎమ్మెల్యేలను ఆటోమేటిక్‌గా అనర్హులు (disqualification)గా ప్రకటించడాన్ని సవాల్‌ చేస్తూ సామాజిక కార్యకర్త అభా మురళీధరన్‌ సర్వోన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8(3) రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నిస్తూ ఈ పిటిషన్ వేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ కేసులో మరొకరిని అదుపులోకి తీసుకున్న సిట్‌..

టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ కేసులో మరొకరిని సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట్ ఉపాధి హామీ విభాగంలో పని చేసే ఉద్యోగి ప్రశాంత్‌ను సిట్‌ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.పేపర్ కొనుగోలు చేసి అతడు పరీక్ష రాసినట్లు గుర్తించారు. రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన కీలక సమాచారంతో ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. రాజశేఖర్ రెడ్డికి బావ అయిన ప్రశాంత్‌.. గ్రూప్ వన్ పరీక్ష రాసి 100కు పైగా మార్కులు తెచ్చుకున్నట్లు సిట్‌ ఆధారాలు సేకరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. 2024లో రాజకీయ సునామీ.. వైకాపా శాశ్వతంగా డిస్మిస్‌ అవుతుంది : కోటంరెడ్డి

చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని వైకాపా నుంచి సస్పెండ్ అయిన నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  అన్నారు. కొందరు బహిరంగంగానే బయటకు వస్తున్నారని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ‘వైకాపాలో చాలా మంది లోపల ఉడికిపోతున్నారు. మరో పార్టీ కోసం ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు 2024 ఎన్నికల కోసం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రాహుల్ చెప్పినట్లే.. కుమారుడి స్థానం నుంచి సిద్ధరామయ్య పోటీ

పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడిన కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)పై అనర్హత వేటు (Disqualification) వేయడం దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. కేంద్రం తీరుపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఈ పరిణామాల అనంతరం రాహుల్‌ గాంధీ తొలిసారిగా నేడు మీడియా ముందుకు రానున్నారు. శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రత్యేక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ నేడు ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘ఇందుకోసమా మా తాత జైలుకెళ్లింది..?’: రాహుల్‌ అనర్హతపై యూఎస్‌ చట్టసభ్యుడు

కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడటంతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాగా ఈ పరిణామాలపై భారత అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు రో ఖన్నా (Ro Khanna) స్పందించారు. ట్విటర్ వేదికగా ఈ అనర్హత వేటును ఖండించారు. ‘రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌ సభ్యత్వంపై వేటు వేయడం.. గాంధీ సిద్ధాంతాలకు, భారత దేశ విలువలకు తీవ్ర ద్రోహం చేయడమే అవుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సినీ పరిశ్రమలో ఉన్న నిజమైన సమస్య ఇదే.. ‘వరుడు’ హీరోయిన్‌ కామెంట్స్‌

వయసు అనేది సినీ పరిశ్రమలో ఉన్న అతి పెద్ద సమస్య అని నటి భానుశ్రీ మెహ్రా (Bhanushree Mehra) అన్నారు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆమె తాజాగా ట్వీట్‌ చేశారు. ‘‘వయసు.. సినిమా పరిశ్రమలో ఉన్న నిజమైన సమస్య. ఒక వయసు వచ్చిన తర్వాత స్త్రీలను కేవలం తల్లి పాత్రలకే పరిమితం చేస్తారు. పురుషులకు వచ్చేసరికి అది వర్తించదు. వాళ్లు ఎప్పటిలాగానే ప్రధాన పాత్రల్లో నటిస్తుంటారు. తమకంటే వయసులో చాలా చిన్నవారికి ప్రేమికుడిగా కనిపిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. 2019 వరల్డ్ కప్‌ సమయంలో ఇదే సమస్య ఎదురైంది: జహీర్‌ఖాన్

 ఈ ఏడాది అక్టోబర్‌- నవంబర్‌ మధ్య ప్రపంచకప్‌ జరగనుంది. ఈ మెగా ఈవెంట్‌కు భారతే ఆతిథ్యం ఇవ్వనుండటం విశేషం. 2019 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌ చేతిలో పరాజయం పాలైన టీమ్‌ఇండియా (Team India).. ఈ సారి ఎలాగైనా ఛాంపియన్‌గా నిలిచి మూడోసారి కప్‌ని ముద్దాడాలని ప్రణాళికలు రచిస్తోంది. అయితే, ప్రపంచకప్‌ సమీస్తున్న వేళ కీలక ఆటగాళ్లు గాయాల బారినపడుతుండటం టీమ్‌ఇండియాను కలవరపెడుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. తెదేపా నేత చింతకాయల విజయ్‌కు సీఐడీ నోటీసులు

తెదేపా నేత చింతకాయల విజయ్‌కు సీఐడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. సోషల్‌ మీడియాలో పోస్టుల వ్యవహారంలో మార్చి 28వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులు ఇచ్చేందుకు నర్సీపట్నంలోని ఆయన నివాసానికి సీఐడీ అధికారులు వెళ్లారు. అయితే.. విజయ్‌ ఇంట్లో అందుబాటులో లేకపోవడంతో.. ఆయన తండ్రి, తెదేపా సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడికి అందజేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పొరపాటున పేలిన మూడు క్షిపణులు..!

సైన్యం నిర్వహించిన సాధారణ కసరత్తుల్లో పొరపాటున మూడు క్షిపణులు పేలాయి. రాజస్థాన్‌ (Rajasthan) లోని జైసల్మేర్‌లో ఈ ఘటన జరిగింది. పోఖ్రాన్‌లోని ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్(Pokhran field firing range) వద్ద జరిగిన ఈ ఘటనలో సాంకేతిక లోపమే కారణమని తెలుస్తోంది. ఈ క్షిపణులు(three surface-to-air missiles) సమీప గ్రామాల్లోని పొలాల్లోకి దూసుకెళ్లాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. బండి సంజయ్‌కు మరోసారి నోటీసులు ఇచ్చిన సిట్‌..

టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఆరోపణలు చేసిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు  సిట్‌ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 26న సిట్‌ ఎదుట హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. ఇదివరకే సిట్‌ అధికారులు బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. పార్లమెంటు సమావేశాలు ఉన్నందున ఈ నెల 24న రాలేనని ఆయన సిట్ అధికారులకు లేఖ రాశారు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు