Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 21 Sep 2023 13:12 IST

1. చంద్రబాబును జైల్లోనే చంపేందుకు కుట్ర: నారా లోకేశ్

రాజమహేంద్రవరం జైల్లో తెదేపా అధినేత చంద్రబాబుకు ఏం జరిగినా సీఎం జగన్‌దే బాధ్యతని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ స్పష్టం చేశారు. జైలులో అంతం చేసేందుకే చంద్రబాబును అరెస్టు చేశారనే అనుమానం ఉందన్నారు. ‘‘మా అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. చంద్రబాబును జైల్లోనే చంపేందుకు ప్లాన్‌ చేస్తున్నారు’’ అని లోకేశ్‌ ఆరోపించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. దసరాకు ఊరెళ్తున్నారా? శుభవార్త ఇదిగో!

దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ (TSRTC) శుభవార్త తెలిపింది. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం రాయితీ ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. అక్టోబర్ 15 నుంచి 29 తేదీల మధ్యలో రానూపోనూ ప్రయాణానికి ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే.. తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ కల్పించనున్నట్లు ప్రకటించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మీ ఫోన్‌కు ఎమర్జెన్సీ అలర్ట్‌ వచ్చిందా..?

దేశవ్యాప్తంగా కొంతమంది మొబైల్‌ యూజర్లకు గురువారం మధ్యాహ్నం ఓ ‘ఎమర్జెన్సీ అలర్ట్‌ (Emergency Alert)’ సందేశం వచ్చింది. ‘తీవ్ర పరిస్థితి’ అన్న అర్థంతో ఆ ఫ్లాష్‌ మెసేజ్‌ (Flash Message) ఉంది. దీంతో అది ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎందుకు వచ్చిందో తెలియక వారంతా గందరగోళానికి గురయ్యారు. అయితే, దీనికి కంగారు పడాల్సిన అవసరం లేదు..! దాన్ని కేంద్ర ప్రభుత్వమే పంపింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. చంద్రబాబు అరెస్ట్‌పై శాసనసభలో తెదేపా ఎమ్మెల్యేల నిరసన

ఏపీ శాసనసభ సమావేశాల మొదటి రోజే తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తెదేపా అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేశారని.. ఆ అంశంపై చర్చించాలంటూ తెదేపా వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనిపై చర్చకు స్పీకర్‌ నిరాకరించడంతో తెదేపా ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. స్పీకర్‌ పోడియం వద్దకు ప్లకార్డులతో వెళ్లి నిరసన తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. శాసనసభ నుంచి తెదేపా ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

చంద్రబాబు అరెస్ట్‌ అక్రమమంటూ శాసనసభలో ఆందోళన చేపట్టిన ఆ పార్టీ సభ్యులను స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ సస్పెండ్‌ చేశారు. సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. అనంతరం 15 మందిని సస్పెండ్‌ చేయాలంటూ స్పీకర్‌ను ఆయన కోరారు. దీంతో 14 మంది తెదేపా సభ్యులు, వైకాపాకు చెందిన ఉండవల్లి శ్రీదేవిని ఈరోజు సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ తమ్మినేని ప్రకటించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు

వినాయక చవితి వేడుకల్లో విషాదం నెలకొంది. గణేష్ మండపం వద్ద డ్యాన్స్‌ చేస్తూ ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని మారుతి నగర్‌లో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ప్రసాద్(32) అనే యువకుడు గణేష్ మండపం ఆవరణలో డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రాజ్యసభ ముందుకు మహిళా రిజర్వేషన్‌ బిల్లు..

చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ల బిల్లు (Women's reservation bill) గురువారం రాజ్యసభ (Rajya Sabha) ముందుకొచ్చింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ ఈ బిల్లును నేడు ఎగువ సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభ్యులు దీనిపై చర్చ చేపట్టారు.ఇప్పటికే ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. భారతీయ వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్‌

భారతీయ వైద్య విద్యార్థులు (Medical Graduates) ఇకపై విదేశాల్లో కూడా ప్రాక్టీస్‌ చేయొచ్చని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ మేరకు వరల్డ్‌ ఫెడరేషన్‌ ఫర్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (WFME) నుంచి జాతీయ వైద్యమండలి (NMC) వచ్చే 10 ఏళ్ల కాలానికి గుర్తింపు లభించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో భారత్‌లో వైద్య విద్య అభ్యసించిన వారు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్‌లలో పీజీ కోర్సుల్లో చేరడంతో పాటు ప్రాక్టీస్‌ చేయొచ్చని వెల్లడించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కెనడాలో వీసా సర్వీసులను నిలిపివేసిన కేంద్రం..!

ఖలిస్థానీ అంశంలో భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్‌కు వచ్చే కెనడా పౌరులకు కేంద్ర ప్రభుత్వం వీసా సేవలను నిలిపివేసింది. ఈ విషయాన్ని విదేశీ వ్యహారాల శాఖ వర్గాలు వెల్లడించాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కెనడాలో మరో ఖలిస్థానీ సానుభూతిపరుడి హత్య

ఖలిస్థానీ అంశంలో భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో ఘటన చోటుచేసుకుంది. కెనడా (Canada)లో మరో ఖలిస్థానీ సానుభూతిపరుడు హత్యకు గురైనట్లు తెలుస్తోంది. విన్నిపెగ్‌లో బుధవారం ప్రత్యర్థి గ్యాంగ్ జరిపిన దాడిలో గ్యాంగ్‌స్టర్‌ సుఖ్‌దోల్‌ సింగ్‌ అలియాస్‌ సుఖా దునెకే (Gangster Sukha Duneke) మరణించినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని