Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 27 May 2023 13:08 IST

1. దర్యాప్తు మా పద్ధతి ప్రకారం చేస్తాం.. అవినాష్ కోరుకున్నట్లు కాదు: సీబీఐ

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ ప్రారంభమైంది. వెకేషన్‌ బెంచ్‌ న్యాయమూర్తి జస్టిస్ ఎం.లక్ష్మణ్ వాదనలు వింటున్నారు. నిన్న ఎంపీ అవినాష్‌ రెడ్డి, వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాదులు కోర్టుకు వాదనలు వినిపించారు. నేడు సీబీఐ తరఫున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అనిల్‌ వాదనలు వినిపిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అమెరికాలో దీపావళి సెలవు..? కాంగ్రెస్‌లో బిల్లు

అగ్రరాజ్యం అమెరికా (USA)లో దీపావళి (Diwali) పర్వదినానికి సెలవు (Holiday) ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ వెలుగుల పండగను సెలవు దినంగా ప్రకటించాలని ప్రతిపాదిస్తూ చట్టసభ్యురాలు గ్రేస్డ్‌ మెంగ్‌ యూఎస్‌ కాంగ్రెస్‌ దిగువ సభ అయిన ప్రతినిధుల సభ (House of Representatives)లో శుక్రవారం బిల్లును ప్రవేశపెట్టారు. ‘దీపావళి డే యాక్ట్‌ (Diwali Day Act)’ పేరుతో తీసుకొచ్చిన ఈ బిల్లును అమెరికా వ్యాప్తంగా పలు కమ్యూనిటీలు స్వాగతించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కోచ్‌ లేదా ట్రైన్‌ మొత్తం బుక్‌ చేసుకోవచ్చని తెలుసా?

ఐదారు కుటుంబాలు కలిసి ఏదైనా సుదూర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక యాత్ర చేయాలన్నా.. ఎవరైనా మిత్రుడి వివాహానికి ఆఫీసులో పనిచేసే వాళ్లందరూ వెళ్లాలన్నా ఎంతో శ్రమతో కూడుకున్న వ్యవహారం. ఐదుగురో, పది మందో అయితే రైళ్లలో (Indian Railways) ముందస్తుగా టికెట్‌ రిజర్వ్‌ చేసి పెట్టుకోవచ్చు. కానీ పదుల సంఖ్యలో వెళ్లాలంటే మాత్రం ప్లాన్‌ చేసుకోవడం అంత సులభం కాదు. అలాంటి సందర్భాల్లో మీ మొత్తం కుటుంబ సభ్యుల కోసమో, స్నేహితుల కోసమో రైలు బోగీనే (coach) బుక్‌ చేసుకోవచ్చని తెలుసా?పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నూతన పార్లమెంట్‌ స్మారక నాణెం ఎలా పొందాలి?

నూతన పార్లమెంట్‌ భవనాన్ని (Parliament new Building) మే 28న ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రారంభించనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం రూ.75 నాణేన్ని విడుదల చేయనుంది. ఇలా విడుదల చేయడం కొత్తేం కాదు. ఏదైనా ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని స్మారక నాణేలను భారత ప్రభుత్వం తీసుకొస్తూ ఉంటుంది. గతంలోనూ చాలా సందర్భాల్లో ఈ ప్రత్యేక నాణేలను రూపొందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వీకెండ్ స్పెషల్‌.. సబ్‌స్క్రిప్షన్ లేక పోయినా ఉచితంగా ఈ సినిమాలు చూడొచ్చు

ఓటీటీ (OTT Movies) వేదికగా సినిమా చూడాలంటే ఆయా సంస్థలకు కొంత మొత్తంలో డబ్బు చెల్లించి సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాలనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకుని పలు ఓటీటీ సంస్థలు ఫ్రీగా కొన్ని సినిమాలను చూసే అవకాశాన్ని ఇస్తున్నాయి. ఇంతకీ ఏయే ఫ్లాట్‌ఫామ్స్‌ ఉచితంగా సినిమాలు చూసే అవకాశాన్ని అందిస్తున్నాయి. ఈ వీకెండ్‌లో ఫ్రీగా చూసే సినిమాలు ఏమిటంటే..! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఈసారి ‘మహానాడు’కు ఒక ప్రత్యేకత ఉంది: చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మహానాడు కార్యక్రమం రాజమహేంద్రవరంలో అట్టహాసంగా ప్రారంభమైంది. రాజమహేంద్రవరం మొత్తం పసుపుమయంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లోని పార్టీ కార్యకర్తలు, శ్రేణులు మహానాడుకు భారీగా హాజరయ్యారు. మహానాడులో భాగంగా తొలిరోజైన ఇవాళ ప్రతినిధుల సభ నిర్వహిస్తున్నారు. మరో 35 వేల మంది వరకూ కార్యకర్తలు వస్తారని అంచనా. కార్యక్రమానికి హాజరైన పార్టీ అధినేత చంద్రబాబు మొదటగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఐపీఎల్‌లో గిల్ అరుదైన ఘనత.. సెహ్వాగ్‌ను అధిగమించిన యువ బ్యాటర్

ఒకే సీజన్‌లో (IPL 2023) మూడు సెంచరీలు బాదిన శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో క్వాలిఫయర్‌లో ముంబయిపై ఓపెనర్‌ గిల్ 129 పరుగులు సాధించాడు. దీంతో ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా మారాడు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ను గిల్ అధిగమించాడు. గతంలో పంజాబ్‌ తరఫున ఆడిన సెహ్వాగ్‌.. 2014 సీజన్‌ రెండో క్వాలిఫయర్‌లో చెన్నైపై 122 పరుగులు చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘ దామ్‌’ మాల్‌వేర్‌తో జాగ్రత్త: కేంద్రం హెచ్చరికలు

ఆండ్రాయిడ్‌ మాల్‌వేర్‌ ‘దామ్‌’ (daam)తో ముప్పు పొంచి ఉందని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ వైరస్‌ మొబైల్‌ ఫోన్లలోకి చొరబడి ముఖ్యమైన సమాచారాన్ని హ్యాక్‌ చేస్తుందని, కాల్‌ రికార్డులు, కాంటాక్టులు, హిస్టరీ, కెమెరా తదితరాలను తన అధీనంలోకి తీసుకుంటుందని జాతీయ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ తాజాగా హెచ్చరించింది. ఈ మేరకు మొబైల్‌ వినియోగదారులు జాగ్రత్త వహించాలని, అనుమానాస్పద లింకులపై క్లిక్‌ చేయొద్దని కోరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బ్రిజ్‌ భూషణ్‌ మాటలు అర్థం లేనివి.. అతడిని వెంటనే అరెస్టు చేయాలి: రెజ్లర్లకు రామ్‌దేవ్‌బాబా సపోర్ట్‌

లైంగిక వేధింపుల ఆరోపణలపై భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌ (Brij Bhushan Sharan Singh)ను అరెస్టు  చేయాలంటూ గత కొంతకాలంగా స్టార్‌ రెజ్లర్లు దిల్లీలో నిరసన కొనసాగిస్తున్నారు. తాజాగా దీనిపై ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ బాబా(Yoga guru Ramdev Baba) స్పందించారు. కుస్తీ యోధులకు తన మద్దతు ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కొనుగోలు కేంద్రంలో నిద్రిస్తున్న రైతుపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్‌

మండల కేంద్రంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. వచ్చునూర్‌లోని ఐకేపీ కేంద్రంలో నిద్రిస్తున్న రైతుపైకి ట్రాక్టర్‌ దూసుకెళ్లింది. వచ్చునూర్ గ్రామానికి చెందిన ఉప్పులేటి మొండయ్య(65) అనే రైతు తన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో పోసి రాత్రి అక్కడే నిద్రించాడు. తనపై టార్పాలిన్‌ కవర్‌ కప్పుకొని నిద్రపోయాడు. తెల్లవారుజామున ధాన్యం లోడుతో రైస్ మిల్లుకు వెళ్లే క్రమంలో.. టార్పాలిన్‌ కింద నిద్రపోయిన రైతును గమనించని డ్రైవర్‌.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని