Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

1. శంషాబాద్‌లో చంపి.. సరూర్‌నగర్ మ్యాన్‌హోల్‌లో పడేశాడు..
శంషాబాద్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి.. ఆమెను దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సరూర్‌నగర్ ప్రాంతానికి చెందిన వెంకట సాయికృష్ణ, అప్సర బంధువులు. సాయికృష్ణకు ఇప్పటికే వివాహమై.. ఇద్దరు పిల్లలున్నారు. అయితే.. అప్సరతో సాయికృష్ణ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని అప్సర అతడిపై ఒత్తిడి తీసుకువచ్చింది. అయితే.. వీరిద్దరూ రెండ్రోజుల కిందట కారులో శంషాబాద్‌లోని సుల్తాన్‌పల్లికి వెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. భారత్ గోల్డెన్ అవర్‌ను చేజార్చుకొంది: పాంటింగ్
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్(WTC Final)లో భారత్ స్వయంకృతంతోనే పీకల్లోతు కష్టాల్లో పడిందని ఆస్ట్రేలియా మాజీ స్టార్ ఆటగాడు రికీ పాంటింగ్(Ricky Ponting) విశ్లేషించాడు. మ్యాచ్ ప్రారంభం నుంచి అందివచ్చిన సువర్ణావకాశాలను టీమ్ ఇండియా చేజార్చుకొందని పేర్కొన్నాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం నుంచే ఇబ్బందులు మొదలయ్యాయన్నాడు. ‘‘తొలి గంటలో లభించిన అవకాశాలను చేజార్చుకొనేలా వారు మరీ బలహీనంగా బౌలింగ్ చేశారు. వికెట్, మైదానం పరిస్థితులు వారికి అనుకూలంగా ఉన్నాయి.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. అవినాష్‌రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంలో మంగళవారం విచారణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టనుంది. వివేకా హత్య కేసులో అవినాష్ ప్రధాన కుట్రదారు అని సునీత తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. స్థానిక ప్రభుత్వం కూడా అవినాష్‌కే మద్దతిస్తోందని తెలిపారు. సీబీఐ విచారణను అడ్డుకుంటున్నారని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ‘ఆమెది ఆత్మహత్య.. శ్రద్ధా ఘటన స్ఫూర్తితో ముక్కలు చేశా’: ముంబయి హత్య కేసులో ట్విస్ట్
దిల్లీలోని శ్రద్ధా వాకర్ (Shraddha Walkar murder case) హత్య తరహాలోనే.. మహారాష్ట్ర (Maharashtra)లో సహజీవన భాగస్వామిని చంపి, ఆమె శరీరాన్ని ముక్కలు చేసి ఘటనలో అనూహ్య విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాను హత్య చేయలేదని, ఆమే ఆత్మహత్యకు పాల్పడిందని నిందితుడు మనోజ్ సానే పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. కేసులో ఇరుక్కుంటానన్న భయంతో ఆమె మృతదేహాన్ని అదృశ్యం చేసేందుకు ప్రయత్నించినట్లు అతడు చెప్పాడట. అంతేకాదు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. మరిన్ని చిక్కుల్లో ట్రంప్.. రహస్య పత్రాల కేసులో నేరాభియోగాలు
వచ్చే ఏడాది జరగబోయే అమెరికా (USA) అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కేసుల సుడిగుండంలో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే ఓ శృంగార తారకు డబ్బుల చెల్లింపు కేసులో ఆయనపై నేరాభియోగాలు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా రహస్య పత్రాల (classified documents) కేసులోనూ ఆయనపై ఫెడరల్ అభియోగాలు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదాకు హైకోర్టు ధర్మాసనం నిరాకరణ
గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఎల్లుండి జరగనున్న ప్రిలిమ్స్ పరీక్షలో జోక్యానికి ధర్మాసనం నిరాకరిస్తూ.. అప్పీల్‌ను కొట్టివేసింది. గ్రూప్- 1 ప్రిలిమ్స్ వాయిదా వేయాలన్న పిటిషన్లను ఇటీవల సింగిల్ జడ్జి కొట్టేయగా.. ఆ ఉత్తర్వులను ధర్మాసనం వద్ద ఓ విద్యార్థి సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వర రావుతో కూడిన హైకోర్టు ధర్మాసనం.. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను నిలిపివేయడం పరిష్కారం కాదని అభిప్రాయపడింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. శరద్ పవార్‌ను బెదిరిస్తూ.. సుప్రియా సూలేకు వాట్సప్ మెసేజ్
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar)కు బెదిరింపులు వచ్చాయి. తన తండ్రిని బెదిరిస్తూ వాట్సప్‌లో తనకు మెసేజ్ వచ్చినట్లు పవార్ కుమార్తె, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule) తెలిపారు. దీంతో ఆమె ముంబయి పోలీసులను ఆశ్రయించారు. దీనిపై తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘గురువారం నాకు ఈ బెదిరింపు మెసేజ్ (Threat Message) వచ్చింది. ఓ వెబ్‌సైట్ ద్వారా పవార్‌ను బెదిరిస్తూ ఆగంతకులు సందేశం పంపారు. దీంతో నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. త్వరలోనే పార్టీ చేరిక తేదీలు ప్రకటిస్తా: పొంగులేటి
నాలుగైదు రోజుల్లో ఏ పార్టీలో చేరుతానో చెబుతానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఎస్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్యనేతలతో పొంగులేటి భేటీ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రజలు, అనుచరుల అభిప్రాయాలు తీసుకున్నాను. ఏ పార్టీలో చేరాలనే విషయమై అనుచరుల అభిప్రాయానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటాను. హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి త్వరలోనే పార్టీ చేరిక తేదీలు ప్రకటిస్తాను. ఖమ్మం బహిరంగ సభ తేదీలనూ త్వరలో వెల్లడిస్తాను’’ అని పొంగులేటి చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. మోదీతో ‘చాట్‌జీపీటీ’ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ భేటీ
చాట్‌జీపీటీ (ChatGPT)ని రూపొందించిన ఓపెన్‌ఏఐ కంపెనీ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ (Sam Altman) గురువారం ప్రధాని నరేంద్ర మోదీ (Modi)తో భేటీ అయ్యారు. భారత టెక్ రంగాన్ని మరింత మెరుగుపర్చడంలో కృత్రిమ మేధ (AI) పాత్ర చాలా కీలకమని ఈ సందర్భంగా మోదీ అభిప్రాయపడ్డారు. భారత పౌరుల సాధికారత కోసం జరుగుతున్న డిజిటల్ పరివర్తనను వేగవంతం చేసే అన్ని సహకారాలను స్వాగతిస్తున్నట్లు స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. రివ్యూ: విమానం.. సముద్రఖని, అనసూయల చిత్రం ఎలా ఉంది?
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల విడుదలలు అంతంత మాత్రమే. దాంతో వారం వారం పరిమిత వ్యయంతో రూపొందిన సినిమాలు థియేటర్లకి పోటెత్తుతూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. బలమైన ఈ సీజన్ చిన్న సినిమాలకి ఓ మంచి తరుణంలా మారింది. ఈ వారం విడుదలైన చిన్న సినిమాల్లో ‘విమానం’ (Vimanam Movie Review) ఒకటి. తండ్రీకొడుకుల కథతో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఎలా ఉంది? పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TTD: వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. చంద్రప్రభ వాహనంపై శ్రీనివాసుడు
-
Chandrababu Arrest: అమీర్‌పేటలో చంద్రబాబుకు మద్దతుగా భారీ ర్యాలీ
-
Apply Now: సీబీఎస్ఈ ‘సింగిల్ గర్ల్ చైల్డ్’ మెరిట్ స్కాలర్షిప్.. దరఖాస్తు చేశారా?
-
Hyderabad: పాతబస్తీలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురికి గాయాలు
-
October 1: దేశవ్యాప్తంగా ‘శ్రమదాన్’.. స్వచ్ఛత కోసం మోదీ పిలుపు
-
Rakshit Shetty: తెలుగు ప్రేక్షకుల ఆదరణకు రక్షిత్ శెట్టి ఫిదా.. ఏమన్నారంటే?