Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 02 Jun 2023 13:12 IST

1. భయానకం.. 45 బ్యాగుల్లో మానవ శరీర భాగాలు..!

ఉత్తర అమెరికా దేశం మెక్సికో(Mexico)లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన ఒకటి బయటకు వచ్చింది. దాదాపు 45 బ్యాగుల్లో మానవ శరీర భాగాల(Human Body Parts)ను పోలీసులు గుర్తించారు. కొద్దిరోజుల క్రితం కనిపించకుండా పోయిన యువతీయువకుల గురించి విచారణ జరుపుతోన్న సమయంలో ఈ దారుణం వెలుగుచూసింది. స్థానిక అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కోరిక తీరిస్తే.. ఖర్చు భరిస్తానన్నాడు: బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్‌లో కీలక ఆరోపణలు

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌ భూషణ్‌ శరణ్ సింగ్‌ (Brij Bhushan Sharan Singh)పై దిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళా అథ్లెట్లతో (women athletes) ఆయన దారుణంగా ప్రవర్తించారని, ఛాతీపై తాకడం, రెజ్లర్లతో అసభ్య పదజాలాన్ని ఉపయోగించి సంభాషించడం వంటివి చేసేవారని బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్‌ కాపీలోని అంశాలను పలు జాతీయ మీడియా కథనాలు ప్రచురించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఉద్యమానికి నాయకత్వం.. నా జీవితం ధన్యమైంది: కేసీఆర్

ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం నుంచే తెలంగాణ దోపిడీకి గురైందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇప్పుడు దేశంలోనే బలీయమైన శక్తిగా తెలంగాణ ఎదిగిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సచివాలయంలో నిర్వహించిన వేడుకల్లో జాతీయ జెండాను సీఎం ఎగురవేశారు. అనంతరం భద్రతా బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు గన్‌పార్క్‌ వద్ద అమరవీరులకు కేసీఆర్‌ నివాళులర్పించారు. సచివాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు జరిగిన పరిణామాలు గుర్తు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 2024 ఫలితాలు ఆశ్చర్యపరుస్తాయ్‌..: రాహుల్‌ గాంధీ

ప్రస్తుతం భారత రాజకీయాల్లో ప్రతిపక్షాలు చాలా ఐక్యంగా ఉన్నాయని కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) అన్నారు. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తాయని ఆయన విపక్షాల (Opposition) విజయంపై ధీమా వ్యక్తం చేశారు. అమెరికా (USA) పర్యటనలో ఉన్న రాహుల్‌.. తాజాగా వాషింగ్టన్‌లోని నేషనల్ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అమెరికాకు తప్పిన దివాలా ముప్పు

అమెరికాకు దివాలా (US default) ముప్పు తప్పింది. అప్పుల పరిమితి పెంపునకు (Debt ceiling) సంబంధించిన కీలక బిల్లుకి అక్కడి ఉభయ సభల ఆమోదం లభించింది. ప్రతినిధుల సభలో బిల్లు నిన్న గట్టెక్కగా.. అమెరికా కాలమానం ప్రకారం గురువారం సెనేట్‌ కూడా ఆమోద ముద్ర వేసింది. దీంతో అప్పుల పరిమితి పెంచుకునేందుకు ప్రభుత్వానికి అవకాశం లభించింది. అధ్యక్షుడు బైడెన్‌ (Biden) సంతకం లాంఛనమే కాబట్టి బిల్లు వెంటనే చట్టరూపం దాల్చనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆఫీసులో రోజుకి 6 గంటలు టాయిలెట్‌లోనే.. చివరకు ఇదీ జరిగింది!

ఎవరినైనా కంపెనీ ఉద్యోగంలో నుంచి తీసేసింది అనగానే వెంటనే మనసులోకి ఏం ఆలోచన వస్తుంది? బహుశా అతడి పనితీరు బాగోలేకపోయి ఉండొచ్చని అనుకుంటాం. లేదా కంపెనీలో అనుచితంగానైనా ప్రవర్తించి ఉండొచ్చని భావిస్తాం. కానీ, చైనా (China)లో ఓ ఉద్యోగిని తొలగించడానికి కారణం తెలిస్తే మాత్రం కచ్చితంగా ఆశ్చర్యం కలగక మానదు! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అమెరికా స్పెల్లింగ్‌ బీ విజేతగా దేవ్‌షా..!

అమెరికాలో నిర్వహించిన 95వ నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ (US Spelling Bee) పోటీల్లో భారత సంతతికి చెందిన 14 ఏళ్ల దేవ్‌షా విజేతగా నిలిచాడు. అతడు శామాఫైల్‌ (psammophile) అనే పదానికి స్పెల్లింగ్‌ చెప్పి 50 వేల డాలర్ల ప్రైజ్‌ మనీని గెలుచుకొన్నాడు. శామాఫైల్‌ అంటే ఇసుక నేలల్లో కనిపించే కనిపించే జీవి లేదా మొక్క అని అర్థం. ఈ పోటీల అనంతరం ట్రోఫీని అందుకొన్న తర్వాత దేవ్‌ మాట్లాడుతూ ‘‘ఇది నమ్మలేకపోతున్నాను.. ఇప్పటికీ నా కాళ్లు వణుకుతున్నాయి’’ అని పేర్కొన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. భారత్‌కు అప్పగింత నిర్ణయాన్ని సవాల్‌ చేసిన 26/11 దాడుల నిందితుడు తహవూర్‌ రాణా

26/11 ముంబయి(26/11 Attack)పై దాడుల కేసులో కీలక నిందితుడైన తహవూర్‌ రాణా(62)(Tahawwur Rana)ను భారత్‌కు అప్పగింతపై మళ్లీ నీలినీడలు అలముకున్నాయి. తనను భారత్‌ అప్పగించాలన్న అమెరికా (USA) న్యాయస్థానం నిర్ణయాన్ని సవాలు చేస్తూ ది రైటాఫ్‌ హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను తన అటార్నీ ద్వారా దాఖలు చేశాడు. ఈ అప్పగింత రెండు రకాలుగా అమెరికా-భారత్‌ నేరస్థుల అప్పగింత ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందని రాణా అటార్నీ సదరు పిటిషన్‌లో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. స్నేహితుడి భార్యతో వ్యాపారి అదృశ్యం

శిర్డీ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి ఓ వ్యక్తి తన స్నేహితుడి భార్యను తీసుకెళ్లాడు. మారేడుపల్లి ఎస్సై మోహన్‌ వివరాల ప్రకారం.. న్యూబోయిన్‌పల్లి వ్యాపారి అతుల్‌ (45) మే 29న శిర్డీ వెళ్లాడు. మరుసటిరోజు నుంచి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చింది. అయితే అతుల్‌ తన భార్యకు రాసిన లేఖ ఇంట్లో దొరికింది. అందులో తన స్నేహితుడి భార్యతో కలిసి ఉండడానికి వెళ్తున్నానని, ఈ విషయం తన స్నేహితుడికి తెలుసునని, తమను వెతకవద్దని లేఖలో ఉందని, రూ.10 లక్షల నగదు తీసుకెళ్లాడని అతుల్‌ భార్య ఫిర్యాదు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆరోగ్య బీమా.. ఇవి మర్చిపోవద్దు

ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు వస్తుంటాయి. వీటిని మనం సరిగా అర్థం చేసుకోకపోతే.. అవసరం వచ్చినప్పుడు పాలసీ ఉన్నా ఫలితం ఉండదు. బీమా పాలసీని ఎంచుకునేటప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. చివరి నిమిషంలో ఆందోళన పడక్కర్లేదు. పాలసీని తీసుకునేటప్పుడు పరిగణించాల్సిన విషయాలేమిటో చూద్దామా... అనారోగ్యం వచ్చి, ఆసుపత్రిలో చేరిప్పుడు ఆరోగ్య బీమా పాలసీ కొండంత ధైరాన్ని ఇస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని