Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 09 Jul 2024 13:00 IST

1. బైడెన్‌ పార్కిన్సన్స్‌ చికిత్స తీసుకుంటున్నారా?.. స్పందించిన వైట్‌హౌస్‌

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఆరోగ్యంపై ఇప్పటికే పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ విషయం మరో వివాదానికి తెర తీసింది. అమెరికాలో పార్కిన్సన్స్‌ స్పెషలిస్ట్‌గా పేరుగాంచిన ఓ వైద్యుడు ఈ ఏడాది బైడెన్‌ వ్యక్తిగత డాక్టర్‌ను కలిసినట్లు శ్వేతసౌధం లాగ్‌ బుక్‌ ద్వారా తెలిసింది. పూర్తి కథనం

2. మోదీ-పుతిన్‌ గోల్ఫ్‌ కారులో షికారు.. నెట్టింట వీడియో చక్కర్లు

రష్యా (Russia) పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ (PM Modi)కి విశేష ఆదరణ లభిస్తోంది. అధ్యక్షుడు పుతిన్ (Putin) వెంటే ఉండి, తన అధికారిక నివాసాన్ని చూపించారు. ఆ సమయంలో వారిద్దరూ గోల్ఫ్‌కార్ట్‌లో షికారు చేశారు. ఆ ఇంటి ప్రాంగణంలో తిరుగుతూ ముచ్చటించుకున్నారు. పూర్తి కథనం

3. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన వాతావరణ శాఖ

రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు, కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, అరుణాచల్‌ ప్రదేశ్‌ల్లో భారత వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ (red alert) ప్రకటించింది. నిన్న ముంబయిలో భారీ వర్షాల దెబ్బకు జనజీవనం స్తంభించిన విషయం తెలిసిందే. ఇక అస్సాం, మేఘాలయాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ను ప్రకటించింది.  పూర్తి కథనం

4. ‘అందుకే టీమ్‌ఇండియా హెడ్‌ కోచ్‌ ప్రకటన ఆలస్యం’

టీమ్ఇండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం 2024 టీ20 ప్రపంచకప్‌తో ముగిసింది. త్వరలోనే కొత్త కోచ్‌ను నియమించనుంది బీసీసీఐ. ఈ నెలాఖరులో శ్రీలంకతో ప్రారంభమయ్యే టీ20, వన్డేల సిరీస్‌లకు కొత్త కోచ్‌ అందుబాటులో ఉంటాడని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించాడు.  పూర్తి కథనం

5. బికినీ ధరించలేదని తిట్టాడు: చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్న నటి

‘బొంబాయి’తో దక్షిణాది సినీప్రియులకు చేరువయ్యారు నటి మనీషా కొయిరాల (Manisha Koirala). ఆ సినిమా విజయం తర్వాత పలు కోలీవుడ్‌ చిత్రాల్లో నటించి మెప్పించారు. కెరీర్‌ ప్రారంభంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని మనీషా తాజాగా గుర్తుచేసుకున్నారు.   పూర్తి కథనం

6. వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి 27 చీరలు, స్వామివారికి 11 పంచెలతో అలంకారం చేశారు. స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ప్రభుత్వం తరఫున మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పూర్తి కథనం

7. కృష్ణానది పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులపై సుప్రీం కోర్టులో విచారణ

కృష్ణానది పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకువచ్చే అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి విద్యుత్ ఉత్పత్తి, ఇతర అవసరాలకు అనుమతులు లేకుండా నీటిని వినియోగిస్తున్న విషయంపై ఆంధ్రప్రదేశ్‌ గతంలో పిటిషన్ దాఖలు చేసింది. పూర్తి కథనం

8. వైకాపా భూ అక్రమాలపై సిట్‌ ఏర్పాటు చేయాలి: ప్రత్తిపాటి పుల్లారావు

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా వైకాపా నేతల భూ అక్రమాలపై సిట్‌ ఏర్పాటు చేయాలని తెదేపా నేత ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. చిత్తూరు నుంచి ఉత్తరాంధ్ర వరకు వైకాపా నేతలు వేల ఎకరాలు దోచుకున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో సీఎం నుంచి సీఎస్‌ వరకు అంతా కుమ్మక్కై భూములు దోచుకున్నారని ధ్వజమెత్తారు. పూర్తి కథనం

9. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే కాంగ్రెస్‌: కేటీఆర్‌

పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్‌ పార్టీ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. భారాస నేతలు హరీశ్‌రావు, సురేశ్‌రెడ్డిలతో కలిసి దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే కాంగ్రెస్‌ పార్టీ.  పూర్తి కథనం

10. మూడోసారి ప్రమాణం చేశా.. మూడు రెట్ల వేగంతో పనిచేస్తా: రష్యాలో ప్రవాస భారతీయులతో మోదీ

రాబోయే ఈ ఐదేళ్ల పదవీకాలంలో భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మారుస్తామని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. ఇటీవలే మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశానని, మూడు రెట్ల వేగంతో పని చేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని