Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 26 May 2023 13:10 IST

1. రివ్యూ: సత్తిగాని రెండెకరాలు

సత్తి ( జగదీష్‌ ప్రతాప్‌) తాత ఒకప్పుడు ఆసామి. ఆడంబరాలకు పోయి ఉన్న భూములన్నీ అమ్మగా చివరకు రెండెకరాలు మిగులుతాయి. అదే వారసత్వ ఆస్తిగా సత్తికి వస్తుంది. ఇద్దరు బిడ్డల తండ్రయిన సత్తికి జీవితంలో అన్నీ కష్టాలే. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. పాపకు గుండెలో రంధ్రం ఉండటంతో ఆపరేషన్‌కు రూ.25లక్షలు అవసరమవుతాయి. వైద్య ఖర్చుల కోసం ఉన్న ఆటోనీ అమ్మేస్తాడు. అప్పులు కూడా పెరిగిపోతాయి. దీంతో తాత వారసత్వంగా వచ్చిన రెండెకరాలు అమ్మేద్దామని నిర్ణయించుకుంటాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. భారత్‌లో ఉన్నతోద్యోగులకూ మెటా ఉద్వాసన!

ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్‌ ఉద్యోగుల తొలగింపు (Meta Layoffs) ప్రక్రియను వేగవంతం చేసింది. తాజాగా మరో 6,000 మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కంపెనీ సామర్థ్యాన్ని మెరుగుపర్చడంలో భాగంగా ఉద్యోగులను తీసివేయనున్నట్లు మార్చిలో సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కీలక పత్రాలు పోగొట్టిన ఉద్యోగి.. చిక్కుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద అణు కేంద్రం!

ప్రపంచంలోనే అతి పెద్ద అణు విద్యుత్‌ కేంద్రం (Nuclear Power plant) ‘కాషీవాజాకీ- కరీవా’కు మరిన్ని చిక్కులు వచ్చి పడ్డాయి. ఇప్పటికే భద్రతా లోపాల కారణంగా జపాన్‌ (Japan)లోని ఈ న్యూక్లియర్‌ ప్లాంట్‌ పునః ప్రారంభం వాయిదా పడగా, తాజాగా ఇక్కడి ఓ ఉద్యోగి.. ప్లాంట్‌కు సంబంధించిన కీలక పత్రాల (Power Plant Documents)ను పోగొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఆ ఉద్యోగి.. సంబంధిత పత్రాలను కారు మీద పెట్టి మర్చిపోయారని ప్లాంట్‌ను నిర్వహించే ‘టోక్యో ఎలక్ట్రిక్‌ పవర్‌ కంపెనీ (TEPCO)’ వెల్లడించడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. తెలంగాణ పాలిసెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణలో పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘పాలిసెట్‌’ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ విడుదల చేశారు. మే 17న జరిగిన ఈ పరీక్షకు మొత్తం 1,05,742మంది దరఖాస్తు చేసుకోగా.. మొత్తంగా 98,273(92.94%) మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 54,700 మంది అబ్బాయిలు ఉండగా, 43,573 మంది అమ్మాయిలు ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆర్‌-5 జోన్‌లో పట్టాల పంపిణీ.. నల్లబెలూన్లతో రాజధాని రైతుల నిరసన

ఆర్‌-5 జోన్‌ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీకి వ్యతిరేకంగా రాజధాని రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తుళ్లూరు మండలం వెంకటపాలెంలో పట్టాల పంపిణీకి నేడు సీఎం జగన్‌ రానున్న నేపథ్యంలో రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడి, మందడం, కృష్ణాయపాలెం తదితర గ్రామాల్లో ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా రైతులు, మహిళలు ఆందోళన చేపట్టారు. పేదలకు పట్టాల పేరుతో మోసం చేస్తున్నారని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. నాడు స్థానిక టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ లీగుల నుంచి మధ్వాల్‌ను బ్యాన్‌ చేశారట.. ఎందుకంటే..?

లఖ్‌నవూ(Lucknow Supergiants)పై అద్భుత ప్రదర్శన చేసిన ముంబయి పేసర్‌ ఆకాశ్‌ మధ్వాల్‌(Akash Madhwal)పై ప్రశంసల జల్లు కురుస్తోంది. కీలక మ్యాచ్‌లో కేవలం ఐదే పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టి ముంబయికి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు ఈ సంచలన బౌలర్‌. ముంబయి(Mumbai Indians) జట్టుకు మరో రత్నం దొరికిందని పలువురు మెచ్చుకుంటుండగా.. మధ్వాల్‌ సోదరుడు ఆశిష్‌ అతడి క్రికెట్‌ నేపథ్యం పై ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సత్యేందర్‌ జైన్‌కు మధ్యంతర బెయిల్‌

ఆప్‌ సీనియర్ నేత సత్యేందర్ జైన్‌( AAP leader Satyendar)కు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు(Supreme Court)లో ఊరట లభించింది. శుక్రవారం న్యాయస్థానం ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆయన ఆరోగ్య స్థితిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఆరువారాలకు ఈ నిర్ణయం తీసుకొంది. అయితే, కొన్ని షరతులు కూడా విధించింది. అనుమతి లేకుండా దిల్లీ దాటి వెళ్లకూడదని, మీడియా ముందు ఎటువంటి ప్రకటనలు చేయకూడదని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అవినాష్‌ నిందితుడని సీబీఐ ఎక్కడా చెప్పలేదు: అవినాష్‌ తరఫు న్యాయవాది

మాజీమంత్రి వై.ఎస్‌.వివేకా హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ విచారణ జరుపుతోంది. వెకేషన్‌ బెంచ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎం. లక్ష్మణ్‌ ఎదుట అవినాష్‌ తరఫు న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదనలు వినిపించారు. ఎఫ్‌ఐఆర్‌, దర్యాప్తు, కోర్టుల్లో జరిగిన పరిణామాలను కోర్టు దృష్టికి ఆయన తీసుకెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వారంలో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభిస్తాం: సీఎం జగన్‌

రాజధాని (Amaravati) పరిధిలో పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలకు వారం రోజుల్లోనే బీజం వేయబోతున్నామని సీఎం జగన్‌(CM Jagan) చెప్పారు. అమరావతి పరిధిలోని వెంకటపాలెంలో ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మౌలిక వసతులన్నీ కల్పిస్తూ లబ్ధిదారులకు ఇంటి పత్రాలు అందజేస్తామన్నారు. ఇవాళ్టి నుంచి ఈ ప్రాంతం సామాజిక అమరావతి అవుతుందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. విద్యార్థుల ఎదుటే తన్నుకున్న మహిళా టీచర్లు.. వీడియో వైరల్‌

బిహార్‌ (Bihar) విద్యావ్యవస్థలో లోపాలు తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. పరీక్షల సమయంలో మాస్‌ కాపీయింగ్‌.. మార్కుల జాబితాల్లో అవకతవకలు.. ఇలా గతంలో అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఓ పాఠశాలలో విద్యార్థుల కళ్లముందే మహిళా టీచర్లు తన్నుకున్నారు. జుట్టుపట్టుకుని.. చెప్పులతో కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు