Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

1. ఆసీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్ పోరు.. భారత్ తుది జట్టు ఇదేనా?
కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్ దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ తర్వాత ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానె బ్యాటింగ్ చేస్తారు. భారత్‌కు ఎదురయ్యే తొలి సమస్య.. కీపర్ ఎవరు..? ఎందుకంటే ఎడమ చేతివాటం బ్యాటర్ ఇషాన్ కిషన్‌తో స్పెషలిస్ట్ వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ పోటీ పడుతున్నాడు. లెఫ్ట్‌హ్యాండ్ కాంబినేషన్ కావాలనుకుంటే ఇషాన్ వైపు టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపే అవకాశం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. ఒడిశా రైలు దుర్ఘటన.. సిగ్నల్ వైఫల్యం వల్ల కాకపోవచ్చు..!
యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఒడిశా రైలు దుర్ఘటన (Odisha Train Tragedy)కు గల కారణాలు ఏంటనేది తెలియరావట్లేదు. సిగ్నలింగ్ వ్యవస్థలో వైఫల్యం (signal failure) కారణంగానే ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుందని రైల్వే శాఖ ‘సంయుక్త దర్యాప్తు నివేదిక’ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ దర్యాప్తు బృందంలో ఒకరైన ఓ సీనియర్ రైల్వే ఇంజినీర్.. ఈ నివేదికను వ్యతిరేకించినట్లు తాజాగా తెలిసింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ (Coromandal Express) మెయిన్‌లైన్‌లో వెళ్లేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని, అయినప్పటికీ అది లూప్‌లైన్‌లోకి వెళ్లిందని ఆ ఇంజినీర్ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. డబ్బు కోసం పాక్ తిప్పలు.. అమెరికాలో రూజ్‌వెల్ట్ హోటల్ తనఖా
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్(Pakistan).. ఏ చిన్న ఆదాయ మార్గాన్ని వదులుకోవడం లేదు. అందుకోసం విదేశాల్లో ఉన్న ఆస్తుల్ని తనఖా పెట్టడం.. లీజులకు ఇవ్వడం వంటివి చేస్తోంది. తాజాగా అమెరికాలోని న్యూయార్క్(New York) నగరంలోని ప్రముఖ రూజ్‌వెల్ట్ హోటల్(Roosevelt Hotel)ను అక్కడి స్థానిక నగరపాలక సంస్థకు మూడేళ్లపాటు లీజుకిచ్చింది. దీనిద్వారా 220 మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని పొందనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. మారుతీ సుజుకీ జిమ్నీ వచ్చేసింది.. ధరెంతో తెలుసా?
వాహన ప్రియులను గతకొంతకాలంగా ఉత్కంఠకు గురిచేసిన మారుతీ సుజుకీ జిమ్నీ (Maruti Suzuki Jimny) ఎట్టకేలకు విడుదలైంది. ఆటో ఎక్స్‌పో 2023లో దీన్ని ఆవిష్కరించినప్పటి నుంచి దీని విడుదలపై అనేక మంది ఆసక్తిగా వేచిచూస్తున్నారు. బుకింగ్స్ గతంలోనే ప్రారంభమవగా.. ఇప్పటి వరకు 30 వేల ఆర్డర్లు లభించాయి. ధరల శ్రేణి రూ.12.74లక్షలు- రూ.15.05 లక్షలు. జూన్ మధ్య నుంచి కస్టమర్లకు ఈ కార్లను డెలివరీ చేస్తారని డీలర్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. కేంద్రమంత్రి అర్ధరాత్రి ట్వీట్.. అనురాగ్ ఠాకూర్ ఇంటికి రెజ్లర్లు
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటోన్న భాజపా ఎంపీ బ్రిజ్‌భూషణ్(BJP MP Brij Bhushan Sharan Singh)పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు గతకొద్దికాలంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారు విధుల్లో చేరినా.. ఆందోళన కొనసాగుతుందని వెల్లడించారు. ఈ క్రమంలో అర్ధరాత్రి కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) ట్విటర్ వేదికగా స్పందించారు. ‘రెజ్లర్ల సమస్యలపై వారితో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ విషయమై వారిని మరోసారి చర్చలకు ఆహ్వానించాను’ అని ఠాకూర్ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ప్రేమికుల మధ్య విభేదాలు.. బెంగళూరులో హైదరాబాద్ యువతి హత్య
ప్రేమించిన యువకుడి చేతిలో ఓ యువతి హత్యకు గురైంది. బెంగళూరు నగర డీసీపీ డాక్టర్ భీమాశంకర్ గుళేద్ కథనం ప్రకారం.. జీవనబీమానగర పోలీసు స్టేషన్ పరిధి కోడిహళ్లిలో హైదరాబాద్‌కు చెందిన ఆకాంక్ష విద్యాసాగర్(23) సోమవారం రాత్రి హత్యకు గురయ్యారు. ఆకాంక్ష విద్యాసాగర్- దిల్లీకి చెందిన అర్పిత్ చాన్నాళ్లుగా ప్రేమించుకున్నారు. ఇద్దరూ కలిసి కోడిహళ్లిలో అద్దె ఇంట్లో ఉండేవారు. తాజాగా వారిద్దరూ వేర్వేరుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. డబ్ల్యూటీసీ ఫైనల్ విజేత ‘గద’ వెనుక కథ ఇదీ..
గతంలో టెస్టుల్లో అగ్రస్థానం దక్కించుకున్న జట్టుకు గదను బహూకరించేవారు. ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ విజేతకు ఇస్తున్నారు. దీంతో పాటు గెలిచిన జట్టుకు 1.6 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ కూడా ఇస్తారు. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 8 లక్షల డాలర్లు దక్కుతాయి. మరి ఇలాంటి ‘గద’ను ఐసీసీ 2000 సంవత్సరంలోనే తయారు చేయించింది. ట్రావెర్ బ్రౌన్ అనే డిజైనర్ దీనిని రూపొందించాడు. దీని తయారీ వెనుక ప్రేరేపించిన అంశాలను కూడా ఆయనే వెల్లడించాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. రష్యాలో ఎయిరిండియా ప్రయాణికుల పడిగాపులు.. మరో విమానం పంపుతున్న భారత్
దిల్లీ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లాల్సిన విమానం నిన్న రష్యా(Russia)లో అత్యవసరంగా దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం సత్వర చర్యలు ప్రారంభించింది. గమ్యస్థానానికి చేరేందుకు రష్యాలో పడిగాపులు కాస్తోన్న ప్రయాణికులను తరలించేందుకు ప్రత్యామ్నాయంగా మరో విమానాన్ని( relief aircraft) పంపనుంది. అది బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ముంబయి నుంచి ఈ విమానం బయలుదేరనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ప్రభుత్వ హాస్టల్‌లో యువతిపై హత్యాచారం.. ఆపై అనుమానిత గార్డు ఆత్మహత్య..!
మహారాష్ట్ర (Maharashtra)లోని దక్షిణ ముంబయి (Mumbai)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ వసతి గృహంలో 18 ఏళ్ల విద్యార్థిని హత్యాచారానికి (Rape and Murder) గురైంది. కాగా.. ఈ ఘటనలో నిందితుడిగా అనుమానిస్తున్న హాస్టల్ సెక్యూరిటీ గార్డు.. రైలు పట్టాలపై శవమై కన్పించడం గమనార్హం. పోలీసుల కథనం ప్రకారం.. అకోలా ప్రాంతానికి చెందిన ఓ 18 ఏళ్ల యువతి ముంబయి శివారులోని బాంద్రాలోని ఓ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. రెడిట్‌లో 5శాతం ఉద్యోగుల తొలగింపు..!
ప్రముఖ సోషల్‌మీడియా వెబ్‌సైట్ రెడిట్(Reddit) తాజాగా భారీ ఎత్తున ఉద్యోగులపై వేటు(Layoffs) వేసింది. ఓ ఆంగ్ల వార్తాసంస్థ నివేదిక ప్రకారం దాదాపు 5శాతం ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా 90 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. ప్రస్తుతం కంపెనీలో ప్రపంచ వ్యాప్తంగా 2,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక లేఆఫ్‌ల సమాచారాన్ని కంపెనీ సీఈవో హవ్‌మన్ ఉద్యోగులకు ఓ మెమో ద్వార తెలియజేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Asian Games: ఆసియా క్రీడలు.. నీరజ్‌కు స్వర్ణం, కిశోర్‌కు రజతం
-
Chandrababu Arrest: ఆంక్షలు దాటి, పోలీసుల కళ్లు కప్పి.. ర్యాలీకి ఎమ్మెల్యే కోటంరెడ్డి
-
Sanjay Singh: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టు
-
TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మరో శుభవార్త
-
Rohit On WC 2023: మా టార్గెట్ అదే.. అలాంటి పోలికలను పట్టించుకోం: రోహిత్
-
TS News: తెలంగాణలో ఓటర్ల జాబితా విడుదల.. వర్గాల వారీగా ఇదీ లెక్క!