Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 18 Sep 2023 13:22 IST

1. మహా గణపతికి తొలిపూజ.. హాజరైన గవర్నర్‌ దత్తాత్రేయ, మంత్రి తలసాని

ఖైరతాబాద్‌లో కొలువుదీరిన 63 అడుగుల మహా గణపతికి తొలిపూజ జరిగింది. గణేశుడు ఈసారి ‘శ్రీ దశమహా విద్యా గణపతి’గా భక్తులకు దర్శనమిస్తున్నాడు. స్వామి వారికి కుడివైపున లక్ష్మీనరసింహస్వామి, ఎడమ వైపు వీరభద్రస్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు. మహా గణపతికి ఉదయం 11 గంటలకు తొలిపూజ జరిగింది. ఈ పూజలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, హరియాణా గవర్నర్‌ దత్తాత్రేయ, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తదితరులు పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. దిల్లీ స్ట్రీట్‌ఫుడ్‌ తిన్న జపాన్‌ రాయబారి.. నెటిజన్ల ప్రశంసలు

భారత్‌లోని జపాన్‌ రాయబారి (Japan Envoy) హిరోషి సుజుకి(Hiroshi Suzuki) దంపతులు సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటారు. ఎక్కువగా దేశీయ రుచులను ఆస్వాదిస్తున్న వీడియోలను షేర్‌ చేస్తుంటారు. అంతేకాకుండా భారత వంటకాలపై తమ అభిప్రాయాన్ని కూడా పంచుకుంటుంటారు. తాజాగా ఆ దంపతులు స్ట్రీట్‌ఫుడ్‌ అన్వేషణలో భాగంగా దిల్లీలో ఓ వంటకాన్ని రుచి చూశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నా పాపులారిటీని తట్టుకోలేకపోతున్నారు.. అనుభవం లేదంటున్నారు..!

అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న రిపబ్లికన్‌ పార్టీ నేత, భారతీయ అమెరికన్‌ వివేక్‌ రామస్వామి(Vivek Ramaswamy).. ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు. తనకు పెరుగుతున్న పాపులారిటీని వారు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. అమెరికా(USA) అధ్యక్షుడు అయ్యేంత అనుభవం తనకు లేదని వారు భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. తెలంగాణ వంటి రాష్ట్రాల ఏర్పాటు జరిగిందిక్కడే.. పార్లమెంట్‌ పాత భవనానికి మోదీ వీడ్కోలు

పార్లమెంట్‌ ‘ప్రత్యేక’ సమావేశాలు (Parliament Session) సోమవారం ప్రారంభమయ్యాయి. నేటి సమావేశాలు పార్లమెంట్‌ పాత భవనంలో జరుగుతుండగా.. మంగళవారం నుంచి కొత్త భవనంలోకి మారనున్నాయి. ఈ సందర్భంగా పార్లమెంటు 75ఏళ్ల ప్రస్థానంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) లోక్‌సభ (Lok Sabha)లో ప్రసంగించారు. పాత భవనానికి వీడ్కోలు పలుకుతూ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. క్రెడిట్‌కార్డు బిల్లు భారంగా మారిందా? ఈ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు..!

భారత్‌లో క్రెడిట్‌ కార్డు (Credit Card)ల వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. అయితే, కార్డుల (Credit Card)పై ఎగవేతలు సైతం అదే స్థాయిలో పెరుగుతుండడం గమనార్హం. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం.. 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన క్రెడిట్‌ కార్డు (Credit Card) ఎగవేతలు 1.94 శాతం పెరిగి రూ.4,072 కోట్లకు చేరాయి. మరోవైపు బకాయిలు 1.64 లక్షల కోట్ల నుంచి రూ.2.10 లక్షల కోట్లకు పెరిగాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

విరాట్‌ను అనుకరించిన ఇషాన్‌.. కౌంటర్‌ ఇచ్చిన కోహ్లీ.. వీడియో అదుర్స్

6. టార్గెట్‌ సెవెస్తపోల్‌.. ఉక్రెయిన్‌ దాడిలో దెబ్బతిన్న సబ్‌మెరైన్‌..!

రష్యా(Russia)కు నల్లసముద్రంపై తిరుగులేని ఆధిపత్యం అందించిన సెవెస్తపోల్‌ నౌకాశ్రయం ఇప్పుడు ఉక్రెయిన్‌ (Ukrain) దాడులకు లక్ష్యంగా మారింది. ఇటీవల దాడిలో రష్యాకు చెందిన నౌకలు దెబ్బతిన్నాయి. దీంతోపాటు కిలోక్లాస్‌ సబ్‌మెరైన్‌ కూడా క్షిపణి దాడిలో దెబ్బతిన్నట్లు బ్రిటన్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాలు రెండ్రోజుల క్రితం ధ్రువీకరించాయి. ఇది రష్యాకు భారీ ఎదురుదెబ్బ. ఇటీవల రష్యాపై జరిగిన అతిపెద్ద దాడి ఇదే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పశ్చిమ దేశాలు చెడ్డవి కావు..: ఎస్‌ జైశంకర్‌

పశ్చిమ దేశాలు చెడ్డవనే అపనమ్మకాల నుంచి బయటపడాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ (S Jaishankar) వ్యాఖ్యానించారు. వారేమీ తమ సరుకులతో ఆసియా-ఆఫ్రికా మార్కెట్లను ముంచెత్తడంలేదన్నారు. ఈ నేపథ్యంలో వారిని ప్రతికూల దృక్పథంతో చూడాల్సిన అవసరం లేదన్నారు. పీఎం విశ్వకర్మ పథకం ప్రారంభం సందర్భంగా తిరువనంతపురం వెళ్లిన ఆయన ఓ మలయాళీ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. జుపిటర్‌ హాస్పిటల్స్‌ లాభాల లిస్టింగ్‌.. ఒక్కో లాట్‌పై రూ.4,500 లాభం

మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్వహణ సంస్థ జుపిటర్‌ లైఫ్‌లైన్‌ హాస్పిటల్స్ షేర్లు ఈరోజు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి (Jupiter Hospital Listing). ఒక్కో షేరు దాదాపు 32 శాతం లాభంతో ట్రేడింగ్‌ ప్రారంభించడం విశేషం. రూ.735 గరిష్ఠ ధర వద్ద ఈ కంపెనీ ఐపీఓకి వచ్చిన విషయం తెలిసిందే. ఈరోజు బీఎస్‌ఈలో ఈ షేరు 30.61 శాతం లాభంతో రూ.960 దగ్గర, నిఫ్టీలో 32.38 శాతం ప్రీమియంతో రూ.973 వద్ద ట్రేడింగ్‌ మొదలుపెట్టింది. దీంతో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.6,714.62 కోట్లుగా నమోదైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పార్లమెంట్‌ గాంధీ విగ్రహం వద్ద తెదేపా ఎంపీలు, మాజీ ఎంపీల నిరసన

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలు నిరసన తెలిపారు. ‘సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’, ‘వియ్‌ వాంట్‌ జస్టిస్‌’ అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హాజరయ్యారు.  లోకేశ్‌తో పాటు ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, గల్లా జయదేవ్‌, కేశినేని నాని.. మాజీ ఎంపీలు అయ్యన్నపాత్రుడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. బ్యాక్టీరియా సోకిన చేప తిని.. కాళ్లూచేతులు పోగొట్టుకున్న మహిళ..!

అమెరికా(USA)లోని కాలిఫోర్నియాలో ఓ విషాదకరఘటన జరిగింది. ఓ మహిళ(US Woman) తన కాళ్లూచేతులు పోగొట్టుకుంది. బ్యాక్టీరియా సోకిన చేపను సరిగా ఉడికించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. గతవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 40 ఏళ్ల లారా బరాజాస్‌ అనే మహిళకు విబ్రియో వల్నిఫికస్‌ అనే అత్యంత ప్రాణాంతక బ్యాక్టీరియా సోకింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని