Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 26 Mar 2023 13:39 IST

1. ఓటీటీలో రికార్డు సృష్టించిన షాహిద్‌కపూర్‌ ‘ఫర్జీ’..!

ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్‌ నడుస్తోంది. సినిమాలకు దీటుగా వెబ్‌సిరీస్‌లు అలరిస్తున్నాయి. ప్రేక్షకుల అభిరుచి కూడా మారుతోంది. కంటెంట్‌ బాగుంటే ఐదారు గంటల నిడివిగల వెబ్‌సిరీస్‌ను సైతం అలవోకగా చూసేస్తున్నారు. ఈ క్రమంలోనే షాహిద్‌ కపూర్‌ (Shahid Kapoor), విజయ్‌ సేతుపతి, రాశీఖన్నా (raashii khanna) కీలక పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ ‘ఫర్జీ’ (Farzi) రికార్డు సృష్టించింది. కేవలం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలోనే కాదు, ఇండియన్‌ ఓటీటీ వేదికల్లో అత్యధికమంది వీక్షించిన వెబ్‌సిరీస్‌గా రికార్డు సృష్టించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. నింగిలోకి దూసుకెళ్లిన ఎల్‌వీఎం-3

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఎల్‌వీఎం-3 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. శనివారం ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ ప్రక్రియ 24.30 గంటల పాటు కొనసాగింది. ఉదయం 9 గంటలకు వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను ఎల్‌వీఎం-3 వాహక నౌక తీసుకెళ్లింది. ఈ ఉపగ్రహాల బరువు 5.8 టన్నులుగా శాస్త్రవేత్తలు తెలిపారు. అనంతరం ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వాళ్లకి భజనపరులే కావాలి: ఆనం రామనారాయణరెడ్డి

గత నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నానని.. ఏనాడూ ప్రజాస్వామ్య విలువలు ఇంతలా దిగజారలేదని నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy) అన్నారు. అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు ఇలాంటి పరిస్థితి రావడం చాలా దారుణమని చెప్పారు. ఎంతో మంది పెద్ద నేతలతో పనిచేశానని.. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదన్నారు. పరోక్షంగా వైకాపా, సీఎం జగన్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆయన విమర్శలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. ‘అమృత్‌పాల్‌ పోలీసులకు లొంగిపో’.. అకాల్‌తక్త్‌ పిలుపు

సిక్కులకు పరమపవిత్రమైన ‘అకాల్‌ తక్త్‌’ నుంచి అమృత్‌పాల్‌సింగ్‌కు పిలుపు వచ్చింది. ‘వారిస్‌ పంజాబ్‌ దే’ నాయకుడు తక్షణమే పోలీసుల ఎదుట లొంగిపోవాలని ‘అకాల్‌ తక్త్‌’ జత్యేదార్‌ జ్ఞాని హర్‌ప్రీత్‌ సింగ్‌ శనివారం కోరారు. అంతేకాదు ఆయన పోలీసుల సామర్థ్యాన్ని కూడా ప్రశ్నించారు. అంతపెద్ద దళాన్ని పెట్టుకొని అసలు ఇప్పటి వరకు అమృత్‌పాల్‌ను అరెస్టు చేయకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘‘అమృత్‌పాల్‌ బయటే ఉంటే.. పోలీసుల ఎదుట హాజరై విచారణకు సహకరించాలని కోరేవాడిని’’ అని హర్‌ప్రీత్‌ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. నేను సెలక్టర్‌నైనా.. అదే పని చేసేవాణ్ని: శిఖర్ ధావన్‌

శిఖర్‌ ధావన్‌ (Shikhar Dhawan).. ఒకప్పుడు మూడు ఫార్మాట్లలో టీమ్‌ఇండియాకు కీలక ఆటగాడిగా ఉన్నాడు. రోహిత్‌ శర్మతో కలిసి ఓపెనింగ్‌ చేసిన అతడు ఎన్నో మ్యాచ్‌ల్లో దూకుడుగా ఆడి జట్టుకు విజయాలనందించాడు. ధావన్‌ నిలకడగా ఆడకపోవడంతోపాటు యువ ఆటగాళ్లు రాణిస్తుండటంతో ఈ మధ్య అతడికి జట్టులో చోటు దక్కడం లేదు. యువ ఆటగాడైన శుభ్‌మన్ గిల్‌ (Shubman Gill)కు సెలక్టర్లు అవకాశాలిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పుతిన్ కీలక నిర్ణయం.. బెలారస్‌లో అణ్వాయుధాల మోహరింపు

బెలారస్‌లో వ్యూహాత్మక అణ్వాయుధాలను ఉంచే యోచనలో ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ (Putin) తెలిపారు. ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో పాశ్చాత్య దేశాలతో రష్యాకు ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలుసార్లు పుతిన్‌ అణ్వస్త్ర ప్రయోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజా హెచ్చరిక కూడా అందులో భాగంగానే కనిపిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. విరాట్‌ ‘జెర్సీ నంబరు 18’ వెనుక.. కన్నీటి కథ

టీమ్‌ఇండియా మాజీ సారథి, పరుగుల రారాజు విరాట్‌ కోహ్లీ (Virat Kohli ) పేరు వినగానే.. క్రికెట్‌ అభిమానులకు ‘జెర్సీ నంబరు 18 (jersey Number 18)’ కళ్ల ముందు కదలాడుతుంది. అది ఐపీఎల్‌ అయినా.. అంతర్జాతీయ టోర్నీ అయినా కోహ్లీ ఆ జెర్సీ నంబరులోనే కన్పిస్తాడు. తన కెరీర్‌ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కింగ్‌ తన సంఖ్యను మార్చుకోలేదు. అయితే దీని వెనుక ఓ ఉద్వేగభరిత కథ ఉంది. తన తండ్రి  గుర్తుగా కోహ్లీ.. ‘నంబరు 18 (jersey Number 18)’ జెర్సీ మాత్రమే వేసుకుంటున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. నన్ను పవన్‌ కల్యాణ్‌ సినిమాలో విలన్‌గా అడిగారు: మల్లారెడ్డి

పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) సినిమాలో విలన్‌గా నటించాలని దర్శకుడు హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) తనని కోరారని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) అన్నారు. తనని గంటన్నరసేపు బతిమిలాడినా.. తాను చేయనని చెప్పానన్నారు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో జరిగిన ‘మేమ్‌ ఫేమస్‌’ టీజర్‌ విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. జగన్‌ దెబ్బకు మైండ్‌ బ్లాక్‌ అయింది: ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా తనపై ఇష్టారీతిన విమర్శలు చేస్తున్నారని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలతో వైకాపా ఆమెను సస్పెండ్‌ చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీదేవి మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. నో-కాస్ట్‌ ఈఎంఐ.. ఇవన్నీ తెలుసుకున్నాకే!

అధిక ధర కలిగిన వస్తువులను కొనడానికి నో-కాస్ట్‌ ఈఎంఐ ఒక పాపులర్‌ సదుపాయం. మొత్తం ధర ఒకేసారి చెల్లించకుండానే రిఫ్రిజిరేటర్లు, టీవీలు, వాషింగ్‌ మెషీన్లు, మొబైల్‌ ఫోన్లు సహా ఇతర వస్తువులను సొంతం చేసుకోవచ్చు. నో-కాస్ట్‌ ఈఎంఐ (No-Cost EMI)తో ప్రయోజనం ఉన్నప్పటికీ.. దీని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు