Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. అంగళ్లు కేసులో జోక్యానికి సుప్రీం నిరాకరణ
అంగళ్లు కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఘటనలో తెదేపా నేతలకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఆరు వేర్వేరు పిటిషన్లను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో తెదేపా నేతలకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సుప్రీంకోర్టు సమర్థించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. మోదీ.. ఎంతకాలం ఈ అబద్ధాల జాతర?: కేటీఆర్
ప్రధాని మోదీ మంగళవారం నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. ఈనేపథ్యంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ఆయనకు కొన్ని ప్రశ్నలు సంధించారు. ‘‘మా మూడు ప్రధాన హామీల సంగతేంటి? కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు? బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు? పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కేదెప్పుడు?మూడ్రోజుల్లో రెండోసారి వస్తున్నారు.. ఆ మూడు విభజన హక్కులకు దిక్కేది?పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. కెనడాకు భారత్ అల్టిమేటం.. అక్టోబరు 10లోగా దౌత్యసిబ్బందిని తగ్గించుకోవాలని డెడ్‌లైన్..!
ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ (Nijjar Killing) హత్య కేసుతో భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు (India-Canada Diplomatic Row) కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్‌లో వారి దౌత్య సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలని కెనడాకు న్యూదిల్లీ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. అక్టోబరు 10లోగా దాదాపు 40 మంది దౌత్య సిబ్బందిని వెనక్కి పిలిపించుకోవాలని ఒట్టావాకు చెప్పినట్లు సమాచారం.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. రాజమహేంద్రవరం బయల్దేరిన అమరావతి రైతులు.. మార్గంమధ్యలో అడ్డుకున్న పోలీసులు
తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిని కలిసేందుకు రాజధాని అమరావతి ప్రాంత రైతులు రాజమహేంద్రవరం బయల్దేరి వెళ్లారు. అయితే మార్గంమధ్యలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. మంగళవారం ఉదయం రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు, వెలగపూడికి చెందిన రైతులు ప్రత్యేక బస్సులు, సొంత వాహనాల్లో పయనమయ్యారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. గూగుల్ విధానాలే.. ప్రత్యర్థుల ఎదుగుదలకు అడ్డు: సత్య నాదెళ్ల
సెర్చింజన్ మార్కెట్‌లో గూగుల్ ఆధిపత్యం వల్ల ప్రత్యర్థి సంస్థలు ఎదగడం చాలా కష్టంగా మారిందని మైక్రోసాఫ్ట్ (Microsoft) సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) ఆరోపించారు. ఈ క్రమంలో గూగుల్ (Google) అనుసరిస్తున్న వ్యాపార పద్ధతులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యూఎస్‌లోని ఓ కోర్టులో మాట్లాడుతూ ఆయన (Satya Nadella) సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రభుత్వం, గూగుల్ (Google) మధ్య జరుగుతున్న యాంటిట్రస్ట్ విచారణలో ఆయన తన వాదన వినిపించారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. హడలెత్తించిన నేపాల్.. ఉత్కంఠ పోరులో భారత్‌దే విజయం
ఓ పక్క వికెట్లు పడుతున్నా.. ఏమాత్రం బెదరకుండా పోటీపడీ మరీ సిక్స్‌లు బాదేశారు నేపాల్ బ్యాటర్లు. ఇప్పటికే టీ20ల్లో రికార్డులు సృష్టించిన ఆ జట్టు చేతిలో భారత్‌కు ఓటమి తప్పదా..? అన్నట్లుగా ఒకానొక దశలో మ్యాచ్ సాగింది. కీలక సమయంలో మన బౌలర్లు రాణించడంతో చివరికి భారతే (IND vs NEP) విజయం సాధించింది. దీంతో ఆసియా క్రీడల్లో సెమీస్‌కు దూసుకెళ్లింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. హైడ్రోజన్ బస్సులో ప్రయాణించిన నితిన్ గడ్కరీ
అత్యంత అధునాతన సాంకేతికతో అభివృద్ధి చేసిన హైడ్రోజన్ ఫ్యూయల్ బస్సులో భారత రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ప్రయాణించారు. చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్‌లో నిర్వహించిన 27వ వరల్డ్ రోడ్ కాంగ్రెస్‌లో పాల్గొన్న ఆయన సోమవారం హైడ్రోజన్ ఫ్యూయల్ (Hydrogen Bus) బస్సులో ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోను ఆయన సోషల్‌మీడియాలో పంచుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. మాజీ మంత్రి నారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని, అలానే ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. అరెస్టు చేయవద్దన్న గత ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం మరో రెండు వారాలు పొడిగించింది. అనంతరం విచారణను ఈనెల 16కు హైకోర్టు వాయిదా వేసింది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. బైక్ దొంగల వెనుక ఉగ్ర నెట్‌వర్క్.. ఆ టెర్రరిస్టులందరూ ఇంజినీర్లే..!
దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌ల్లో నిన్న జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకొన్న ఐసిస్ ఉగ్రవాదులందరూ ఉన్నత విద్యావంతులే. ఈ విషయాన్ని దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సీనియర్ అధికారి హెచ్‌జీఎస్ దాలివాల్ వెల్లడించారు. వీరిలో కీలక నిందితుడైన షానవాజ్, అతడి అనుచరులు రిజ్వాన్ అష్రాఫ్, మొహమ్మద్ అర్షద్ వార్సి ఇప్పటికే దేశవ్యాప్తంగా రెక్కీలు నిర్వహించినట్లు కూడా వెల్లడించారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ ప్రారంభం
తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ముందు వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపిస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు.. -
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు.. -
Supreme court: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) బెయిల్ రద్దు కోరుతూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. -
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/11/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.


తాజా వార్తలు (Latest News)
-
Rat Hole Mining: నిషేధించిన విధానమే.. 41మందిని కాపాడింది!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Uttarakhand Tunnel: ఆపరేషన్ టన్నెల్.. క్షేమంగా బయటపడిన 41 మంది కూలీలు
-
1 నుంచి TCS బైబ్యాక్.. 20 శాతం ప్రీమియంతో షేర్ల కొనుగోలు
-
Team India: పెళ్లిపీటలెక్కబోతున్న భారత్ ఫాస్ట్ బౌలర్
-
Uttarakhand Tunnel: ఎట్టకేలకు బాహ్య ప్రపంచంలోకి.. సొరంగం నుంచి సురక్షితంగా బయటికొస్తున్న కూలీలు